పుస్తకాల పురుగులు పెరిగారండోయ్..!

“చిరిగినా చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నారు నార్ల వెంకటేశ్వరావు. కానీ, ప్రస్తుత తరం మాత్రం “చిరిగినా చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కో”. అన్నట్లు మారిపోయారు. స్మార్ట్ ఫోన్ వాడకం మొదలు నుంచి చాలా వరకు పుస్తక పఠనం తగ్గించారు. పూర్వం ఒక పుస్తకం చదవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరీ చదివేవారు. కానీ, ప్రస్తుతం ప్రపంచంలో చదవటానికి ఎన్ని సౌకర్యాలు ఉన్నా, చదవడం మాత్రం కుదరట్లేదు.
ఇదిలా ఉంటే, కరోనా పుణ్యమా అని పుస్తకాలు చదివే వారి సంఖ్య గత దశాబ్దంతో పో లిస్తే 12 % పెరిగిందని జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ రచయితల పుస్తకాలను చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నీల్సన్ బుక్ ఇండియా కన్స్యూమర్ రీసెర్చ్ స్టడీ వెల్లడించింది.
కరోనా మహమ్మారి ఏ మంత్రం వేసిందో కానీ, మన రోజువారీ అలవాట్లు, ఆలోచనలు అన్నివిధాలా మార్చేసింది. ఇంట్లోంచి బయటకి వెళ్లకుండా చేసింది. వర్క్ ఫ్రాం హోమ్, ఆన్ లైన్ క్లాస్సేస్ ఇలా పరిపరి విధాలుగా మనుషులని వారి నిత్యజీవితాలనీ తలకిందులుగా చేసింది.
ఈ సమయంలో జాతీయ- అంతర్జాతీయ, రాజకీయం, క్రైమ్, రొమాన్స్, హిస్టారికల్ ఫిక్షన్, స్త్రీవాద సాహిత్యం వంటి పుస్తకాలని ఎక్కువగా చదువుతున్నాట్లు ఒక అధ్యయనంలో తెలింది. ఇదివరకు ఉన్న పుస్తక ప్రియులు వారానికి ఐదు నుంచి ఏడు గంటలు పాటు చదివితే, లాక్డౌన్ మొదలయిన అప్పటి నుంచి తొమ్మిది గంటలు చదువుతున్నట్లు రిసెర్చ్ లో తెలిసింది. అప్పటికప్పుడు పుస్తకాలు కొనుక్కోలేని వారు తమ స్మార్ట్ ఫోన్ లోని ఎన్నో ఉచితమయిన, రీడింగ్ అప్ లను ఉపయోగిస్తున్నట్లు చెప్తున్నారు.
-సాయి శరణ్య, విద్యార్థిని.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.