కేటీఆర్ స్టేట్ కు..కేసీఆర్ ‘ఫ్రంటు’కు?
కేసీఆర్ తర్వాత కేటీఆరే. ఒక్క అక్షరమే మారింది. ఫలితాలు వచ్చి మూడు రోజులు గడిచిందో లేదో, తక్షణం వారసత్వం ముందుకొచ్చింది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్ళి, రాష్ట్రాన్ని కేటీఆర్ కు వదిలేస్తారు.
ఈ వార్తను పత్రికలు తమ తమ విధేయతల్ని బట్టి వ్యాఖ్యాన సహితంగా ప్రచురించాయి. టీఆర్ఎస్ అనుకూల పత్రికలయితే- పార్టీని బలోపేతం చెయ్యటానికి తీసుకున్న చర్యగా అభివర్ణిస్తే, ‘గులాబీ’లంటే పడని పత్రికలు- అదుగో ‘ఇక కేటీఆరే ముఖ్యమంత్రి’ అంటూ భవిష్యద్దర్శనాలు చేశాయి. మన దేశంలో జాతీయ పార్టీలే కాదు, ప్రాంతీయ పార్టీలు దాదాపు – తండ్రి తర్వాత కొడుకు లేదా కూతురు- అనే వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ వచ్చాయి.
ప్రాంతీయ పార్టీల్లో కొడుక్కు దారివ్వాలనుకున్న ప్రతీ సారీ , ప్రతీ తండ్రీ ఏదో ఒక కారణం చెబుతూ వచ్చారు. దేశ రాజకీయాల్లోకి వెళ్ళటమన్నది పాత కారణమే.. జమ్మూ కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లా కు మార్గం సుగమమం చెయ్యటానికి, ఫరూఖ్ అబ్దుల్లా ఇదే కారణం చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కూడా,అఖిలేష్ యాదవ్ కు చోటివ్వటానికి ఈపంథా అనుసరించారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ కు జాగా ఇవ్వటానికి కూడా దేశ రాజకీయాలనే కారణాన్నే చూపుతున్నారు. ఈ కారణాలు నిజాలా? లేక నెపాలా?
ఈ కింది వీడియో చూడండి.