‘అమృత’ను కలిసిన చెన్నై ‘అమృత’..!?
వారిద్దరికి ఏలాంటి సంబంధం లేదు. ఒకరికోకరు ఏమి కారు. ఎప్పుడు కలుసుకోలేదు… ఇంతకుముందు మిత్రత్వం గానీ, బందుత్వం గానీ లేవు. కనీసం ఒకే భాష మాట్లాడేవారు కారు. కానీ, వారిద్దరి భాద, వేదన వారిని కలిసేట్లు చేసింది. ఇలా కలవడం భాదకరమే…కానీ ఏం చేయలేని స్థితి. వారేవరు? వారిగురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాపితంగా చర్చనీయంశంగా మారిన సంఘటన ప్రణయ్-అమృత జంట ప్రేమ వివాహం గురించే. ప్రణయ్‌ని తన భార్య చూస్తుండగానే హత్య చేసిన విషయం తెలిసిందే. అమృతను పరామర్శించడానికి ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు వచ్చాయి. కానీ తనలోని మానసిక వేదనను మాత్రం తననుంచి దూరం చేయలేకపోయాయి. ఈ సమయంలోనే తనలాంటి భాదే, వేదనను అనుభవించిన, అనుభవిస్తున్న సామాజిక వేత్త కౌసల్యశంకర్, అమృతప్రణయ్‌ని కలిసి ఓదార్పునిచ్చారు. కౌశల్య సంబంధించిన వీడియోను అమృతకు చూపిస్తూ, కొంత సేపు తనతో మాట్లాడారు.
శంకర్ (23) అనే దళిత యువకుడు, కౌశల్య(19)లు తమిళనాడులోని తీర్పూరు జిల్లా ఊడుములా పేటకు చెందినవారు. శంకర్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి జూలై 2015లో పెళ్ళి చేసుకుని ఒక్కటయ్యారు. ఇది ఇష్టంలేని అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఎనిమిది నెలల తర్వాత (13 మార్చి 2016లో) వీరిద్దరిని ఊడుముల పేట బజారులో అడ్డగించి రోడ్డుపై పట్టపగలే కిరాయి ముఠాచే దారుణంగా హత్య చేశారు. ఆ దారుణ ఘటన నుంచి తృటిలో తప్పించుకుని తన భర్తను స్థానికుల సహాయంతో హాస్పిటల్‌కు తీసుకెళ్ళిన ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంనుండి ఎలాగైనా ఇందులోనుండి ఎవరు తప్పించుకోకుండా తండ్రితో సహా, తల్లి, మేనమామ మిగిలిన ఎనిమిది మంది అరెస్టు చేసి, శిక్ష పడేవరకు పోరాడింది.
శిక్ష పడేవరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. బయటకు రాకుండా బెయిల్ కోసం 48 సార్లు ఫిటిషన్ దాఖలా చేసినప్పటికీ, అందుకు తాను 48 సార్లు కౌంటర్ ఫిటిషన్ వేసింది. దీంతో విచారణ కాలం పూర్తయి శిక్ష పడేవరకు జైలులోనే గడిపారు. ఒక పరువు హత్యకు సంబంధించి మరణ శిక్షను విధించడం దేశంలోనే ఇది ప్రథమం. తిర్పూరు కోర్టు డిసెంబర్ 2017న ఈ కేసుకు సంబంధించి 11 మంది అరెస్టు అయిన వారిలో తండ్రి చిన్న స్వామితో సహా అరుగురికి మరణ శిక్షను అమలు చేయగా, మిగిలిన నింధితులకి యావజ్జీవ శిక్షను విధించింది. ఈ కేసు నుండి తల్లి అన్నలక్ష్మీ, మేనమామ పాండిదురైతో సహా కళాశాల విద్యార్థిని ప్రసన్నలను నిర్ధోషిలుగా ప్రకటించి విడుదల చేశారు. ఈ హత్యకు కారణం కేవలం కులమేనని, కులాలకు, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే తమిళనాడు కుల వివక్ష వ్యతిరేక కమిటీని స్థాపించారు.