బీజేపీలో చేరటానికే రాములమ్మట్వీట్!
మొన్న పవన్ కల్యాణ్, నిన్న మోహన్ బాబు, నేడు విజయశాంతి.. బీజేీపీ ముందు టాలీవుడ్ తారల క్యూ పెరుగుతోంది. పవన్ పొత్తు తో సరిపెట్టుకుంటే, మోహన్ బాబు బీజేపీ అనుకూలతను మాత్రమే ప్రకటించి సరిపెట్టుకున్నారు.
కానీ రాములమ్మ ఉరఫ్ విజయ శాంతి మాత్రం పూర్తిగా చేరే వాతావరణమే కనిపిస్తోంది. విజయశాంతి పేరు ఎప్పటినుంచో వినిపిస్తున్నా, కాషాయ తీర్థం పుచ్చుకోవటానికి కాలయాపన చేశారు. ఇప్పుడు సరయిన సమయంగా ఆమె భావించినట్టున్నారు. ఇందుకు తగిన సంకేతాన్ని కూడా ఇచ్చేశారు. ఇటీవల కాలంలో ’సరిలేరు నీకెవ్వరూ‘ చిత్రంతో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి, ప్రశంసలు పొందిన ఆమె ’మళ్ళీ నటిస్తానో, లేదో… ఇక సెలవా మరి’ అంటూ ఆమె అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
బీజేపీ వైపు ఒరిగి సిినిమాల్లో మరో మారు నటిస్తానన్న పవన్ పై వచ్చిన విమర్శలు తెలిసిందే. ఈ తరహా విమర్శలు రాకుండే వుండేందుకే, రాములమ్మ సినిమాలకు ఇలా వచ్చి అలా దూరమవుతున్నారు.