సీని రంగంలో కొత్తదనం రాబోతుందా..?
“అంతా రామమయం ఈ జగమంతా రామమయం” అంటూ శ్రీరామదాసు లో ఉన్న పాట లాగా అంతా కరోనామయం ఈ జగమంతా కరోనామయం అయిపోయింది. ఈ వైరస్ వల్ల అన్నీ రంగాలతో పాటు, సినీ రంగం కూడా దెబ్బతిన్నది. రెండు నెలల నుంచి ధియేటర్లు మూతబడ్డాయి. అయితే ఈ లోటును ఓటీటీ వేదికలు తీరుస్తున్నాయి. ఈ మద్య వచ్చిన”శక్తి, రన్, పెంగ్విన్, క్లైమాక్స్, అమృతరామన్”లు అందుకు ఉదాహరణలు.
ఏడాది మొదలవగానే సంక్రాంతికి వచ్చే కొత్త కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో కళ్ళు మొత్తం ధియేటర్ల వైపు తెరుచుకొని చూస్తుంటారు, అలాగే వేసవి కాలంలో కూడా. కానీ ఈసారి కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలల పాటు వీటిని మూయవలసి వచ్చింది. అందువల్ల షూటింగ్స్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ అవ్వడానికి సిద్దంగా ఉన్న సినిమాలకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఈ కారణంగా దర్శకులు ఓటీటీ నీ ఎంచుకున్నారు ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులకు ఓటీటీ మంచి వేదికగా మారింది. ఈ లాక్ డౌన్ వల్ల యువత కూడా ఓటీటీ ఆధారంగా విడుదలయ్యే సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. అలాగే ఈ మధ్య రిలీజ్ అయిన SIN అనే వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆలోచింపచేసింది. ఒక రకంగా చూస్తే సినీ రంగంలో కొత్తదనం రాబోతుందా అనిపిస్తుంది.
దాదాపు యువత కూడా మనసునీ ఆలోచింపచేసే, అబ్బురపరిచే సినిమాలు రావాలని కోరుకుంటుంది. అయితే ఇలాంటి వెబ్ సిరీస్ బాలీవుడ్ లో ముందుగానే విడుదలయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి సిరీస్ వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, కొంత మంది నిర్మాతలు మాత్రం ఈ లాక్ డౌన్ అయిపోయిన కూడా ఒకవేళ ధియేటర్లు తెరచుకున్న వీక్షకులు కచ్చితంగా ముందుకు రారని వాళ్లలో మహమ్మారి భయం ఉంటుందని, కరోనాకి ఔషదం వచ్చాకే ప్రేక్షకులు ధైర్యంగా ధియేటర్ కి వస్తారని, ఈ ఏడాది చిత్ర పరిశ్రమకి పెద్ద దెబ్బ వాటిల్లిందని అన్నారు.
-సుమాంజలి.కె, విద్యార్థిని.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.