మజ్లిస్ మూసలో తెలంగాణ టీడీపీ..?
తెలంగాణ ప్రాంతంలో రాజకీయం వేరు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో జరిగే రాజకీయ పరిమాణాలు వేరు. అందుకే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ సమయంలో కూడా సీమాంద్ర ప్రాంత నాయకులకు హైదరాబాద్ ఎక్కడ వారికి దూరం అయిపోతుందోననే ఆందోళనే కనిపించింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది.అయినప్పటికీ ఈ నాలుగేళ్ళ కాలంలో ప్రజలకు ఒరిగిందేమిలేదు. (అది వేరే విషయం).
హైదరాబాద్‌లో ఉన్న పదిహేను(15) నియోజకవర్గాలలో ఏడు (7) నియోజకవర్గాలు పూర్తిగా మజ్లిస్ పార్టీకే సొంతమయ్యాయి. వాటిని ఎదుర్కోనాలనే పార్టీలు లేకుండా ఉన్నాయి. ఒకవేళ ఉన్నా నామమాత్రంమే. హైదరాబాద్ అంటేనే మజ్లిస్ సహచర్యం ఉండాల్సిందే. అది ఏ పార్టీ అయిన కావచ్చు(గతంలో కాంగ్రెస్, అపద్ధర్మ టీఆర్ఎస్ ప్రభుత్వాలు).
ఇదిలా వుంటే, ప్రస్తుతం టిడిపి పరిస్థితి కూడా ఆ తరహాలోనే వుందని చేప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ దాదాపు దశాబ్ధన్నర కాలం పాటు పాలించింది. ఆంధ్రప్రదేశ్ విభజననాంతరం ఒకే ప్రాంతానికి పరిమితమైపోయిందనే విమర్శలు వచ్చాయి. ఉద్యమ సెంటిమెంట్ ఉన్న చోటనే ఎన్నికల్లో (2014) టిడిపి పదిహేను సీట్లను కూడగట్టుకున్నది. దీన్ని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తులో మజ్లిస్ తరహాలోనే టీడీపీకూడా ఉంటుందా..? అనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
ప్రస్తుత ఎన్నికలలో కూటమిలో ఒక పార్టీగా టీడీపీ వచ్చింది. ఒక మజ్లిస్ పార్టీలా, టీడీపీ సెటిలర్స్ ఉన్నప్రాంతాలలో (హైదరాబాద్, నిజామాబాద్, నల్లోండ వంటివి) పదమూడు-పదిహేను సీట్లకే పరిమితం అవుతుంది. ఇలా జరిగితే సెటిలర్లుగా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు ఇప్పటివరకు టీడీపీతో కొనసాగుతూ వస్తున్నారు. వాళ్ళందరూ కలిసి రాబోయే రోజుల్లో ఒక గ్రూప్‌గా ఏర్పడి, హైదరాబాద్ కేంద్రంగా మరో పార్టీని నెలకొల్పే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాగే ఉంటే తెలంగాణ ప్రాంత ఉనికికే ప్రమాదం. ఇప్పటికైనా ఆలోచిస్తారో..? లేదో తెలంగాణ రాజకీయ నాయకులు.