చీలిక బాబు మంత్రం- కలయిక జగన్ తంత్రం
వచ్చిన సంక్షోభాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నా.. ఉన్న అవకాశాన్ని తగువిధంగా సద్వినియోగం చేసుకోవాలన్నా… చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని రాజకీయ పరిశీలకులు అంటుంటారు.
గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తో పొత్తు ఒక వైపూ, అప్పుడే మొగ్గ తొడిగిన జనసేనతో మద్దతు మరొక వైపూ పెట్టుకొని రాష్ట్రంలో పీఠం కైవసం చేసుకున్నారు బాబు. ఒక ముక్కలో చెప్పాలంటే ిిఇది ముప్పేట గెలుపు.
త్యాగమో… ముందుచూపో…ప్రక్కన పెడితే… రాష్ట్రంలో వారి త్రయం గెలుపుకోసం తన శక్తి మేర దోహదపడిన పవన్ మాత్రం అధికారంలో పాలుపంచుకోలేదు .ఉన్నట్టుండి కాకపోయినా.. క్రమేపి… వీరి పొత్తు,మద్దతులు నీరు గారి… ఎవరికి వారుగా… ఎన్నికల రణ రంగానికి సిద్ధపడుతున్నారు.
నిన్నటి వరకూ స్వపక్షాలుగా వున్న బీజేపీ, జనసేనలు ప్రధాన విపక్షం వైసీపీ సరసన కూర్చున్నాయి
వీరుఎవరికి వారు ఎంత బలంగా ఉంటే… తనకు తన పార్టీకి అంత శ్రేయస్కరం అని రాజకీయ చతురుడయిన చంద్రబాబు ఇట్టే పసిగట్టారు.
ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వుండటానికి …విపక్షాలను ఏకం చెయ్యాలి. ఈ పనిలో … వైసిపి నిమగ్నమయినట్టుగానే వుంది.
ఐతే వైసీపీకి ఆటంకాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా చెప్పుకోవలసి వస్తే… బీజేపీతో చేతులు కలిపితే… తన వెనుక నిత్యం అండగా, బలంగా ఉన్నటువంటి… ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకుకు గండిపడే ప్రమాదం కూడా లేకపోలేదు. మరోవైపు పవన్ విషయానికోస్తే… వ్యక్తిత్వపు పరమైన ఆటంకాలు ఎదురవుతాయి. జగన్ కు జూనియర్ పార్టనర్ గా వుండటానికి పవన్ అంగీకరించరు. ఇటువంటి సమయంలో జగన్ ఎంత పరిణితితో వ్యవహస్తారు అన్నదే ముందు ముందు తేలుతుంది.
-తెలుగూస్ పొలిటికల్ బ్యూరో