కోదండరాముడు చెయ్యి ఊపుతారా? ’చెయ్యి‘ కలుపుతారా?
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు ఒక ఉద్యమ సారథిగా కనిపించారు. ఈరోజు పక్కలో బల్లెం లాగా త యారైయ్యారని దూరం పెట్టారు. అయినా పట్టువిడవకుండా ముందుకు సాగుతూనే వున్నారు. ఆయనేవరో ఇప్పటికే తెలిసుండాలే. తెలంగాణ ఉద్యమంను ముందుండి నడిపిన ఉధ్యమ సారథి ప్రొ. కోదండరామ్.
ఉద్యమ సమయంలో అన్ని పార్టీలను కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఒక తాటిపైకి తెచ్చి, ముందుండి నడిపించడంలో తాను కీలకపాత్ర పోషించారు. స్వరాష్ట్రం సాధించుకున్నాక ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ స్థాపించి ఎన్నికల సమరంలోకి వెళుతున్న విషయం తెలిసిందే.
అయితే రాష్ట్రమంతా కూడా పాలన ఏకపక్షంగా నడుస్తున్నదనే విమర్శలు ప్రస్తుత ప్రభుత్వంపై చాలానే ఉన్నాయి. అయితే ఈ వచ్చే ముందస్తు ఎన్నికలల్లో ప్రతిపక్షాలన్నీ(కాంగ్రెస్, టి.డి.పి., సి.పి.ఐ. మొ.) కలిసి మహాకూటమిగా ఏర్పడుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలోనే కోదండరాంను మహాకూటమి నేతలు కలిశారని సమాచారం. వారు కోదండరాంను కలిసి మహాకూటమిలో భాగం కావాలని కోరినట్లు, అందుకు తాను సిద్ధం అయినట్లు సమాచారం.
మిత్రువులు శత్రువులుగాను, శత్రువులు మిత్రువులుగాను అవుతారంటే ఏమో అనుకుంటాము గానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడవచ్చు తెలంగాణ రాజకీయాలను సునిశితంగా పరిశీలించినట్లయితే. కోదండరాం మహాకూటమితో కలిసి ఎన్నికలలోకి వెళితే కోదండరామ్‌కి కలిసొ చ్చే అంశాలేవి? ఆయనకు రాజకీయంగా ముందు భవిష్యత్ ఉంటుందా? ఇవి ప్రస్తుతం సమాదానాలు లేని ప్రశ్నలే.
కోదండరామ్ మహాకూటమితో కలిస్తే, కొంతమేరనైనా అసెంబ్లీలో తన ఖాతాతెరవచ్చు అని కొంత మంది భావిస్తే, మరికొంతమంది ప్రస్తుతానికి ఖాతా తెరుస్తారు సరే. కానీ తర్వాత పార్టీ భవిష్యత్ కూడా చూడాలనే విషయాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. అయితే ఒంటరిగా వెళితేనైనా కొంత ఓటింగ్ శాతాన్ని చూపించుకుని తన బలాన్ని నిరూపించుకోవచ్చని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా వుంటే, మరొక అంశం: మొదటి నుండి కోదండరామ్‌తో వున్న క్యాడర్ 2014 ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీకి చేరువయితే, ప్రస్తుతం మహాకూటమితో పొత్తు కూడితే ఆ కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే అవకాశాలెక్కువున్నట్లు భావిస్తున్నారు విశ్లేషకులు.
మరీ వీటన్నింటి దృష్ట్యా కోదండరామ్ ఏ వైపుకు తన అడుగులు వేస్తారో మరీ..! తాను నమ్ముకున్న ప్రజలవైపా? తనను ఆకర్షిస్తున్న పార్టీల వైపా ?? అనేది తెల్చుకోవాల్సింది కోదండరామే.