Bathuku (Life)Photo Essay

గదుల్లో గ్రంథాలు… చెట్ల కింది పఠనాలు

లైబ్రరీలు లేకుంటే గతం లేదు,లైబ్రరీ లేకుంటే భవిషత్తు లేదు అంటారు పుస్తక ప్రియులు.లైబ్రరీలు గతాన్ని గురించి  తెలియజేస్తాయి. ప్రస్తుతం గురించి అవగాహన కలిపిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి ఊహలు,ఆలోచనలు రేకెత్తిస్తాయి. హైదరాబాద్ లో   ఓయూ యూనివర్సిటీ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రెరీలు ఆ కోవలోకే వస్తాయి.  ఆ తర్వాత దశాబ్దాలపాటు సాహిత్యసమావేశాలకు నెలవుగా, పఠనానికి కేంద్రం గా వున్న లైబ్రరీ చిక్కడపల్లి సిటీసెంట్రల్ లైబ్రరీ.

ఎప్పటినుంచి వుంది?
-1960వ సంవత్సరంలో హైదరాబాద్ నడి బొడ్డున చిక్కడపల్లి లో ఏర్పాటు అయిన ఈ లైబ్రరీ నేడు  1000మంది నిత్యవిద్యార్థులను,500అనుదిన సందర్శకులను కలిగివుంది.దాదాపు 30మంది   సిబ్బంది రెండు షిఫ్టుల వారీగా ఈ లైబ్రరీకి సేవలు అందిస్తున్నారు.
ఎవరు ఈ విద్యార్థులు?

చిక్కడపల్లి కి సమీపంలో  సివిల్స్ కోచింగ్,గ్రూప్స్ కోచింగ్ ఇన్సీ ట్యూట్లు ఎక్కువగా ఉండటం తో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడ కోచింగ్ నిమిత్తం వచ్చిన విద్యార్థులు కోచింగ్ అయిపోయాక ఇక్కడే చిన్న రూమ్ తీసుకుని వుంటూ,ఇక్కడి లైబ్రరీ లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు.లైబ్రరీ లోపల కొంతమంది, లైబ్రరీ వెలుపల చెట్ల నీడన కొంతమంది వుంటారు . వెలుపల అయితే  తాము సొంతంగా ఏర్పాటుచేసుకున్న కుర్చీల్లో  కుర్చుని,భూగోళం బద్దలు అవుతున్నా తమకి పట్టనట్లుగా తలలు కిందకి వంచి చదువుతూ వుంటారు.

ఉదయం పాలఅబ్బాయి  తిరిగే సమయంలోనే వీరు లైబ్రరీలో వుంటారు.అర్థ రాత్రి వాచ్ మెన్లు డ్యూటీ ఎక్కేసరికి వీరు రూమ్ కి వెళ్తారు.
ఇక్కడ చెట్ల కింద చదువుకొన్న అనేక వేల మంది నేడు సమాజంలో అత్యున్నత స్థాయిలో వున్నారు.వీరిలో కొంతమంది అప్పుడు అప్పుడు లైబ్రరీ కి వచ్చి లైబ్రరీ లో గడిపిన ఆజ్ఞాపకాలని గుర్తుచేసుకుంటూ  వీలయితే లైబ్రరీ కి  తమవంతుగా కొంత ఫండ్ సహయం చేసి వెళతారు.అలా ఒక విద్యార్థి పెద్ద మనసుకు నిలువెత్తు నిదర్శనం లైబ్రరీ వెలుపల గల ఆడిటోరియం.ఇక్కడే నేడు లైబ్రరీకి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తారు.
వేలకొలది పుస్తకాలు

లైబ్రరీ లో చరిత్ర, అర్థశాస్త్రం,పౌరశాస్త్రం, సామజిక శాస్త్రం, సైన్సు పుస్తకాలు ,ఆంగ్ల బాష పుస్తకాలు, ,కవితలు,నవలలు,కథలకి సంబంధించిన ఫిక్షన్ పుస్తకాలు విరివిగా వేల సంఖ్యలో ఉంటాయి.

డిజిటల్ లైబ్రరీ
మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ లైబ్రరీ లో డిజిటల్ లైబ్రరీ వుంది. .ఏ విద్యార్థి అయినా గంటకి రూ.5చెల్లించి దీనిని ఉపయోగించుకోవచ్చు.
మహిళలకు ప్రత్యేకం
మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకుండా  ప్రత్యకంగా రీడింగ్ హాళ్ళు ఉన్నాయి.ప్రత్యేకంగా వాష్రూమ్స్ సదుపాయాలు వున్నాయి.
రూ.5కే భోజనం

హైదరాబాద్ లో నేడు డబ్బుపెడితే చదువుకోవడానికి వందల సంఖ్యలో స్టడిహాళ్ళు ఉన్నాయి.వీటిలో ఏసీ హాళ్ళు,స్నాక్ సదుపాయాలు ఉన్న స్టడీ హాళ్ళు కూడా ఉన్నాయి. కానీ వీటికి నెలకు 1500రూ నుండి రూ.3000వరకు డబ్బు చెల్లించాలి.కానీ సెంట్రల్ లైబ్రరీ లో పైసా కుడా చెల్లించలేకనవసరంపోవడంతో ఇక్కడికి పేద,మధ్య తరగతి విద్యార్థులు,గ్రామీణ విద్యార్థులు వచ్చి చదువుకుంటారు.అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకి రూ.5 కే మధ్యాహ్నం 12గంటల నుండి1గంట వరకు  భోజన సదుపాయాన్నీ కలిపిస్తుంది.

నిధులు లేని లైబ్రరీ
గత 5సంవత్సరాల నుండి అరకొరగా మాత్రమే నిధులు వస్తున్నాయి.ఇవి లైబ్రరీ నిర్వహణ కి ఏ మాత్రం సరి పోవడం లేదు. వేసవికాలంలోకూడా  రీడింగ్ రూమ్ లో కొన్ని ఫ్యాన్లు పనిచేయక, వాష్ రూమ్ల మెయింట్ నెన్స్ సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిలిచిన మొబైల్ లైబ్రరీ సేవలు
ప్రజల వద్దకే పుస్తకాలను చేరవేయలన్న లక్ష్యం తో ఏర్పాటు అయిన మొబైల్ లైబ్రరీ వాహనం నేడు ఇలా శిథిలావస్థలో ఉంది.
ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో తెలీదు
సర్కారులు  అరకొరగా నోటిఫికేషన్ లు ఇస్తూ,కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంటు చేస్తూ తమకు సరైన అవకాశం ఇవ్వట్లేదని ,ఇప్పటికైనా ప్రభుత్వాలు నిరుద్యోగులకు సరైన ఉపాది అవకాశాలు కల్పించాలని అక్కడి ఉద్యోగార్థులు పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఫోటోలు, వ్యాసం: తిరుపతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *