హీరో ముగ్గురిలా.. సినిమా మూడు కథల్లా..!
రేటింగ్:2.5/5
క్విక్ లుక్:
ఫస్ట్ ఇంప్రెషన్: కథ కదలదు కానీ, సినిమా ఆద్యంతం రిచ్ గా వుంటుంది.
ప్లస్ పాయింట్స్: రవి తేజ నటన( అక్బర్ పాత్రలో)
– ఇలియానా న్యూ లుక్స్
– మంచి మంచి లొకేషన్స్
మైనస్ పాయింట్స్:
-పాత కథే.. కానీ కదలదు.
– హాస్యనటులు ఎక్కువ.. హాస్యం తక్కువ
– సమాజంలో కొన్ని వర్గాలను కించపరచటం.
– వృధా అయిన సునీల్ పాత్ర
చిత్రం: అమర్ అక్బర్ ఆంథోని
నటీనట వర్గం: రవి తేజ, ఇలియానా డి క్రజ్, విక్రమ్‌జీత్ వీఆర్కే, సునీల్, అభిమన్యు సింగ్, సాయిజీ షిండే, తరుణ్ అరోరా, లయ, ఆదిత్య మీనన్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ , రాజ్‌వీర్ అంకుర్ సింగ్, జయప్రకాశ రెడ్డి, తనికెళ్ళ భరణి, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, రవిప్రకాష్ , భరత్ రెడ్డి, సత్య
దర్శకత్వం:శీను వైట్ల
నిర్మాత:నవీన్ ఎర్నేని, ఇతరులు
కథ :శీను వైట్ల
స్కీన్ ప్లే: శీను వైట్ల
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటింగ్: ఎం. ఆర్. వర్మ
సంగీతం:ఎస్. తమన్
విడుదల తేదీ:16 నవంబరు 2018
కథాంశం: మూడు కథల ‘గిల్టు’ బంగారం
పాత్రలు కొంత ఇంగ్లీషులో మాట్లాడతాయి కానీ, అన్నీ మన తెలుగుసినిమా కథలు గుర్తుకొస్తాయి. పగ తీర్చుకోవటానికి అడ్డువచ్చే ‘గజని’, ఒక్క వ్యక్తిలో మూడు వ్యక్తులు వచ్చిపోయే ‘అపరిచితుడు’.. ఇత్యాదివన్నీ కలిపితే ‘అమర్ అక్బర్ ఆంథోని’ కథ అవుతుంది. అన్నట్టు తండ్రిని వ్యాపారపరంగా నష్టపరచే ‘నాన్నకు ప్రేమతో’ కూడా గుర్తుకొస్తుంది. ఇంకేముంది పగ తీర్చుకోవటమే. జస్ట్ కిల్లింగ్ స్ప్రీ.
కథ:పాత కథనే కొత్తగా
అనగనగా ఇద్దరు స్నేహితులు.. కంగారు పడకండి.. సినిమాలో కూడా కథను చూపటానికి బదులు ముందు ఇలా చెప్పటం మొదలు పెడతారు. ఒకరికి కూతురు, ఇంకొకరికి కొడుకు. చిన్నప్పుడే ప్రేమించేసుకుంటే, వాళ్ళతల్లిదండ్రుల పెళ్ళి చెయ్యాలని ఫిక్స్ అయిపోతారు. వారి వ్యాపారంలో నమ్మకద్రోహులు అందరినీ హత మార్చెయ్యాలనుకుంటే, జస్ట్ హీరో, హీరోయిన్, నమ్మిన బంటు అయిన జలీల్ మిగులుతారు. వేర్వేరుగా పెరుగుతుంటారు. హీరో పగతీర్చుకుంటూ, ప్రియురాలిని ఎలా కలుస్తాడు..ఇదే కథ. కొత్తగా లేదు కదా! సినిమా చూశాక కూడా అదే ఫీలింగ్ వుంటుంది.
ట్రీట్‌మెంట్: ప్రతీకారం ముందు, పగ తర్వాత
ప్రతీకారం ముందు కనిపిస్తూ, పగను తర్వాత రివీల్ చేస్తుండే సర్వ సాధారణమైన ట్రీట్‌మెంటే ఈ కథకూ ఇచ్చారు.
స్క్రీన్ ప్లే: పెర్‌ఫెక్ట్
ఇదొక్కటే ఈ సినిమాకు ఆయవు పట్టు. నిజంగానే చాలా చక్కగా చిక్కగా వుంటుంది. క్షణక్షణం తటిల్లతకు గురిచేస్తుంది. కానీ కథ మాత్రం కదలదు.
హీరో: కామెడీ తగ్గించిన హీరో
నిజానికి రవితేజ హీరోగా వుంటూనే, బోలెడంత కామెడీ పండిస్తారు. కానీ, ఇందులో దాదాపు మూడు పాత్రల్లోనూ గంభీరంగా వుంటాడు. కానీ ‘అక్బర్’ పాత్రలో మాత్రం భిన్నంగా వుంటాడు. అందుకనే అక్బర్ గా కనిపించినప్పుడు అందరూ రవితేజతో ఐడెంటిఫై అవుతారు.
ఇతర నటీనటులు: ఉన్నారంటే ఉన్నారు
హీరో హీరోయిన్లు కాక, విలన్లూ, హాస్యనటులూ వుంటారు. ఎవ్వరికీ నటించటానికి పెద్దగా ఏమీ వుండదు. సునీల్ తన వరకూ బాగా చేశాడు. కానీ ఆ కామెడి అంతకు పలు చిత్రాల్లో చూసిన సునీల్ కామెడీలాగే అనిపిస్తుంది.
ఎప్పుడూ ఎక్స్‌ట్రా స్లిమ్ గాకనిపించే హీరోయిన్ బొద్దుగా వుంటుంది. అంతకు మించి నటనలో పెద్ద వైవిధ్యం ప్రదర్శించటానికి ఆమె తన పాత్రలో పెద్దగా లేదు.
సినిమాటోగ్రఫీ: పెద్ద రిలీఫ్
ఆద్యంతం గొప్ప ఫీల్, రిలీఫ్ వుంటుంది. స్క్రీన్ ప్లే తర్వాత సినిమాకు కట్టిపడేసింది ఫోటో గ్రఫీయే
కొసమెరుపు: సినిమా చూసినంత సేపూ విసుగనిపించదు. పాత సినిమానే కొత్తగా చూసినట్టుంటుంది.