‘అధికారం’తో ‘అధికార’ దుర్వినియోగం
మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.
అధికారులు తమ విధులను ప్రజల కోసం నిర్వర్తించకుండా, అధికార పార్టీ కోసం పనిచేయడం ఏ పార్టీ అధికారంలో వున్న జరుగుతూనే ఉన్నాయి. చిన్న స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికార వర్గాల వరకు ఇది కొనసాగుతూనే వుంది. ప్రజలకు అందాల్సిన ఫలాలను నాయకులకు ఖర్చు చేస్తున్నారనే అభియోగాలు లేకపోలేదు. తాజాగా రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ జన్మధినం సందర్భంగా కానుక ఇవ్వలనుకున్నారో, ఏమో..! ఏకంగా ప్రతిపక్షలకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించారు ఒక మున్సిపల్ కమీషనర్.
హుస్నాబాద్(సిద్దిపేట): మున్సిపల్ కో-అప్షన్ ఎన్నికల్లో విధులు సరిగ్గా నిర్వహించకుండా, అధికార పార్టీ నాయకులకు మేలు చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ నాయకులు అరోపించారు. అందుకు బాధ్యులుగా మున్సిపల్ కమిషనర్ ని తప్పుపడుతూ, కమీషనర్ అఫీసు ముందు కాంగ్రెసు నాయకులు బయటాయించి తమ నిరసనను తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ… నేడు జరగాల్సిన కో.ఆప్షన్ ఎన్నికకు భరిలో ఉన్న కో.ఆప్షన్ అభ్యర్థికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు నిర్ణీత సమయాని కంటే, అరగంట ఆలస్యంగా వచ్చారు కాబట్టే, మిగతా అభ్యర్థులను ఏకగ్రీవం చేశామని కమిషనర్ చెప్పారన్నారు. ప్రస్తుత కమిషనర్ ఆధ్వర్యంలోనే గతంలో చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆ సమయంలో నిర్ణీత సమయానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు హాజరయినారు. వారిని గంటన్నర పాటు వేచి ఉంచేలా చేసి, ఆలస్యంగా వచ్చిన అధికార పార్టీ కౌన్సిలర్లకు సమయం వెచ్చించి చైర్మన్ ఎన్నిక నిర్వహించలేదా..? అని ప్రశ్నించారు.
ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసి మంత్రి కేటీఆర్ కి బహుమానంగా ఇవ్వాలనుకున్నారు మున్సిపల్ కమీషనర్. దీంతో ఎమ్మెల్యే, మంత్రుల మెప్పు పొందడం కోసమే ఈ ఎన్నికను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యత గల పదవిలో ఉండి అధికారిక కార్యక్రమాలు, తెరాస పార్టీ వ్యక్తిగత కార్యక్రమాలలో పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ తో పాటు అధికార పార్టీకి చెందిన మహిళ కౌన్సిలర్లు పాల్గొనాల్సిన కార్యక్రమాలలో వారి భర్తలను పాల్గొనేలా ప్రోత్సాహిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా లాక్ డౌన్ లో వచ్చిన డబ్బులను మహిళ కౌన్సిలర్ల భర్తలతో, తెరాస నాయకులతో పంపిణీ చేశారు. వాటికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని బహిరంగ పరిచారు.
కమీషనర్ స్థానికంగా నివాసం ఉండి మీ ధోరణి మార్చుకోవాలి లేదా రాజీనామా చేసి తెరాస లో చేరాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని రెచ్చిపోతున్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని తెరాస పార్టీ కార్యాలయంగా మార్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా తీరును సాక్ష్యాలతో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, పట్టణ యూత్ అధ్యక్షుడు పున్న సది, మైనారిటీ అధ్యక్షుడు మొహ్మద్ షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.