టెక్నాలజీ ముందుకు… మనిషి అలోచనలు వెనక్కి.!?
చేతబడి చేశారన్న కారణంతో ఐదుగురు మహిళలపై దాడి… కేసు నమోదు చేసిన పోలీసులు.
జహీరాబాద్: ఒక పక్క టెక్నాలజీతో ముందుకు వెళుతుంటే, మరోపక్క మనుషుల అలోచనలు మాత్రం వెనక్కివెనక్కి పయనిస్తున్నాయి. హైస్పీడ్ టెక్నాలజీ అని జబ్బలు చారచుకునే నాయకులున్నారు. ప్రపంచ స్థాయిలో నగరమంటూ మాటలు మాట్లాడే లీడర్లు ఉన్నారు. కానీ, ప్రజలే వాటినఅందిపుచ్చుకోలేకుండా వున్నారు. టెక్నాలజీ ఎంత ముందున్నా దాన్ని అందిపుచ్చుకునే జ్ఞానం అవసరం కదా..!
టెక్నాలజీలో 4జీ దాటి, 5జీలోకి ఎంటర్ అవుతున్నప్పటికీ, ఇంకా మూడత్వంలోనే బతుకీడుస్తున్నారు కొన్ని వర్గాల ప్రజలు. చేతబడి చేశారని అరోపిస్తూ, ఐదుగురు మహిళలపై దాడి చేశారు. ఈ ఘటన న్యాల్కల్ మండంలోని మల్గి గ్రామంలో బుధవారం రోజు చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన భూంరెడ్డి అనే యువకుడు గుండె నొప్పితో మరణించారు. దీంతో చేతబడే కారణమనే నేపంతో అతని బంధువులైన ప్రతాప రెడ్డి, సంజీవ రెడ్డి, సరస్వతి తదితరులు ఐదుగురు మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో దాడికి పాల్పడిన వారు పోలీసులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బాధితుల ఫిర్యాదుతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు గాను కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.