లాక్ డౌన్ ఒక్కటే..! జీవితాలే భిన్నం.!?
కరెన్సీ బిళ్ళకు రెండు ముఖాలున్నట్లే, ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ లో ఇరుక్కున్న ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రపంచంలో కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. కోవిడ్-19 విజృంభించకుండా దేశాలు విధిస్తున్న లాక్ డౌన్ ఉద్దేశం అన్ని దేశాలకు ఒకటే కావొచ్చు కానీ, లాక్ డౌన్ లో ప్రజలందరి పరిస్థితులు ఒకేలా ఉండకపోవచ్చు. కొన్ని కుటుంబాలు ఆకలితో ఆలమటించవచ్చు. కొన్ని కుటుంబాలు సెలవులు ప్రకటించుకుని సంతోషంగా గడపవచ్చు.
ప్రస్తుత స్థితిలో మధ్యతరగతి కుటుంబంలోని పరిస్థితులు, నిరుపేద కుటుంబంలో ఉండే పరిస్థితులు భిన్నంగా వుంటాయి. ఈ కుటుంబాల పరిస్థితిని రెండు వేర్వేరు కోణాల్లో, రెండు వేర్వేరు పరిస్థితులను తెలుపుతాయి.మధ్యతరగతి కుటుంబలు చూసినట్లయితే, ఈ సమయాన్ని తమ ఇంట్లోనే గడుపుతున్నారు. సాధారణ సమయంలో ఎవరికి వారు వారి వారి పనుల్లో నిమగ్నమైపోతుంటారు. కొద్దిగా సమయం దొరికిన కుటుంబంతో గడపాలని ఆశతో ఉంటుంటారు. సరిగ్గా ఈ సమయం వారికి కలిసిసొచ్చిందనే చెప్పవచ్చు. వారికి నచ్చిన ఆహారమే తయారు చేసుకోవడమే కాకుండా, ఇంట్లోనే తమ కుటుంబాలతో కలిసి సినిమాలు చూడగలుగుతున్నారు. కాబట్టి వారు సెలవులో వున్న అనుభూతితో ఉండగలుగుతున్నారు. అంతేకాదండోయ్..! ప్రస్తుత ఈ కాలంలో కొన్ని మధ్య తరగతి కుటుంబాల ఇళ్లు హోం క్వారంటైన్ కి బదులుగా హోం పిక్ నిక్ ల అయిపోయాయి.
నిరుపేద కుటుంబాల పరిస్థితి చూస్తే, నిజంగా ఈ లాక్ డౌన్ వారికి శాపంగా భావిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని పని చేస్తే కాని, వారి ఆకలి బాధలు తీరవు. అలాంటి వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ నిరుపేద కుటుంబాల రెక్కలకు తాళం వేస్తే మరీ, ఆ కుటుంబాల డొక్కలు ఎలా నిండాలి? ప్రభుత్వాల సహాయాలు వాళ్ళ ఆకలిని పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. వారి చిన్న చిన్న ఇండ్లు, పేదరికం, ఆకలి, ఆశాలన్నీ కూడ ఒక లాక్ డౌన్ చిన్నాభిన్నం చేస్తుంది. గతంలోనే గోరేటి వెంకన్న ఈ నిరుపేద కుటుంబాల జీవితాలను అద్దం పట్టేలా ఓ పాటను రాశారు. “గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది. వాళ్లు ఉన్న ఇల్లు కిల్లీ కొట్ల కన్నా చిన్న ఉన్నాయో”అని. అప్పుడే అలా ఉన్నాయంటే పేదల బతుకులు మరీ, ప్రస్తుత కాలంలో వారి బతుకులు ఇంకెంత అధ్వానంగా తయారయ్యాయో ఊహించవచ్చు. ఈ పరిస్థితులలో వారికి పనులు దొరకకా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. కేవలం ఆర్థిక పరంగానే కాదు, దైనందిన జీవితాన్ని. సరైన భోజనం ఒకపూట చేయలంటే, రోజంతా కష్టపడాల్సి వుండేది. వాళ్లు నివసించే చిన్న, చిన్న ఇల్లు, అందులో కొందరు పడుకుంటే, మరికొందరు వీధుల్లో పడుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కడుపు పస్తులతో పడుకునే రోజులు పేద కుటుంబాలకు వచ్చాయి. ఆర్థికంగా కాదు చాలా రకాలుగా నష్టపోతున్నారు. కనీసం ఇంట్లో వాడుకోవడానికి సైతం నిత్యావసర సరుకులు లేని పరిస్థితుల్లో వారు బతుకీడుస్తున్నారు. ప్రపంచమంతటా లాక్ డౌన్ ఉద్దేశం ఒకటే కానీ, మధ్యతరగతి, పేద, ధనిక, కుటుంబాల్లో మాత్రం ఆంతరాలు. వాటి వల్ల ఎదురవుతున్న పరిస్థితులు వేరుగా వుంటాయనడంలో సందేహ పడాల్సిన అవసరం లేదు. ఏమంటారు.!?
– వెంకటేష్.పి, విద్యార్థి,
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.