ప్రస్తుతానికి ఓకే..! మరీ., భవిష్యత్తులో..!?
తెలంగాణ జేఏసీని ఒక్కరుగా మొదటపెట్టి, తెలంగాణలోని ఉద్యోగులను, విద్యార్థులను, రాజకీయ పక్షాలను ఒకటి చేసి, ఏకతాటిపై నడిపించిన వ్యక్తి ప్రొ.కొదండరామ్. తెలంగాణ వచ్చిన ఈ నాలుగు సంవత్సరాలలో ఉద్యమ ఆకాంక్షలు ఏమి నెరవేరలేదని, జేఏసీని కాస్త తెలంగాణ జన సమితి(టి.జే.ఎస్) పార్టీరూపంలో తీసుకొచ్చి ప్రస్తుతం ఎన్నికలలోకి వెళుతున్నారు.
ఈ ఎన్నికలలో కొదండరామ్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్న మహాకూటమితో జత కట్లాలని చూస్తున్న కొదండరామ్‌కి సీట్ల సర్ధుబాటు చర్చ జరుగుతుంది. మహాకూటమిలో కాంగ్రెస్‌తో కలిసి టి.డి.పి, సి.పి.ఐ మరియు టి.జే.ఎస్ ఉన్నాయన్న విషయం తెలిసిందే.
ఈ కూటమిలో మిగిలిన పార్టీలతో కలిపి చూసినట్లయితే, కొదండరామ్ పార్టీ ఎన్నికలలో కొత్తగా అడుగుపెడుతున్న పార్టీ. ఈ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇంకా తేలాల్సివుంది. ఒక వేళ పదుల సంఖ్యలో సీట్లు ఇచ్చినప్పటికీ, అన్ని స్థానాలలో గెలుస్తుందా? అనేది ఏమేరకు బేరీజు వేసుకుంటున్నారు కూడా చూడాల్సి వుంది.
కొదండరామ్‌కు జేఏసీకి ఉన్న కేడర్ అంతా ఇప్పుడు తనతో పాటే ఉన్నారా? వారు పార్టీకి సపోర్టు చేస్తున్నారా? లేదా అనేది కూడా గమనించుకోవల్సిన అవసరం ఉంది. మహాకూటమితో కలిస్తే ఫలితం ఏవిధంగా ఉండనుంది? అనేది పరిశీలించుకోవాలి. ఇప్పుడు కొంతమేర సీట్లు సంపాదించుకుని, అసెంబ్లీలో తన ఖాతా తెరుస్తుడనడంలో సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ, తర్వాత వచ్చే ఎన్నికలలో ఇలాగే ఉంటారా? అప్పటి వరకు తనకి సింగిల్ వెళ్ళగలిగే సత్తా వుంటుందా? అనేది కూడా చూసుకొవాలి. గతంలో టి.ఆర్.ఎస్ పార్టీలో అలె.నరేంద్ర అధ్వర్యంలో నడుస్తున్న పార్టీ తెలంగాణ సాధన సమితిని విలీనం చేశారు. తర్వాత నరేంద్ర అంతకుముందు కనిపించిన బలమైన నాయకునిగా కనిపించలేదు. మరోక ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఇదే టీఆర్ఏస్‌లో సినీనటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని ప్రారంభించి, టి.ఆర్.ఎస్‌లో విలీనం చేశాక తాను అంత పెద్ద నాయకురాలిగా కనిపించలేకపోయింది. బీజేపీలో ఉన్నప్పుడు అద్వానీతో పాటుగా ఒకే వేదికపై బలమైన నాయకురాలుగా ప్రజలలో నిలిచిన వ్యక్తి విజయశాంతి. కాని చివరకు ఏలా చూపించారు. కాబట్టి వీటన్నింటిని ముందుగానే గ్రహిస్తారా? లేదా అనేది మున్ముందు చూడాలి. మరీ!