FilmsNewsips

అర్జీవీ సినిమా: పరువు ‘హత్య’ను తండ్రి ‘ప్రేమ’గా చూపించనుందా..?

ఏ వ్యక్తి అయినా తను చూపించే, లేదా తనపై చూపే ప్రేమ ఒక్కటే. అది వ్యక్తపరిచే విధానం భిన్నంగా వుండవచ్చు. అంతేకానీ, ప్రేమించిన వ్యక్తిని దూరం చేసేలా వుండదు. ప్రేమ ఎప్పుడు ప్రేమను పంచుతూనే ఉంటుంది. అది తండ్రి నుంచి అయినా, జీవిత భాగస్వామి ప్రేమయినా…

ఏది తండ్రి ప్రేమ..? కూతురు ప్రేమించిన వ్యక్తిని చంపేయ్యడమే తండ్రి ప్రేమ అవుతుందా.!? వివాదస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే విడుదల చేసిన “మర్డర్” సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. “పిల్లలను అమితంగా ప్రేమిస్తే ఏమవుతుంది?” లాంటి వ్యాఖ్యనాలు, తండ్రి ప్రేమను మాత్రమే గొప్పగా చూపించేట్లు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. అర్జీవీ ఏ కోణంలో చూపిస్తారనే అంశంపైనే అందరి చూపు ఉంది.

ఈ పరువు హత్యలో ఒక తండ్రి ప్రేమను మాత్రమే ఏ విధంగా చూడగలరు. ట్రైలర్ లోని మరికొన్ని వ్యాఖ్యలను పరిశీలించినట్లయితే, “పిల్లలను ప్రేమించడం తప్పా?. వేరే గతి లేనప్పుడు చంపించడం తప్ప..? అనే మాటలు నిజంగా పరువు హత్యలు ప్రోత్సహించినట్లుగానే ఉన్నాయని సామాజిక విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అమిత ప్రేమ ఉన్న తండ్రే అయితే, తన కూతురు ప్రేమను వ్యతిరేకించే వాడు కాదు. అయినా హత్యలతో పరువు నిలుస్తుందా!?. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వీటన్నింటిని గాలికి వదిలేసారు. పరువు హత్యలే, తండ్రి ప్రేమను చూపడం ఒక సభ్యసమాజాన్ని నిర్మించలేవు.

వాస్తవానికి తండ్రికి కూతురుపై ప్రేమ ఉంటే, ఏ తండ్రి తన కూతురి జీవితాన్ని ప్రశ్నార్థకం గా మార్చారు. నా కూతురు నాతో లేకుండా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇలాంటి హత్యలలో, తండ్రి ప్రేమని ఎలా చూడగలము. తన కూతురిని వితంతువుగా మార్చిన తండ్రి చర్యను ఈ సినిమాలో తండ్రి ప్రేమగా ఎలా చూస్తారు.? యావద్భారతం ప్రణయ్ పరువు హత్యను వ్యతిరేకించాయి. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, సినీ పెద్దలు సైతం ఈ చర్యను తమదైన శైలిలో వ్యతిరేకించారు. చివరకి కోర్టు సైతం హంతకులకు శిక్ష విధించింది. ఈరోజు ఆ హంతకుడినే హీరోగా చూపించడమా..? ప్రజల పై సినిమాల ప్రభావం చాలానే ఉంటుంది. సమ సమాజ స్థాపన కోసం సినిమాలు తీయవలసిన దర్శకులు ఇలా కుల, పరువు హత్యలను ప్రోత్సహించే సినిమాలు తీయడం సమాజమే సిగ్గు పడాల్సిన విషయం. ఈ పరువు హత్యను ఏ కోణంలో చూసినా తండ్రి ప్రేమ కనిపించదు. కూతురి సంతోషాన్ని కోరుకునే ఏ తండ్రి ఈ విధంగా చూడాలనుకొరు. కానీ, ఈ ట్రైలర్ లో దర్శకులు మాత్రం కూతురుని ప్రేమించిన అబ్బాయిని చంపడమే, తండ్రి ప్రేమగా చూపిస్తారని తెలుస్తుంది.

అర్జీవీ మాత్రం సమాజంతో పట్టింపు లేనట్లుగానే, తనదైన శైలిలో మరో వివాదానికి తెరలేపబోతున్నారని అర్థమవుతుంది. అయితే, చివరిలో ‘‘పిల్లలను కనగలం కానీ, వారి మనస్తత్వాలను కనగలమా..?’’ అంటూ ప్రేక్షకులకే వదిలేశారు. వ్యక్తి ప్రాధాన్యత గురించి మాట్లాడే అర్జీవీ, ఈ సినిమాలో వ్యక్తిగా తీసుకున్న అమృత నిర్ణయాన్నిగౌరవిస్తారా..? లేక కుటుంబ నిర్ణయానికి వదిలేసి నేరానికి మద్దతుగా నిలుస్తారా..? అనేది తెలియాలంటే, సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే…

-వెంకటేష్, విద్యార్థి.

ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *