FilmsNewsips

“దిశ”రేప్ వదలి… ప్రణయ్ ’మర్డర్‘ వైపు ఎందుకొచ్చాడు..?

వివాదాస్పద వార్తలకు పెట్టింది పేరు రామ్ గోపాల్ వర్మ. ఈయన ఏ సినిమా మొదలు పెట్టిన ఒక సంచలనంగానే మారుతుంది కాదు కాదు సంచలనం చేస్తారు. గత రెండు రోజుల క్రితం “ఫాదర్స్ డే” సందర్భంగా “మర్డర్” అనే సినిమా ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ ఖాతా వేదికగా విడుదల చేశారు.

ఈ సినిమా 2018లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పై జరిగిన పరువు హత్యకి సంబంధించిన సినిమాగా చెపుతున్నారు. ఇందుకు సంబంధించి అమృత సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా ప్రతిస్పందించినట్టుగా ఒక లేఖ చక్కర్లు కొడుతుంది. కానీ, సినిమాపై అమృత వ్యాఖ్యల పేరిట పత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల గురించి తాజాగా ఆమె మామయ్య బాలస్వామి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు.      

కానీ వర్మ మాత్రం, కొందరిని చెడుగా చూపించడానికి ఈ సినిమా తీస్తున్నాను అనుకోవడం సరికాదు. ఎందుకంటే… ఏ వ్యక్తి చెడు కాదని నేను గట్టిగా నమ్ముతాను. కేవలం ప్రతికూల పరిస్థితులు వ్యక్తిని చెడ్డవాడిని చేస్తాయి. దీనినే నేను “మర్డర్ ” సినిమాలో చూపించాలనుకుంటున్నాను. ఆ సమయంలో వారు పడిన బాధను, నేర్చుకున్న పాఠాన్ని గౌరవిస్తూ సినిమా తీయబోతున్నన్నారు.
వర్మ  తీసిన సినిమాలు ఏ వివాదం లేకుండా విడుదలకు నోచుకోదు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే, ఎటువంటి ఖర్చు లేకుండా సినిమా ప్రచారం జరుగుతుంది కాబట్టి. ఈ విషయంలో చాలా మంది ఈయనను అనుసరించే వారు   ఉన్నారు. ఇక్కడ ఇంకోక విచిత్రం ఏమిటంటే, ఈ సినిమా నిర్మాత నట్టి కుమార్ కూడా చిత్ర పరిశ్రమలో వివాదాస్పద నిర్మాత అని చెప్పవచ్చు.
చిత్ర పరిశ్రమలో ఎటువంటి పారంపర్య  నేపథ్యం లేకుండా వచ్చిన వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ప్రతి ఏటా ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను మూడు సార్లు మరియు ఒక ఫిల్మ్ ఫేర్ నుంచి ఉత్తమ దర్శకుడు అవార్డ్ స్వంతం చేసుకున్నారు. తన సినీ జీవితాన్ని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించి రావు గారిల్లు, కలెక్టర్ గారి అబ్బాయిలాంటి సినిమాలతో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఎటువంటి పరిచయం లేకుండానే 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడైన అక్కినేని నాగార్జునను ‘శివ’ చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారంటే వర్మ ఎంతటి మాటకారో మనం అర్ధం చేసుకోవచ్చు.
గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగిన “దిశ” ఘటనపై సినిమా తీస్తాను అని కొంతకాలం పాటు హడావిడి చేసారు వర్మ. ప్రస్తుతం దాని గురించిన ప్రస్తావనే లేదు. అందుకు కారణం ఆ విషయంలో ఎవరు ప్రతిస్పందించలేదు కాబట్టే. ఇప్పుడు కూడా  ఈ విషయంలో స్పందించకుంటే,  విరామించుకుంటారనే ఆశాబావాన్ని వ్యక్త పరుస్తున్నారు ప్రజలు.
-అనంద్ కుమార్, విద్యార్థి.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *