నెట్టింట్లోని ఆటలకు సెలవా..!
’అగిపో బాల్యమా‘ అంటూ మహానటి బయోగ్రఫీలో తన బాల్యం అలాగే ఉండాలంటూ ఓ పాట ఉంటుంది. అందులో చూపించినట్లు, బాల్యం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ప్రస్తుత తరం బాల్యమంతా టెక్నాలజీలో సాగుతుంది. గత పది, ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే, బాల్యం చాలా సారదాగా సాగేది. సరదాగా అందరితో కలిసి ఆడుకుంటుండేవారు. అదికాస్త ఒక సముహం నుంచి ఒక్కరు నాలుగు గోడల మధ్య ఏ వీడియో గేమో, లేక కర్టూన్ చూస్తునో గడపడమే ప్రపంచమైపోయింది. గత కొద్ది కాలంగా కోవిడ్-19 వ్యాప్తి చెంది ప్రపంచమంతా లాక్ డౌన్ ఉండిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుత తరం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటూ, మనుషులందరూ నవీకరణ చెందుతూ, ప్రపంచం ముందుకు సాగిపోతుంది. దీని పరిణామం ఎంతలా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందంటే, ఆహారపు అలవాట్ల నుండి ఆడే ఆటల దాకా ఒక 30 సంవత్సరాలు వెనుకకెళ్ళినట్లుంది. ఒకప్పుడు ఆడుకున్న ఆటలకీ, ఇప్పుడు ఆడుతున్న ఆటలకీ చాలా వ్యత్యాసముంది. అప్పట్లో తమకి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని పిల్లలకి ఆటలు నేర్పేవారు. కానీ ఇప్పుడు సాంకేతికతను మాత్రమే పరిచయం చేస్తున్నారు. స్నేహితులు వచ్చి ఆడుకుందామా..? అనగానే గుర్తొచ్ చేవి క్రికెట్, చేస్, వాలీబాల్, క్యారమ్ బోర్డు లాంటివి తీసుకొచ్చి ముందుంచుతుం టారు. ఒకప్పుడు పట్టణంలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలోని యువతకు చేరువ అయ్యాయనుకోండి (అది వేరే విషయం.)
కానీ, అవి కాకుండా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో చిన్న పిల్లలు, మహిళలూ అడుతుండే అష్టా-చమ్మా, కచ్చికాయాలు, పులికట్టు, ఒమన గుంతలు, పచ్చిస్సు, గోఠీలాటాలు గత కొంత కాలంగా కనుమరుగయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటికి పెద్దగా ప్రాదాన్యత ఇవ్వడం లేదు. తిరిగి ఈ ఆటాలన్నీ లాక్ డౌన్ సమయంలో ఇప్పటి పిల్లలు, మహిళలూ ఈ ఆటలను తెరపైకి తీసుకువచ్చారు. కొంత పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నప్పటికీ, ఒక భాధకరమైన విషయమేమిటంటే, ’అష్టా-చెమ్మా‘ అనే సరదగా అడారో, ఆ ఆటే వారికి ముప్పును తీసుకోచ్చింది. గత నెలలో సూర్యపేట జిల్లాలో అష్టా-చెమ్మా అడుతూ ము ఫ్ఫై మందికి పైగా కరోనా వ్యాప్తికి గురయ్యారు. (వీటిలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది.)
మోడర్న్ కాలం అంటూ మరీ, రోజు ఉపయోగించే మొబైల్ తో కూడా ఆటలు (పబ్జీ, వై కింగ్స్ లాంటి అన్ లైన్ గేమ్స్) ఆడేస్తున్నారు. అసలు వీటిని ఆటలు అంటారా..? దిక్కులు చూడకుండా ముఖం మొత్తం ఫోన్ లో పెట్టి వాళ్ళలో, వాళ్ళు నవ్వుకుంటూ, ఆవేశపడుతూ ఆడేస్తుంటారు. వారి పక్కన కూర్చున్న వారు వీళ్ళకి పిచ్చీ పట్టిందనుకోవడంలో సందేహమే లేదు.
అసలు ఆటలు ఆడటానికి కారణం, ఎప్పుడు ఒకే పనుల్లో వాళ్ళు మునిగి పోతుంటారు కాబట్టి, తిరిగి ప్రశాంతత, తాజాదనం పొందేందుకు ఈ ఆటలు ఆడుతుంటారు. ఒకసారి ఈ ఆటలను గమనించినట్లయితే, అప్పట్లో ఆటలు కాలానికి తగ్గట్టు ఆడుతుండడం జరిగేది. కానీ, కాలం మారుతున్న కొద్ది మనుషుల జీవన శైలిలో మార్పు వచ్చింది. ఈ సమయంలో మరోకసారి పాత జ్ఞాపకాలను గుర్తుకు తీసుకువచ్చింది. అయితే ఒకటి మాత్రం నిజం… విలువలని మర్చిపోయి మనమందరం డబ్బు వెనుకబడి పరిగెత్తుతుంటే కరోనా వచ్చి అడ్డుకట్టవేసింది.. కాదాంటారా.!?
వ్యాసం: సుమాంజలి.కె, విద్యార్థిని.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.