టీఆర్ఎస్, మజ్లిస్ కూటమికి 50 సీట్లేనా.!?
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు నాయకులు. పార్టీల వ్యూహాలు మారుతున్నకొద్ది రాజకీయ పరిమాణాలు కూడా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు ప్రస్తుత అపద్ధర్మ ప్రభుత్వానికి. ఏ రోజుకారోజు ఏ పార్టీ చూసినా మాకిన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయంటూ ప్రచారాలు చేసుకుంటున్నాయి. అందులో టీఆర్ఎస్ పార్టీ ముందువరసలో ఉంది.
కాంగ్రెస్ కూటమి (ప్రజా కూటమి) కి 85 సీట్లు వస్తాయని, మాకు 25 సీట్లు వస్తాయని బీజేపీ వారు ఇలా ఎవరికి వారు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇందుకు టీఆర్ఎస్ అతీతం కాదు. ఇప్పటికే చేయించిన అని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్వేలో మా పార్టీకి 100 సీట్లు వస్తాయంటూ వెల్లడైందని గతంలో చెప్పడం జరిగింది. తాజాగా మేము ఓడిపోతే అనే మాట కేసీఆర్ నోట వినిపించింది. ఈ నాలుగేళ్ళలో ఏ ఎలక్షన్ చూసుకున్న ఇలాంటి మాట రాలేదు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయన్న అందోళనతో కప్పిపుచ్చుకోడానికి తిరిగి 103 నుంచి 108 సీట్లు వస్తాయని చెపుతున్నట్లు అర్థమైపోయింది.
ఇది ఎలాగా వున్నగాని టీఆర్ఎస్ పార్టీ నాయకులు 100 సీట్లేమో గానీ, ఒక 75 సీట్లు గెలుస్తామనే ధీమాను వ్యక్త పరుస్తున్నారు. ఈ సీట్లు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. టిఆర్ఎస్ కూటమి ( టీఆర్ఎస్ + మజ్లిస్) మొత్తంగా 50 నుంచి 57 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మజ్లిస్ మొత్తం 7 సీట్లను కైవసం చేసుకుంటే, టీఆర్ఎస్ 50 సీట్ల వరకే పరిమితమయ్యే అవకాశాలుండవచ్చనే అభిప్రాయాలను కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.