ములాయం,లాలులకు ‘మోడీ’ మరో ఝలక్..!
విభజించి పాలించవచ్చు లేదా విభజించి లాలించవచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో విభజించి లాలించే కార్యక్రమాన్ని చేపట్టింది. అదీ మరీ ముఖ్యంగా ఓబీసీ కోటాలో వేలు పేడుతుంది. ఇప్పటి వరకు కూడా ఇతర వెనకబడిన తరగతులకు 27% రిజర్వేషన్‌లు విద్యా, ఉపాధి రంగాలలో ఉన్నాయి. అది 1979లో మండల్ కమీషన్ ను వేసినటువంటి జనతా పార్టీ అమలు జరపలేకపోయిన కూడా 1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మండల్ కమీషన్ సిఫార్స్‌లను అమలు జరిపారు. అప్పుడు దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దాంతో ఓబీసీ వర్గాలు చాలా ముందుకు వచ్చారు. అది రాజకీయ పరమైనటువంటి రూపును కూడా ఇచ్చింది. అందులో భాగంగానే మండల్ పార్టీలు ఏర్పడ్డాయి. రాష్ట్రీయ జనతా దల్ లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని పార్టీగానీ, అట్లాగే ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ గానీ ఇతర జనతా దల్ పార్టీలు శాఖోప శాఖలుగా దేశమంతటా ఏర్పడ్డాయి. దాంతో అటు మండల్ ఇటు మందిర్ పార్టీలలో పోటీ ఏర్పడ్డాయి. భారతీయ జనతా పార్టీ మందిర్ నినాదంతోనూ, మండల్ పార్టీలు ఓబీసీ నినాదంతో వచ్చాయి. అయితే మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ మండల్ పార్టీల్లో వేలు పెట్టింది.
ఇక్కడ బీజేపీ, మండల్ పార్టీలలో నాయకులు (ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్‌లు) కేవలం యాదవ సామాజిక వర్గాలకు చెందిన వారు మాత్రమే పరిపాలిస్తున్నారంటూ, మిగిలిన వర్గాలను పట్టించుకోవడం లేదనే వాదనను లేవనేత్తి ఇతర వెనకబడిన వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ 2014తో పాటు 2019లో విజయం సాధించింది. కాబట్టి దీనిని శాశ్వతంగా పదిల పరిచేటటువంటి కార్యక్రమాలు చేపట్టిందనే అనుమానాలు కూడా లేకపోలేదు. అందుకు ఒక కమీషన్‌ను కూడా వేసింది. ఆ కమీషన్ జస్టిస్ రోహిణి కమీషన్. ఈ కమీషన్ ప్రకారం కేంద్రీయ సంస్థలలో ఎంత శాతం కేటాయించనున్నారు..? ప్రస్తుతం ఉన్నటువంటి ఓబీసీ కోటా (27%)ను ఎన్ని ముక్కలుగా చేయనున్నారు..? దీని వలన ఎవరికీ లాభం చేకూరనుంది..? ఈ కమీషన్ వలన మిగిలిన మండల్ పార్టీల పరిస్థితి ఎలా ఉండనుందో తెలియలంటే ఈ క్రింది విశ్లేషణను పూర్తిగా విక్షీంచండి.