AndhraFeaturedTelangana

జగన్ కి, కేసీఆర్ కి అదే తేడా !

దూకొచ్చు, జంప్ చేయ‌చ్చు, ఫిరాయించ‌చ్చు. కానీ దానికో ప‌ద్ధ‌తి ఉంటుంది. ఆ ప‌ద్ధ‌తిని ఎవ‌రు ముందుగా ప్ర‌వేశ‌పెడ‌తార‌నే దాని మీద బ‌హుశా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతల మ‌ధ్య పోటీ న‌డుస్తున్న‌ట్లుంది. ఎవ‌రికి వాళ్ళు జంప్ చేసేస్తే అధికార ప‌క్షానికి వ‌చ్చేస్తే వారిని డిస్కాలిఫై చేయ‌కుండా వారిని అసెంబ్లీ స్పీక‌ర్లు కాపాడేస్తే, లేదా శాస‌న మండ‌లి స్పీక‌ర్లు కాపాడేస్తే, శాశ్వ‌త కాలం అలాగా జంపింగ్ జిలానీలు అధికార ప‌క్షంలో చాలా క్షేమంగా ప‌దవి కాలాన్ని లాగేస్తే, ఇదంతా ప్ర‌జాస్వామ్యానికి వెక్కిరింత అన్న‌ది దాదాపు అర్థ‌మైపోయినట్టుగా ఉంది. అందుచేత తెలంగాణ‌లో కేసీఆర్ గానీ, లేక‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గానీ కొత్త పంథాల‌కు తెర తీశారు. ఇక్క‌డ టీఆర్ఎస్ అధినేత ఏకంగా విలీనాన్ని ప్లాన్ చేశారు. అంటే ఒక‌రిద్ద‌రు అయితే ఫిరాయింపు కింద వ‌స్తుంది, జంప్ కింద వ‌స్తుంది. కానీ రాజ్యాంగ బ‌ద్ధంగా మారాల‌న్న‌ట్ల‌యితే మూడింట రెండంతుల మంది శాస‌న స‌భ్యులు లేదా మండ‌లి స‌భ్యులు ఒక పార్టీ నుంచి మ‌రోక పార్టీకి మార‌వ‌చ్చు. అప్పుడు దాన్ని ఒక పార్టీగానే చూస్తారు గానీ, ఒక వ్య‌క్తి గా చూడ‌రు. కాబ‌ట్టి విలీనం కింద వ‌స్తుందనేటువంటి ఒక రాజ్యాంగ సూత్రంగా అనుస‌రించి ఆయ‌న ఫిరాయింపు చేయిస్తే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దానికింకా కొన‌సాగింపు సాగించారు.
తొలిరోజునే ఫిరాయింపు చర్చ వ‌చ్చింది. ఆయ‌న త‌ర‌చు మాట్లాడుతున్న‌టువంటి 23 అంకె. అప్ప‌ట్లో 23 మందిని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఆక‌ర్షించారో లేక‌పోతే వారంత‌ట వారు ఫిరాయించారో తెలియ‌దు గానీ మొత్తానికి 23 మంది అయితే జంప్ చేశారు. వారిని కొనుగోలు చేశార‌నేది జ‌గ‌న్ అరోప‌ణ. అలాంటి ప‌నులు తాను చేయ‌డంలేద‌ని చెప్పెటువంటి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. శాస‌న స‌భ‌ప‌తిని ఎన్నుకున్న‌టువంటి తొలినాడే ఫిరాయింపులను ప్రోత్స‌హించ‌డంలేద‌ని ఆయ‌న కుండబ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చేప్పారు. ఆయ‌న ఫిరాయింపుల‌ను నేను ప్రోత్స‌హించ‌ను. ఇవాళ తలుపు తెరిస్తే తెలుగుదేశం శాస‌న‌స‌భ్యులు దాదాపు వ‌చ్చేస్తారు. ఖాళీ అవుతుంది. లేక‌పోతే ఐదారుగు వ‌చ్చినా కూడా ఇప్పుడున్న‌టువంటి