సినీ ఇండస్ట్రీకి ‘పబ్లిసిటీ’యేనా..! బాధ్యత కూడానా.!?
‘సినిమా’ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. సాధారణంగా వారు ఏం చేసినా తెలుసుకోవాలనే ఉంటుంది సగటు అబిమానికి. వారి ప్రోపెషనల్ జీవితమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో ఏం జరుగతుందోనని ఆసక్తి కనబరుస్తారు ప్రేక్షకులు. వారు ఏం చేసినా అది పబ్లిసిటే అవుతుంది. ’’పబ్లిసిటీ పబ్లిసిటీ ఇది సినిమా వాళ్ల యాక్టివిటీ‘‘ అంటూ హాస్యనటుడు బ్రహ్మానందం ఆలపించే ఈ పాట ఇండస్ట్రీ గురించి సినిమా వాళ్ళే తీసిన చిత్రంలోనిది.
నిజమే, అది ఏ సందర్భం అయినా కావచ్చు వారు పబ్లిసిటీ చేసుకోవడానికి. ప్రస్తుతం కోవిడ్-19 వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ ఎవరి పనిని వారు మానుకున్నారు. ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేసిన విషయం విధితమే.
అందులో అన్ని రంగాల వారు ఉన్నారు. అందుకు సినీరంగం మినహాయింపు ఏం కాదు. వారు షూటింగ్ ని పక్కన పెట్టారేమో, పబ్లిసిటీ నీ మాత్రం మరిచిపోలేదు సుమా! గడిచిన లాక్ డౌన్ సమయంలో ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ’బి ది రియల్ మెన్ చాలెంజ్‘ అందుకు నిదర్శనం. ఇంట్లో ఉన్న మహిళలకు సహాయ పడలన్నా కాన్సెంప్ట్త్ తో ఈ చాలెంజ్ ను మొదలుపెట్టారు సందీప్ రెడ్డి.
వీరు చేసే పనులని సామాజిక మధ్యమాలో పోస్ట్ చేసి, మరికొంత మంది నటులకు చాలెంజ్ ను విసురుతారు. ఈ రకంగా ఇంట్లో సహాయపడుతున్నమన్న పేరు మీద పబ్లిసిటీని కాపాడుకుంటున్నారన్నమాట. టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ కూడా విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఈ చాలెంజ్ లో భాగంగానే కొంత మంది సెలబ్రిటీలు చేసిన సాధారణ పనులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
ఈ చాలెంజ్ లో యువ హీరోలే కాదు, టాలీవుడ్ పిల్లర్స్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి పెనం మీద దోసలు వేసి తన తల్లితో పంచుకున్న వీడియో అలాగే కింగ్ నాగార్జున గార్డెనింగ్, వెంకటేష్ ఇంటిని శుభ్రం చేసినటువంటి వాటితో పాటు మిగిలిన నటులు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇళ్ళు శుభ్రం చేస్తున్న వీడియోలను సామాజిక మాధ్యమల్లో పోస్ట్ చేసి, పబ్లిసిటీ ముందంజలో ఉన్నారు. నటులే కాదు, నటీమనులు కూడా ఇందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇంట్లేనే తమకిష్టమైన వంటకాలు తయారు చేస్తూ పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. మెగాప్రిన్స్ నీహారిక కొణిదెల అవకాయ పెడుతూ, కేక్ తయారు చేస్తూ త్రిష, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూరగాయలు కట్ చేస్తూ, పాత్రలు శుభ్రం చేస్తూ అలియా భట్ లు ఎవరికి తోచిన విధంగా వారు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఇదిలా వుండగా అనుష్క శర్మ మాత్రం తన భర్త విరాట్ కోహ్లికి హెయిర్ కట్ చేస్తూ తీసిన వీడియో పై అన్నింటికన్నా పాపులార్ అయ్యింది. ఇలా దాదాపు సెలబ్రెటీలు వాళ్ళు చేసిన పనులను ట్విటర్లో ట్వీట్ చేస్తూ, ఇన్స్ట లో పోస్ట్ చేస్తూ పబ్లిసిటీ ఏ మాత్రం తగ్గనివ్వకుండ చూసుకుంటూన్నారు.
కానీ, వీరు కాకుండా రియల్ టైం హీరోలు తమకోసం కాకుండా ప్రజల కోసం చేస్తున్న వారు లేకుండా లేరు. అందులో ప్రకాష్ రాజ్, సినీ నటీ ప్రణీత మరియు విజయ్ దేవరకొండలు వారు లాక్ డౌన్ సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గర్తించి వారికి బోజనాలు, ఆర్థిక సహాయంతో పాటు నిత్యఅవసర సరుకులు అందజేస్తున్నారు. పబ్లిసిటీ కోసం కాకుండా తమ వ్యక్తిగత అభిరుచి మేరకే చేస్తున్నారనేది కూడా గుర్తించాల్సిన అవసరం మనపైనే వుంది. సినీ పరిశ్రమకు పబ్లిసిటీ మాత్రమే కాదు… బాధ్యత కూడ ఉందని నిరూపించారు.
-సుమాంజలి.కె, విద్యార్థిని
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.