వైసీపీ,జనసేనలు మరో ఐదేళ్ళు వేచి చూడాల్సిందేనా.!?
” ఒకే వైపు చూడు, రెండో వైపు చూడలనుకోకు’ అంటూ ఒక సినిమాలో డైలాగ్స్ వినిపిస్తుంటాయి. అది అక్షరాల తెలుగు రాష్ట్రాల పార్టీలు పాటిస్తున్నాయేమో..! ఇంతకీ ఏ పార్టీలు అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల విభజనాంతరం ఒకే ప్రాంతానికి పరిమితమైపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( వైసీపీ), జనసేనలు.
ఈ పార్టీలు ఒకే (సమైక్యాంధ్ర) నినాదాన్ని వినిపించినవే. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ అన్ని ప్రాంతాల్లో పోటీ చేసింది కానీ, జనసేన మాత్రం ఒక ఎన్.డి.ఏ కూటమికి మద్ధతునిచ్చారు(ఈ విషయం అందరకి తెలిసిందే).
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే… తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పాల్గోనకపోవడం. ఇప్పటికే ఆంధ్ర పార్టీలుగా ముద్ర పడిన టి.డి.పి. వైసీపీలతో పాటు జనసేనలు తెలంగాణలో వచ్చే పరిస్థతులు లేవనుకున్నారంతా..! కానీ, ఒక టీడీపి మాత్రమే మళ్ళీ తెలంగాణలో పుంజుకుని ఎన్నికల బరిలోకి దిగుతుంది. (ఇదంతా బాగానే ఉంది.)
వైసీపీ, జనసేన పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో పాల్గోనడం గానీ, లేదా మద్దతు తెలపడం గానీ ఎక్కడ కనిపించడం లేదు. ఈ రెండు పార్టీలు ఈ నాలుగున్నర సంవత్సరాల మధ్య కాలంలో అడపాదడపా తెలంగాణలో యాత్రలు చేయడం కనిపించినా అంతగా పట్టించుకున్నట్లు లేదు. ఇదిలాగే కొనసాగుతుందా..? లేదా 2024 వరకు తెలంగాణలో రీఎంట్రీ యిస్తాయా..? అంతకంటే ముందు జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో పాల్గోననున్నాయా..? జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పాల్గోనకుండా వచ్చే లోకసభ ఎన్నికలలో కూడా పాల్గోనకపోవచ్చనే అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు రాజకీయ విశ్లేషకులు.