ప్రాణం కోసం… ప్రాణాన్నే పణంగా పెట్టి.!?
ప్రేమ కోసమో, ప్రేమించిన అమ్మాయి దూరం అవుతున్నారనో బ్లేడుతో ప్రాణాలను తీసుకునే వారిని చూశాము. కావాల్సిన వస్తువో లేక డబ్బులు సమయానికి దొరకపోతే, బ్లేడును అశ్రయించినవారిని చూస్తుంటాము. కానీ, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాన్నే తీసుకునే ప్రయత్నం చేశారు. కడప జిల్లా వాసి.
కడప: వైద్యులు పట్టించుకోవడం లేదనే కారణంగా ఓ వ్యక్తి(38) సోమవారం ఉదయం గొంతు కొసుకున్నాడు. నగరంలోని సాయిపేటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో రిమ్స్ లో చేరాడు. వైద్యులు పట్టించుకోకపోవడంతో పాటు సరైన వైద్యం అందడం లేదని మనస్థాపానికి గురై ఆసుపత్రిలోనే ఉదయం తెల్లవారుజామున గొంతు కోసుకున్నాడు. ఈ విషయం అందుకున్నరిమ్స్ అధికారులు అప్రమత్తమై వెంటనే సర్జికల్ ఐసీయూలో వైద్యం అందించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు, ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులను రిమ్స్ అధికారులు సంప్రదించారు. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.