Bathuku (Life)Photo Essay

కొడుకులకు అండగా ’వెండి‘ కొండలు!

*ఓ నాన్నా నీ మనసే వెన్న… అమృతం కన్న అది ఎంతో మిన్న……ముళ్ల బాటలో నీవు నడిచావు.పూల బాటలో మమ్ము నడిపావు*… అన్నారు సాహిత్య శిఖరం సి. నారాయణరెడ్డి.
నిజమే నాన్న మనసు వెన్నే..అది అమృతం కూడా సరితూగదు.
నాన్న అనే రెండు అక్షరాల పదం చాలు కొండంత దైర్యం…
ఆ రెండు అక్షరాలే ప్రేమ,ఆప్యాయత, భాద్యత.
ఎలాంటి కష్టం ఉన్న పంటి బిగువున దాన్ని దాచుకొని పైకి సంతోషంగా కనిపించేవారు నాన్నే.
మాతృమూర్తి నవ మాసాలు మోసి మనకి జన్మనిస్తుంది.
తండ్రి మనకు మార్గాదర్శిగా  నిలుస్తాడు.
మనం ముసిముసి నవ్వులు నవ్వుతూ నాన్న ఎదపై లేత పాదాలతో తన్నుతుంటే ఆయన గుండె చప్పుడు ‘లబ్ డబ్’ అని కాకుండా మన అడుగులు చప్పుడు వినిపిస్తోంది కాబోలు. అందుకేనేమో ఆయన మోమూ పై సంతోషం వెల్లివిరిస్తుంది..
కొడుకు భారాన్ని భుజాలపై మోస్తూ ఆకాశమంత ఎత్తు ఎదగాలని కోరుకుంటారు. మన చిటికిన వేలు పట్టుకొని చిట్టీబుట్టి అడుగులు వేయిస్తూ లోకాన్ని చూపిస్తారు..
ఒక గురువులా హితబోధ చేస్తారు.ఓడినప్పుడు మన  భుజం తట్టి  స్నేహితుడిలా దైర్యం చెప్తారు.
నాన్న మన పై కోపం చూపించడం, రేపటి భవిష్యత్తులో మనల్ని  ప్రతిభవంతునిగా చూడలన్నదే ఆయన తపన…
తల్లిదండ్రులకంటూ ఒక రోజు ఉండటం తప్పుకాదు. తల్లిదండ్రులను ఇద్దరిని వేరుగా చూడలేం.పురాణాల్లో పరశురాముడు తన తల్లిదండ్రుల మాటను జవదాటలేదు.
ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. మన జీవితంలో మన ఎదుగుదలకు తీర్చిదిద్దేది వారిద్దరే.
అందుకే ప్రతి సంవత్సరం జూన్   మూడో వారంలో ఫాదర్స్ డే గా జరుపుకుంటున్నం.వారి రుణం తీర్చుకోలేనిది.అలాంటి నాన్న ను ఫాదర్స్ డే రోజు వారితో ఆనందంగా ఉంచంటం ప్రతి ఒక్కరి బాధ్యత…
అయితే రీల్ జీవితంలోని కొన్ని పాత్రలు, రియల్ జీవితంలోనూ తండ్రికి తగ్గ కొడుకులు ఆనిపించుకునేవారు ఉన్నారు.
తెలుగు సినిమా చరిత్రలో ఎవరి అండదండలు లేకుండా కష్టపడి పైకి వచ్చిన  వారు అతికొద్ది మంది మాత్రమే…
 కొడుకుతో ‘మెగా’ బంధం
సినీ లోకంలో ”పునాదిరాళ్లు”వేసి ‘స్వయంకృషి’తో ఎదిగి ప్రేక్షకుల  కు అన్నయ్యగా మారారు.
ఒక చిన్న ‘చిరు’నవ్వు నవ్వితే చాలు అభిమానులు ‘జై చిరంజీవ’ మురిసిపోయే వారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి.నేటికి ఆరు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ మెగాస్టార్ గానే సినిమాలో మెరు‌స్తున్నారు.
అలాంటి స్టార్ కడుపున పుట్టిన  బిడ్డ రామ్ చరణ్..
చిరు’త’నుయుడిగా మెగా ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట సినిమాలో డాన్స్,స్టైల్, లుక్స్ లో చిరంజీవికి ఏ మాత్రం తీసిపోలేదు.
అనంతరం కొద్దికాలం తరువాత ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రెండో సినిమా ‘మగధీర‘ చేశారు. ఆసినిమాలో తనకంటూ ప్రేత్యేకత సాధించారు ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.అలా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. కొంతకాలం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చారు.
ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘రంగస్థలం’ తర్వాత నటనలో పూర్తి పరిపూర్ణత కనబరిచారు. అప్పటి వరకు చిరంజీవి గారి అబ్బాయిగానే  కనిపించారు.