ప్ర‌తిప‌క్ష హోదా స్థానాన్ని చంద్ర‌బాబు నాయుడు కొల్పోతారు. నేను ద‌య‌త‌ల‌చి దాదాపుగా చంద్ర‌బాబుకి ఆ స్థానాన్ని మిగిల్చాను అనే అర్థం మాట్లాడుతూనే, మ‌రోక అర్థం. ఎవ‌రైనా రావాల‌ని అనుకుంటే కుద‌ర‌దు. మేము అహ్వానించాల‌నుకుంటే వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి రాజీనామా చేసి రావ‌ల్సి వుంటుంది. అంటే రాజీనామా చేసి వుంటుంద‌ని అపేశారు. అంటే రాజీనామా చేశాక ఎలా వ‌స్తారు..? మాజీ శాస‌న స‌భ్యుడిగా వ‌స్తారా..? ఎట్లా వ‌స్తారు..మ‌రీ..! కాదు గాదా. రాజీనామా చేసిన త‌ర్వాత అక్క‌డ‌ ఉప ఎన్నిక వ‌స్తుంది. ఆ ఉప ఎన్నిక స్థానంలో ఇంత‌కు ముందు ఒక‌వేళ‌ తెలుగు దేశం పార్టీ నుంచి ఆ శాస‌న‌ స‌భ్యులు వైసీపీలోకి జంప్ చేస్తే, తెలుగు దేశం టిక్కెట్ పై గ‌తంలో గెలిచిన‌ట్ల‌యితే అదే అభ్య‌ర్థి ఈసారి అదే అభ్య‌ర్థి వైసీపీ టిక్కెట్ మీద పోటీ చేసి గెలవాలి. కాబ‌ట్టి గెలిచే అవ‌కాశాలు ఇప్ప‌ట్లో ఖ‌చ్చితంగా వుంటుంది. ఎందుచేతంటే 50 శాతం ఓట్లు వైసీపీకి వ‌చ్చిన త‌ర్వాత ఎక్క‌డి నుంచి పోటీ చేసి గెలిచేట‌టువంటి విశ్వాసం ఆ పార్టీకి ఏర్ప‌డింది. కాబ‌ట్టి నెల‌ల్లో పుంజుకునే అవ‌కాశం టిడీపీకి వుండదు. ఒకర‌కంగా ఫిరాయింపును నిరోధిస్తునే, ఫిరాయింపును ప్రోత్స‌హించ‌మంటూనే మ‌రోక ప్ర‌క్క‌న మీకంతా ద‌మ్ము, చావ వుంటే రండి. రాజీనామా చేసి రండి…అది కూడా మాకిష్ట‌మైతే అహ్వానిస్తాం. అప్పుడు ఉపఎన్నిక పెడ‌తామనే ఉద్దేశ్యం ఉంది. కాబ‌ట్టి మొద‌టి రోజే చంద్ర‌బాబుకి ఒక భ‌యం చూపించారన్న‌మాట‌.
ప్ర‌తిప‌క్ష పార్టీని కాపాడుకొవాల‌నే దానిపై నిమ‌గ్న‌మై పోయే ప‌నిలో చంద్ర‌బాబును కార్న‌ర్ చేశారు జ‌గ‌న్‌. శాస‌న‌స‌భ‌లో గ‌ట్టి ప్ర‌తిప‌క్షంగా నిలుబ‌డ‌లేకుండా చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్‌ ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఇలాంటి సంధ‌ర్భాల‌లో ప్ర‌తిప‌క్షాలు ఏలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాయి..? పాల‌క ప‌క్షాలు, ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీనంగా మార్చి క‌నీసం రెండో స్థానంలో కూడా రానీయ‌కుండా సుదూరమైన‌టువంటి స్థానాన్ని క‌ల్పించిన రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తీరు ఎలా ఉండ‌నుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది విశ్లేష‌ణ‌ను పూర్తిగా విక్షీంచండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *