వారికి శ్రమే యోగా!
తెలిసో,తెలియకనో అందరూ యోగ చేస్తారు.
యోగా అంటే అదేదో ఉద్యోగ విరమణ పొందిన వృద్దులు చేసేది. కొద్దోగొప్పో చదువుకుని ఆరోగ్యం పై శ్రద్ద ఉన్నవారు ఎక్కువగా చేసేది అనుకుంటాం.ఇలా భావిస్తే మీరు సగం యోగా తెలుసుకొని యోగసనం వేసి ఆసుపత్రి లో చేరినవారిలాగా పొరబడినట్లే.
యోగ నేడు విద్యార్థులు, వైట్ కాలర్ జాబ్ చేసే రకరకాల వర్గాలకు చెందిన ఉద్యోగులలో,అధిక ఆదాయ వర్గానికి చెందిన వారిలో ఎక్కువగా ఉందనేది నిజం.కానీ ప్రత్యక్షంగా నేడు యోగా చేసే వారిలో కార్మికుల సంఖ్య తక్కువే అయినప్పటికి వారి వారి వృత్తి లో భాగంగా నేడు అందరూ యోగాసనాలను వేస్తున్నారు.ఇలా శ్రమజీవులు వారికి తెలియకుండానే వారి వారి పనుల్లో బాగంగా అనేక రకాల యోగాసనాలను వేస్తూ,ఆరోగ్యాన్ని పదిలం చేసుకుంటున్నారు.అలా వారు పనుల్లోఉండగా చేసే యోగాసనాలను తెలుగూస్ వెబ్సైట్ సేకరించింది.
1}అరటిపండ్ల అమ్మకం దాదాపు అయిపోవడంతో తోపుడు బండిపై శవాసనం లాగా వుండే “విశ్రాంతి ఆసనంలో” అరటిపండ్ల అమ్మకందారుడు.దీనివల్ల నడుం నొప్పి తగ్గితుంది అని యోగా నిపుణులు చెబుతున్నారు.
2)ఒక కాలు మోకాలి వద్ద మలిచి “అర్ధ మత్స్యేంద్ర” ఆసనం లో లాగా తోపుడుబండిపై కూర్చుని అరటిపండ్లు అమ్ముతున్న మరో వ్యక్తి.
3)ప్రాణాయామ ఆసనంలో మాదిరి కూర్చొని కర్బూజా పండ్లు అమ్ముతున్న చిరు వ్యాపారి.
4)ఒకకాలు మలిచి ఒక కాలు చాపుకొని “అర్ధ మత్స్యేంద్ర”ఆసనం వలె కాళ్లు పెట్టి పూలమాల తయారు చేస్తున్న చిరు పూల వ్యాపారి.
5)”ఉత్తన్నాసనం”లో లాగా నడుం ను వొంచి ఇంటిని శుభ్రం చేస్తున్న వృద్ధ మహిళ.
6)వీరభద్ర ఆసనంలో లాగా చేతులు చాపి భవనాన్ని నిర్మాణం చేస్తున్న భవన కార్మికుడు.
-తెలుగూస్ లైఫ్ స్టయిల్ డెస్క్