‘రెబల్స్’ను ‘రెబల్స్’గా ఉంచడమే టీఆర్ఎస్ వ్యూహామా.!?
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పరిణామాలు పార్టీల పరిధి దాటుతున్నాయి. ఇప్పటికింకా కూటమి సీట్ల సర్ధుబాటు జరగనే లేదు. అప్పుడే నామినేషన్‌లు వేసేస్తున్నారు కొన్ని పార్టీల నేతలు.
మహాకూటమి నుంచి సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీలను కాదని వ్యతిరేకంగా నామినేషన్ వేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా చేసినట్లయితే, పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి రెబల్ అభ్యర్థులు పరోక్షంగా సహాకరించినట్లే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాగే సాగితే మరోసారి కాంగ్రెస్ భంగపడినట్లేనని అంటున్నారు. ఇప్పటికే పార్టీలోని వ్యతిరేకత రోడ్ల మీదకు వచ్చింది. అది ప్రత్యర్థి పార్టీలకు ఇంకా లాభం చేకూరేలా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏటంటే… రెబల్ అభ్యర్థులు మరో పార్టీకి పరోక్షంగా సహకరించడం కంటే, ఆ పార్టీలే వీరికి సహకరిస్తాయనడంలో ఎలాంటి సందేహపడాల్సినదేమి లేదు. అయా పార్టీల అభ్యర్థుల కంటే ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న రెబల్ అభ్యర్థులకు సహాకరించడానికి ఎక్కువ మక్కువ చూపడంలో అశ్చర్యపడాల్సిందేమి లేదు. ఎంత ఎక్కువ రెబల్ అభ్యర్థులు నిలుచుంటే, అంతగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చవచ్చనే అలోచనే అందుకు కారణం. పార్టీ నాయకులు. మహాకూటమిగానీ, లేక వివిధ పార్టీల నాయకులు ఇలాంటి నిర్ణయాలను తిప్పికొడుతాయా? లేక ప్రత్యర్థి పార్టీలకు ఊతమిచ్చే విధంగా సహకరిస్తాయా..? అనేది పార్టీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని గ్రహించాలి. అందుకు రెబల్స్‌ను రెబల్స్‌గానే పోటీలో ఉండేట్లు చేయడంలో ప్రత్యర్థి పార్టీలు విజయవంతమవుతున్నాయనే (ఇప్పటి వరకు) చెప్పవచ్చు.