చిరంజీవి నటించిన ఖైదీ నెo 150 నిర్మాతగా చేసారు.
రామ్ చరణ్ తన తండ్రిని స్పూర్తిగా తీసుకుని అయన ధైర్యమే దైవంగా భవిస్తారు.ఎన్ని కష్టాలు ఎదురైన  ఎప్పుడు నవ్వుతూనే ఉంటారని. ఇండస్ట్రీలో క్రమశిక్షణగా ఉన్నవారే ఎదుగుతారు అని చెప్పేవారాని ,మంచి అలవాట్లు చేడు ఆలవాట్లు తెలుసుకోవలని కొడుకుకి చిరంజీవి హితవు చేసేవారు.
రామ్ చరణ్ ,చిరంజీవిల మధ్య బంధం ఎప్పుడూ  గురు శిష్యుల బంధంలా ఉంటుంది. చరణ్ తన తండ్రికి ఏదీ దాచకుండా చెప్పేవాడినని తన ప్రేమ వ్యవహారం సైతం నాన్నకి ముందుగా చెప్పానని గతంలో రామ్ చరణ్  పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పేవారు.
చిరంజీవి కూడా తన కొడుకు ఎదుగుదల చూడాలనే తాపత్రయం అంతా ఇంతా కాదు. అయినప్పటికీ ఎవరికి వారు  వరుసగా సినిమాలు చేస్తూ తండ్రి రికార్డులు కొడుకు, కొడుకు రికార్డులు తండ్రి బద్ధలు కొడుతూ పోటీతో ముందుకు సాగుతున్నారు.
మనం‘ అంటే నాగ్ పుత్ర ద్వయం
నట సామ్రాట్   అక్కినేని కుటుంబం నుంచి ఓనమాలు దిద్దుకుని వచ్చారు నాగార్జున.ఆయన మొదటి కుమారుడు నాగచైతన్య హీరోగా మంచి ‘జోష్’తో తెరంగ్రేటం చేశారు. యవ్వనంలో ‘శివ’ సినిమా టైంలో నాగార్జున ఎలా వుండేవారో అచ్చుగుద్దినట్లు అలానే వుండేవారు. ‘ఏం మాయ చేసావే’ అంటూ ప్రేక్షులకులను మాయ చేశారు ఈ అక్కినేని చిన్నోడు. అక్కినేని కుటుంబంలోని  మూడు తరాలు కలిసి ‘మనం’ మూవీ చేశారు.
వీరి రిలేషన్ చూసిన ప్రతి ఒక్కరికి
 “పగలే గడిచింది..పడమర పిలిచింది. వయస్సు బండి వాలుతున్న సూర్యుడిని నేను…”
“రాత్రి కరిగింది..తూరుపు దొరికింది..కళ్ళు తెరిచి ఇప్పుడే ఉదయిస్తున్నాను..”
ఒక సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునకు చెప్పే సందేశం వీరి కుటుంబాన్ని చూస్తే ఇదే గుర్తుకొస్తుంది.
నిజ జీవితంలో ఒక కుటుంబం వారు తెరపై కనిపించటం సినీ చరిత్రలో ఒక అరుదైన సంఘటనే.
నాగార్జున, నాగచైతన్య ఇద్దరు ప్రతి ఇంటర్వ్యూ లో తాము స్నేహితులమే అంటారు. వాస్తవంగా ఈ తండ్రి కొడుకులను ఎవరు చూసిన స్నేహితులుగానే భావిస్తారు.
తండ్రిలానే కొడుకు కూడా నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కూడా సినిమాల్లో రాణిస్తున్నరు.ప్రతి దానిలో నాగార్జున తన కొడుకుల పట్ల ఆయన ఎంత శ్రద్ధ వహిస్తారో చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.
ఇద్దరూ ‘మంచు’ ముత్యాలే
వీరేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆయన కుమారులు మనోజ్, విష్ణులకు ఎంతో స్వేచ్ఛని ఇచ్చేవారు.మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఆయనలోని తెలివిని,క్రమశిక్షణను ఫాలో అవుతారు ఇద్దరి కుమారులు.
ప్రజాసేవలోను ముందుంటుంది మంచు కుటుంబం.
సాయి ‘స్వర’ పరంపర
సాయికుమార్ ఆయన కుమారుడు ఆది, శ్రీకాంత్ ఆయన కుమారుడు రోషన్,
మహేష్ బాబు ఆయన కుమారుడు గౌతమ్ ఇలా అనేక మంది నటులు వాళ్ళ పుత్రులతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
కొడుకుల భవిష్యత్తు కోసం తండ్రులు పడే తపన చూస్తే ….వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే……
-’తెలుగూస్’ ఫిలిం బ్యూరో

(ఫాదర్స్ డే సందర్భంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *