కూటమి వస్తే ‘సుహాసిని’ మంత్రి అవుతారా..?
టీడీపీలో నందమూరి ప్యామీలి మూడోతరం కూడా తెరమీదకు వచ్చేసింది. ఇప్పటికే ఆ ఫ్యామీలి నుండి ఎన్టీఆర్ వారసునిగా బాలయ్య గత ఎన్నికలలో హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఎన్నికల అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన వారిలో హరికృష్ణ తనయ సుహాసిని ఒకరు.
హరికృష్ణ కూతురుగా రాజకీయ అరంగ్రేటం చేసిన సహాసినిని ఒక పెద్ద నాయకురాలిగా చూపించేలా ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులను కాదని కూకట్‌పల్లి నియోజకవర్గంను తనకు కేటాయించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అందరిని అకట్టుకునేలా తాత (నందమూరి తారక రామారావు)ను గర్తు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ ఎన్నికల్లో మహాకూటమి అధ్వర్యంలో ప్రభుత్వాన్నేర్పరిస్తే, టీడీపీ కోటా నుంచి మహిళా నాయకురాలిని మంత్రి చేయాలనే ప్రతిపాదన చేస్తారనే గుసగుసలు వినిసిస్తున్నాయి. ఆ మహిళ నాయకురాలు సుహాసినే అవుతుందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.