FeaturedOpinion

ఉరి ఒక్కటే! చావులు నూరు!!

మొత్తానికి ఉరి తీసేసారు!
ఉరితీసి పరిష్కారమన్నారు!
రెండూ రెండు వాక్యాలు  కావు. రెండు పెదవి విరుపులు. రెండు వాదనలు. రెండు థృక్పథాలు.
‘నిర్భయ కేసులో నేరస్తులు  నలు గురూ తప్పించుకుంటారనుకున్నాం. ఎన్ని డ్రామాలాడారు? ఎన్ని సార్లు వాయిదా వేయించుకున్నారు? మళ్ళీ వాయిదా పడుతుందనుకున్నాం. తెల్ల వారితే ఉరి తీస్తారనగా కూడా.. హైకోర్టు, సుప్రీం కోర్టు కు .. పిట్ట కథు చెప్పించ బోయారు. కానీ కుదరలేదు. ఉరితీసేశారు. కానీ ఇంత జాప్యమా? ఎప్పుడో ఏడేళ్ళక్రితం (16 డిశంబరు 2012) జరిగిన సామూహిక అత్యాచారమిది. ఇప్పుడా..? ఇన్నాళ్ళకా..?’ ఇది మొదటి వర్గం వాదన. ఇదే మెజారిటీ వాదన కూడా.
‘ఉరితీస్తే…!? అత్యాచారాలు  ఆగిపోతాయా? మరణశిక్ష విధిస్తే నీచమైన ఆలోచనలు ఆగిపోతాయా? ఏడాది నిండని పసిపిల్ల నుం చి, తొమ్మిది పదుల ముదుసలి వరకూ.. ఈ వింతజంతువుకు బలవుతునే వున్నారు. మరణశిక్షలు  వీరిని నిలుపు చెయ్యగవా..?’ ఇది ఇంకో వర్గం వాదన.
కానీ న్యాయం రెంటికీ మధ్య జరిగిపోయింది. చట్టం గట్టిదని నిరూపణ అయ్యింది.శుక్రవారం (20 మార్చి2020) నాడు ఆ నలుగురు బతుకులూ  ఉదయం 5.30 గంటకే తెల్లారిపోయాయి. చరిత్ర దుర్మార్గుల్ని సైతం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే పవన్‌ గుప్త(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ (31), ముఖేష్‌ కుమార్‌(32). ఉరికంబం ఎక్కిన ఈ ‘దుష్ట చతుష్టయమే’ కాదు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా వున్నారు. వీరిలో ఇంకొకడు రామ్‌ సింగ్‌. ఇతడు జైల్లో వుండగానే చనిపోయాడు. ఇంకొకడున్నాడు. వీడు నేరానికి ఎక్కువ; శిక్షకు తక్కువ. ఈ నేరం జరిగేనాటికి వాడికి 18 యేళ్ళు నిండలేదు. అందుకని అతడి పేరు రాయటానికి కూడా వీల్లేదు. అతడు కూడా అత్యంత పాశవికంగా ప్రవర్తించాడన్నది దర్యాప్తు అధికారుల కథనం. అయినా సరే అతనిని ‘జువనైల్‌((బా) నేరస్తుడిగా గుర్తించి, మూడేళ్ళు ‘బాల ఖైదు’ గా బంధించి వదిలేశారు. ఆ తర్వాత చట్టం గురించి పునారాలోచన చేశారు.
వీళ్ళు చేసిన నేరం దేశాన్ని కుదిపేసింది. అర్థరాత్రి పూట ‘నిర్భయ’ (మార్చిన పేరు), స్నేహితుడితో కసి ఢిల్లీ లో సినిమా చూసి, ఇంటికి వెళ్ళానుకున్నప్పుడు, ఆ ఇద్దరిని బస్సులోకి వచ్చేటట్టు చేశారీ ఆరుగురు. ఆ తర్వాత నడుస్తున్న బస్సులో ఈ ‘అరడజను’ వింత పశువులు, ఇనుప చువ్వతో ఆమె స్నేహితుణ్ణి కొట్టి, అతడి మందే, ఆమెను వివస్త్రను చేసి, కొట్టి ఒకరితర్వాత ఒకరు, అత్యాచారం చేసి, కొట్టి, ఆమె జననాంగం నుంచి, పేగుల్ని బయిటకు లాగి, చచ్చారనుకుని, ఇద్దరినీ బస్సునుంచి విసిరేశారు. ఆమె నరక యాతన అనుభవించి, ఆసుపత్రిలో మరణ వాంగ్మూలం ఇచ్చి మరణించింది.
ఈ ఘటనకు దేశం నలుమూలల నుంచి యువతీయువకులు కదలివచ్చారు; ఢిల్లీ ను చుట్టుముట్టారు. పోలీసు ఆరుగుర్నీ పట్టుకున్నారు. ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం, ఈ తరహా నేరాలు  జరగకుండా, కఠినమైన చట్టాన్ని చేయాలనుకుంది. అందుకు జస్టిస్‌ వర్మ నేతృత్వంలో కమిషన్‌ వేసింది. వర్మ శిఫారసుల్లో కొన్నింటిని స్వీకరించింది. ( ఆయన మరణ శిక్షను ప్రతిపాదించలేదు. అందుకు కారణం లేక పోలేదు. మరణశిక్ష నిజంగానే భయపెడుతుంది. కానీ భయం వల్ల  నేరస్తునికే మేలు  జరుగుతుంది. అత్యాచారం జరిగిన వెంటనే, సాక్ష్యాన్ని తుడిచెయ్యానుకుంటాడు. ఫలితంగా ఆమెను చంపేస్తాడు. అత్యాచారం వెనువెంటనే, హత్యా జరిగిపోతాయి.) వాటితో పాటు అత్యాచారాలకు మరణ శిక్షను స్వీకరించింది. ‘నిర్భయ’ చట్టం చేసేసింది.
అయితే ‘నిర్భయ’ చట్టం తర్వాత కూడా దుండగులు ‘నిర్భయు’లయ్యారు. అత్యాచార పర్వం కొనసాగుతూనే వుంది. ఇటీవనే తెంగాణ లో రెండు ఘోరమైన సామూహిక అత్యాచారాలు జరిగాయి. ఒకటి: హైదరాబాద్‌ లోని ‘దిశ’ సామూహిక అత్యాచారం. రెండు: (ఇది జరగటానికి మూడు రోజు ముందు జరిగిన) అదిలాబాద్‌ జిల్లా లోని ‘సమత’ గ్యాంగ్‌ రేప్‌. ‘దిశ’ అత్యాచారానికి కూడా దేశ వ్యాపితంగా నిరసనలు వెల్లువెత్తాయి. నేరస్తుల్ని కూడా `కొన్ని రోజులనటం పెద్దమాట` కొన్ని గంటల్లోనే పట్టేశారు పోలీసులు. అంతటా ఒకటే డిమాండ్‌: ఎన్‌కౌంటర్‌ చెయ్యాలి. వారికి కొన్ని రోజుల్లో నెరవేరి పోయింది. అత్యాచారం చేసి ఎక్కడ హతమార్చారో, సరిగ్గా అక్కడే ‘దిశ’ నిందితులు ‘ఎన్‌కౌంటర్‌’ లో చనిపోయారు. ఎక్కువ మంది ప్రజలు ‘తక్షణ న్యాయం’గా భావించారు. అంటే వారి దృష్టిలో పోలీసులు విధించిన ‘తక్షణ మరణశిక్ష’. (కానీ పోలీసులు ఆనవాయితీగా చెప్పే కథనం వేరుంటుంది. నిందితులు పోలీసుల వద్ద వున్న తుపాకును తీసుకుని పోలీసుల్లే క్చాటానికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం పోలీసు జరిపిన కాల్పుల్లో  నిందితులు మాత్రమే మరణిస్తారు.) మరణ శిక్షను కోర్టు కదా` వెయ్యాలి. ఆ పని అదిలాబాద్‌ ‘సమత’ అత్యాచారం చేసిన నిందితుల విషయంలోనూ జరిగింది. దర్యాప్తునకు ఎక్కువ సమయం పట్టలేదు. నిందితులను పట్టుకున్నారు. వారికి సైతం కోర్టు ఉరి శిక్ష వేసింది. (సరే. తర్వాత పై కోర్టుకు వెళ్తారు. ఆ పై కోర్టుకు వెళ్తారు. అంతిమ న్యాయం వస్తుంది. )
అత్యాచారం చేసేవాళ్ళను చేజేతులా సృష్టించుకున్న సమాజమే, వారిని పట్టివ్వలేదు. కానీ, పోలీసులు పట్టుకుంటే మాత్రం, వారిని తక్షణం చంపనిదే ఊరుకోదు. ఈ నేపథ్యంలో నిర్భయ నిందితుల ఉరితీత మూడు సమాధానాలు చెప్పింది.
ఒకటి: అప్పటికప్పుడా.. ఎట్టకేలకా.. అన్నది పక్కన పెడితే, దాని పనిని దాన్ని చేసుకోనిస్తే, చట్టం శిక్షిస్తుంది. కానీ డబ్బూ, దస్కం, అధికారం వున్నవారే కాదు,ఆగ్రహోదగ్రులయిన ప్రజలు కూడా అడ్డుపడతారు. వెంటనే న్యాయం అంటారు. కనీసం దొరికిన నిందితులు, అసలు నేరస్తులు  అవునా, కాదా అన్నదానికయినా సమయమివ్వరు. అలా ఇస్తే న్యాయం జరుగుతుంది.
రెండు: ‘ఎన్‌ కౌంటర్ల’ పేరు మీద మరో హత్య చేయించి, దానిని ‘శిక్ష’ గా భావించాంటే, ఇక చట్టాలెందుకు? న్యాయస్థానాలెందుకు? కోరాల్సింది ‘సత్వర న్యాయం’ తో పాటు ‘సరయిన న్యాయం’ అని ఈ శిక్ష తేల్చి చెప్పింది.
మూడు: ‘ఉరి’ శిక్ష పడింది మొదలు  అమలు  జరిగే వరకూ, నేరస్తులు వంద చావులు చచ్చారు. ఉరి ఆగుతుందా? ఆగదా? ఇలా అనుకోవటమే పెద్ద చావు.
నిర్భయ నేరస్తుల ఉరితీత, ఏ న్యాయాన్ని అడగాలో కూడా తేల్చేసింది. అది: ‘సరయిన సత్వర న్యాయం’. ఈ న్యాయాన్ని చట్టం మాత్రమే ఇవ్వగదు.

-సతీష్ చందర్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *