అసౌకర్యాల గది.. అదే ’పది వేలు‘!
అమ్మ చూపించే మాధుర్యం, నాన్న వాత్సల్యం ఎక్కడ దొరకవు. అమ్మ చేతితో చేసిన కమ్మదనం, అమ్మనాన్నల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం. ఇవన్నీ కొంత కాలమే. కాలక్రామేణా ఇప్పుడున్న గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన నేపథ్యంలో టెక్నాలజీతోనే కాలం వెల్లదియాల్సిన అవసరం ఏర్పడింది. పై చదువులకో లేక ఉద్యోగాల కోసమో పల్లే ప్రాంతాల నుంచి పట్టణాలలోకి వలస రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అందులో ముఖ్యంగా అమ్మాయిలు పడుతున్న బాధలు వర్ణణాతీతం.
నగరంలో పెరుగుతున్న హాస్టల్స్ అందుకు అతీతం ఏం కావు. గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్న వారికి ఒక వసతి కల్పించడమే కాకుండా వారి భోజన సదుపాయాలతో పాటుగా భద్రత, ఆరోగ్యం సంబంధిత విషయాలు కూడా పట్టించుకోవాల్సి వుంటుంది. కానీ ప్రస్తుతం అవి అప్రస్తుతమై పోయాయనడంలో అశ్చర్యపోనవసరం లేదు. ఇందులో వసతి గృహాల యాజమాన్యాలు విఫలమైయ్యాయనే చేప్పుకోవాలి.
పై చదువుల కోసం ఉద్యోగ రీత్యా వస్తున్న వారికి హాస్టళ్లు అండగా నిలుస్తున్నాయి. కానీ ఎంతవరకూ? అనేది ఎవరికీ పట్టింపు లేదు. ఒక్కొక హాస్టల్ ఖరీదు అయా ప్రాంతాన్ని బట్టి నెలసరి ఫీజు రు.3,000 నుండి మొదలుకొని దాదాపు రు.10,000 వరకు ఉంది. హైదరాబాద్ లో హాస్టల్స్ ఎక్కువగా ఉద్యోగాల ఇప్పించడానికి శిక్షణ ఇచ్చే కేంద్రాలతో పాటు, ఐటీ కారిడార్ వంటి ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడ ప్రాంతాన్ని బట్టి హాస్టల్స్ లో పరిస్థితులుంటాయని కొన్ని ప్రవేటు హాస్టల్స్ లో ఉండే కొంతమంది విద్యార్థులు మా ‘తెలుగూస్’ టీం కి వారి అంతరంగాన్ని పంచుకున్నారు.
ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి కొంత ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తుంటారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కొంత ఇబ్బందులకు గురికావాల్సిందేనని వాపోయారు. భోజన విషయంలో గాని, శుభ్రత విషయంలో గాని రాజీ పడాల్సిందేనని చెప్పారు. చెల్లించిన వారికి ప్రతి చోట ప్రతిఫలం దక్కదు అంటారు. ఇద్దరు లేక ముగ్గురు ఉండాల్సిన గదిలో ఆరు నుండి ఏడుగురు వరకు ఉండటం ఇవన్నీ కూడా నగరాల్లో హాస్టల్లో ఉన్నఅరకొర సదుపాయాలతో నెట్టుకొస్తున్న వారి గాధలు. ఇది హైదరాబాద్ లోని కొన్ని హాస్టళ్ల పరిస్థితి.
హాస్టల్ అమ్మాయిలు తెలుగూస్ టీంతో చెప్పుకున్న గాథలుః
“అమ్మ నాన్నలు, సొంత ఊరికి దూరంగా కష్టం కానీ! కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అని మన పెద్ద వాళ్ళే అంటుంటారు కదా! హాస్టల్లో ఉండటం చాలా కష్టం కానీ మన స్నేహితులు ఉండటం వలన పెద్దగా కష్టం తెలియకపోవచ్చు. మొదట కొన్ని రోజులు చాలా కష్టంగా ఉండేది.ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ తప్పదు అని నాకు నేను సర్ది చెప్పుకునీ.. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండటం అలవాటు చేసుకున్నాను.నాలాగ చాలా మంది అలాగే ఉన్నారు .సరైన సౌకర్యాలు ఉండవు చాలా ఇబ్బందిగా వుంటుంది. సెలవులు వచ్చిందంటే ఒక్కక్షణం కూడా ఉండాలని అనిపించదు .రెక్కలు ఉంటే బావుండు అనిపిస్తదం”టూ చెప్పుకొచ్చారు.
ఇన్నీ కష్టాలు పడుతున్నప్పటికీ వారు ఒక అనుకూల అంశాన్ని తీసుకుంటారు వీరు. దాంతో ఇబ్బందులతో పాటు ప్రయోజనాలు కూడా ఉన్నాయనుకొవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందేమో.అలాగే భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఫ్రెండ్లీ అట్మాస్పియర్ ఉండటం , ఒకరిపై ఆధారపడకుండా ఎవరి పని వారే చేయడం అలవాటు అవుతుంది. రకరకాల మనసతత్వాలు వున్న వారితో పరిచయాలు ఏర్పడటం, వివిధ రాష్ట్రాల వారు కూడా ఉండడంతో వారి సంప్రాదాయలను కూడ తెలుసుకోవడం, అందరూ సరదాగా గడపడం ఒక అనుభూతిగా చెప్పుకోవచ్చని చెప్పారు. ఇది కొంతమంది నగర మహిళ వసతి గృహాలలో ఉండేటువంటి అంతరంగం.
-సౌమ్య పోతుల, ఇంటర్న్‌షిప్ వింగ్, ఏపీ కాలేజీ ఆప్ జర్నలిజం.