బహిష్కరణ: ‘అప్’ లేనా..? ‘వస్తువులు’ కూడానా..?
హేయ్ ప్రియా! టిక్ టాక్ లో వీడియోస్ రావండంలేదే., అదేంటి సింధు, నీకు తెలీదా. నిన్న రాత్రి మన దేశంలో టిక్ టాక్ తో పాటూ 58 చైనా అప్లికేషన్ లు బాన్ చేసింది. ప్రియా”ఓహ్ మై గాడ్ ఇప్పుడు నేను టిక్ టాక్ ఎలా చేయాలి..!”ఇది ప్రస్తుతం భారత్ లో యువత పరిస్థితి. పది రోజుల క్రితం గాల్వాన్ లో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాని పరిణామమేనా ? చైనా తో ఎప్పుడు వివాదం జరిగిన ఆ దేశ వస్తువుల పై నినాదాలు చేస్తుంటాం, కానీ దాని ప్రభావం కొద్ది రోజులే ఉండేది. ఈ సారి మాత్రం భారత్ ఒక అడుగు ముందేసి చైనా యాప్ లన్ని నిషేధించింది.
ఈ అప్లికేషన్లను కాస్త పక్కనపెడితే, పండిచే విత్తనాల దగ్గర నుంచి పడుకునే ముందు చూసే మొబైల్ వరకు అన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇక చైనా సంగతి చేప్పనవసరం లేదు. భారత్ లక్ష యాభైవేల రూపాయాల విలువ చేసే వస్తువులు చైనా కి ఎగుమతి చేస్తే, చైనా నుంచి భారత్ రూ.5,50,000 విలువ చేసే వస్తువుల్ని దిగుమతి చేసుకుంటోంది. అంటే ఐదు రేట్లు ఎక్కువ. ఈ లెక్క ప్రకారం చూస్తే, మనం ఎంతలా ఇతరుల పై ఆధారపడుతున్నామో తెలుస్తుంది. కేవలం యాప్ లను బహిష్కరించిన ప్రభుత్వం, దేశంలో విదేశీ పెట్టుబడుల గురించిన ప్రస్తావనే లేదు? ఈ పెట్టుబడులు అధికంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయంలోనే ఎక్కువగా వచ్చినట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుంచి సమాచారం. స్వాతంత్రోధ్యమ సమయంలో గాంధీ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటే “తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకు అన్ని స్వదేశివే వాడాలి” అన్న మాటలు పక్కన పెట్టినట్టేనా..? ప్రైవేటీకరణకు అలవాటు పడిపోయి ఇంతవరకు తీసుకొచ్చాము. కాస్త నిజాయితీగా మాట్లాడితే “మెడ్ ఇన్ ఇండియా” వస్తువులు టక్కున పది చెప్పమంటే తడబడే పరిస్థితిల్లో ఉన్నాము. చివరికి వస్తువుల్ని తయారుచేసే ముడి సరుకు కూడా చైనా నుంచే దిగుమతి చేస్తున్నాము అంటే, మనం ఎంతలా ఆధారపడిపోయామో అర్థం చేసుకోవచ్చు. మరీ, బాయ్ కాట్ చైనా నినాదం కేవలం యాప్ ల బహిష్కరణ వరకేనా..? లేదా వస్తువుల బహిష్కరణకు కూడానా..? అన్నది ఆలోచించాల్సిన విషయమే.
-సుమాంజలి.కె, విద్యార్థిని.
ఇంటర్న్ షిప్ వింగ్, ఎ.పి. కాలేజీ అప్ జర్నలిజం.