భరించడం… “భవిషత్తు” కోసమేనా..?
ఏంటో అండి..! ఈ జీవితం ఎపుడు వినని, చూడని వింతలని చూడాల్సి వస్తుంది. నాకు తెలీసీ మీ అందరికీ అర్థమయింది అనుకుంటా..! దేని గురించి చెప్తున్నానో. అదేనండీ..! ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించే. రోజు వినే వార్తే కదా..! మళ్ళీ కొత్తగా ఏముందీ అనే కదా మీ బాధంతా. అదే విషయానికి వస్తున్నా…
కరోనా మహమ్మారి ఏ మంత్రం వేసిందో కానీ రోజు రోజుకి ప్రతి ఒక్కరి జీవితాలు దారుణంగా తయారవుతున్నాయి. అన్నింటికి ధరలు పెంచారు. తిందాము అంటే కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి, అలా బయటికి వెళ్లి ఇంట్లోకి ఏవైనా తీసుకుందాము అంటే, మన వాహనానికి కూడా దాహం వేస్తుంది కదా..! దాని దాహం తీరుద్దాము అనుకుంటే దానికి కూడా వాచిపోయేలా ధరలు పెరిగాయి.
ఇక అసలు విషయానికి వొస్తే… ఇంట్లో మాములుగా ఒక సెల్ ఫోన్ ఉండటమే కష్టం అనుకుంటే, ఇపుడు ఉన్న పరిస్థితుల్లో అన్ లైన్ క్లాసుల పేరుతో పిల్లలకి మరో పెద్ద ప్రమాదమే తీసుకొచ్చింది. అలా కాదు అని కొత్తగా ఫోన్, లాప్ టాప్, టాబ్ లాంటి గాడ్జెక్ట్స్ ఏదైనా కొనుకుందాం అని వెళ్లిన ధరలు కొండలని తాకుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే, స్కూల్ యజమానులు మాత్రం ఫీజులా పేరుతో తల్లిదండ్రుల పైన విరుచుకుపడుతున్నారు. టీచర్స్ బోధించే బోధనకు మాత్రమే ఫీజు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దాంతోపాటు కిందటి ఏడాది ఫీజులే కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేట్ స్కూలు మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు. ట్యూషన్ ఫీజుతో పాటు అన్ని ఫీజులు చెల్లించాలని మొండిగా ప్రవర్తిస్తున్నారని ఇటీవల చేసిన ఒక సర్వేలో తలిదండ్రులు వాపోయారు.
అసలు ఆన్ లైన్ క్లాసుల గురించి తల్లిదండ్రుల ఉద్దేశ్యం ఏంటో తెలుసుకుందామని ఆన్లైన్ సర్వే ఏర్పాటు చేశారు. ఈ సర్వేలో 1,247 మంది తలిదండ్రులు స్పందించారు. ఈ సర్వేలో మనకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, 90% తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసేస్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని చెప్తున్నారు. అలాగే ఆన్లైన్ క్లాసేస్ ద్వారా పిల్లలకి కళ్ళు దెబ్బతింటాయని చెప్పుకొస్తున్నారు.
కోవిడ్-19తో ప్రపంచమంతా మన భారతీయ సంస్కృతిని పాటిస్తున్నారు. అలాగే ఈ వైరస్ కూడా మన సంస్కృతిని పాటిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎలాగా అని అనుకుంటున్నారా..? అదేనండి తెలుగు సంప్రాదాయంలో ఆషాడం మాసం కొత్త కోడళ్ళు పుట్టింటికి వెళ్తారు కదా..! అలాగే కరోనా కూడా సెలవు తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్లినట్లయితే, బాగుండేది. అప్పటికీ, కొంచెం పరిస్థితులు మెరుగుపర్చేలా ఉంటాయి. ఒకనొక సినిమాలో బాలయ్య బాబు అన్నట్టు ’’ఎన్నెనో అనుకుంటాం. కానీ అని జరుగుతాయా ఏంటి‘‘.
-సాయి శరణ్య, విద్యార్థిని,
ఇంటర్న్ షిప్ వింగ్, ఎ.పి. కాలేజీ అఫ్ జర్నలిజం.