లక్ష్యాన్ని చేదించిన “ఒంటరి” పోరాటం
అమ్మానాన్న తోడు వారికి రెండు దశాబ్ధలే. మరో ఎనభై యేళ్ళు మరో ఇంటికి వెళ్ళాల్సిందే. అన్ని వదిలి వెళ్ళిన ఆమే అలోచనలను, ఆశలను, ఆశయాలను అన్నింటిని వారి మెట్టినింటి ఆలోచనలకు వదదిలేయవల్సిందే. జీవితంలో తోడుగా ఉంటానని చేప్పి చేసుకున్న తర్వాత వారి ఆశలకు గండి కొడుతున్నారు చేసుకున్నవారు కూడా.
“ఆమే ఆకాశంలో సగం” -మావో
కానీ జీవితంలో మాత్రం భర్త తర్వాతే. ఆమేకు శరీరం ఉంటుంది. వ్యామయం కావాలి. ఆమేకు మేదడు ఉంటుంది. ఆలోచనలు ఇవ్వాలి. అని ఒక కవి అన్న విషయాలు గుర్తుకు వస్తున్నాయి ఇప్పుడు. జీవితాంతం తోడుగా జీవిస్తానని చెప్పి మధ్యలోనే తనకు జరిగిన ప్రమాదం వల్ల శరీరంలోని కొన్ని అవయావలు కోల్పోయిన కారణంగా భర్తచే వదిలి వేయబడింది ఆమే.
ఆమే శరీరంలోని కొన్ని అవయావలను కొల్పోయిందేయోకానీ, తన ఆలోచనలను తన ఆశయాన్ని ఎప్పుడూ వదిలేయలేదు. అమే ఎవరో కాదు ఆర్టిస్ట్,మోడల్ ,టివి ఆర్టిస్ట్ , సింగర్, సంఘసేవకురాలు మునిబా మజారీ. తన జీవితంలో ఎదురైనా ఒడిదుడుగులను పట్టించుకోకుండా పట్టుదలతో తను అనుకున్న లక్ష్యం సాధించిన మహిళ మునీబా మజారీ గురించి ఈ రోజు ప్రపంచ శ్రామిక మహిళ దినోత్సవం సందర్భంగా స్పేషల్ స్టోరీ.
పేరుః మునిబా మజారీ
జననంః 3వ మార్చి 1989
ప్రాంతంః రహిం హర్ ఖాన్
దేశంః పాకిస్తాన్
కుటుంబ నేపథ్యంః మునిబా బాలొచ్ కుటుంబానికి చెందినది.
మునిబాకి 18 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. తన భర్త నిర్లక్ష్యంతో కారు ప్రమాదానికి గురైంది. ఆ కారు ప్రమాదమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇదంతా వివాహనంతరం రెండు సంవత్సరాల లోపే. ఈ ప్రమాదంలో తన భర్త తనని తను రక్షించుకున్నాడు.
ఆ క్షణం మునిబా నా భర్త క్షేమంగా వున్నాడు అని చాలా సంతోషపడింది. ఆమే మాత్రం కారులోనే ఉండిపోయింది. ఒంటినిండా గాయాలతో అక్కడే ఒంటి నిండా గాయాలతో… తనకి మూడు మైనర్ సర్జరీలు 2 మేజరు సర్జరీలు జరిగాయి. తన చేయికి వెన్నెముక కి టైటానియం వేసి ప్రాణాలు కాపాడారు.అందుకే పాకిస్తాన్ దేశంలో ఆమేను “ఐరన్ లేడీ ఆఫ్ పాకిస్తాన్” అని అంటారు.
హాస్పిటల్లో తెల్ల గొడల మద్య ఒంటరిగా …
ఒక్కరోజు డాక్టర్ తనతో మీరు మంచి ఆర్టిస్ట్ అవ్వలనుకున్నారు కానీ!మీ జీవితాన్ని హౌజ్ వైఫ్ గానే ముగించాల్సి వచ్చింది అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీవు పెయింటింగ్ వేయలేవు. ఎందుకంటే నీ మణికట్టు మరియు చేయికి రూపం లేకుండా పోయింది. నీ వెన్నెముక సరిగా లేని కారణంగా నడవలేవు.అలాగే ఏ బిడ్డకి జన్మనివ్వలేవు అని చేప్పారు. ఆ క్షణం మూనీబా వల్ల అమ్మని అడిగింది.అమ్మ నాకే ఎందుకు ఇలా!నేను ఎందుకు బ్రతికి ఉన్నాను అని వాపోయింది.
నేను నడవలేను, నేను పెయింటింగ్ వేయలేను, ఒక తల్లిని కాలేను, ఏ స్త్రీ అయినా కూడా ఒక బిడ్డకి జన్మ నించినపుడే గా తన జన్మ సార్థకం అవుతుంది నాకే ఎందుకు ఇలా.అని కుమిలి పోయింది. తన బాధ చూసి తల్లడిల్లిన ఆమే తల్లి మునీబా! నీ జీవితం ఇంకా కొత్తగా ఉంటుదేమో ఎవరికి తెలుసు అని ఓదార్చింది.
ఆ ఓదార్పే ఆ హాస్పిటల్ తెల్ల గోడల మధ్య ఏదైనా చేయాలనే తపన తన మొదటి పెయింటింగ్కు దారి తీసింది. మునీబాస్ కాన్వాస్ అని తనే ఒక నినాదంను క్రియేట్ చేసుకుంది. అలా తను ఒంటరి తనన్ని పక్కన పెట్టి పెయింటింగ్స్ వేస్తూ ఆ పెయింటింగ్స్ ను ఎగ్జిబిషన్లో ప్రదర్శించేది.
ఇంతలోనే తన భర్త తనకి విడాకులు ఇచ్చి వేరే అమ్మాయినీ పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది. అయినప్పటికీ తను మానసికంగా బాధపడుతున్నప్పటికీ తనకి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని సందేశాన్ని పంపించింది.
తనకి మాతృత్వం దూరమవుతుందనుకున్న సమయంలో దత్తత తీసుకున్న బాబు మునీబా జీవితంలో ఆనందాలు నింపాడు. తన జీవితం మళ్ళీ మొదలయింది. తన పెయింటింగ్స్ పాకిస్తాన్ లో చాలా ఎగ్జిబిషన్లలలో ద బెస్ట్ గా నిలిచాయి. అనతి కాలంలోనే మరో రంగంలో ప్రముఖంగా నిలిచారు. వక్తగా నవంబర్ 2014 లో TEDX అనే ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు. తర్వాత వెనుతిరగకుండా 2016 డిసెంబర్ లో 16 రోజులు లింగ వివక్షతఃకి వ్యతిరేకంగా పోరాడింది. మునీబా మొదటి వీల్ చైర్ టెలీ విజన్ హోస్ట్ గా పీటీవీ చానెలో పేరు తెచ్చుకున్నారు.
Corporate social responsibility(CSR) చీఫ్‌గాను, యునైటెడ్ నేషన్స్ ఎంటిటీ ఫర్ జండర్ ఇక్వలిటీ అండ్ ఉమేన్ ఎంపౌర్‌మెంట్ అర్గనైజేషన్ (United nations Entity for Gender Equality and the Empowerment women)కి నేషనల్ అంబాసిడర్‌గా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే
Toni&guy చెన్ మరియు హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ కీ మొట్టమొదటి వీల్ చైర్ మోడల్. 2015 సంవత్సరంలో వందమంది మహిళలలో తను బెస్ట్ ఇన్స్పైర్ మహిళ గా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచ పత్రిక ఫోర్బ్స్ లో 30/30లో మునీబా మజారీ ఒకరిగా నిలిచారు.
ఎన్ని అటుపోట్లు ఎదురైనప్పటికీ మహిళలు మానసికంగా చాలా ధైర్యంగా ఉండటానికి మూనీబా మజారీ మహిళా లోకనికే ఒక బ్రాండ్. కాదు కాదు. అందరికి ప్రతి ఒక్కరికి ఆమే ఒక స్ఫూర్తి. రోల్ మోడల్. సాధించాలన్న తపన, సంకల్పం ఉంటే చాలు ఏ శక్తి ఆపలేరు అని చాలా మంది మహిళలు నిరూపించారు అలాంటి జాబితాలో ఒకరు మునీబా మజారీ.
-సౌమ్య పోతుల, ఇంటర్న్‌షిప్ వింగ్, ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం.