దుబ్బాక : విన్నర్ సరే..! రన్నరప్ ఎవరు?
వర్షా కా లంలో వాతావరణం వేడెక్కుతుంది. ఇదేదో వాతావరణ వార్తలు కాదండోయ్ బాబు..! ఈ హీట్ కి కారణం ఒకటి ఎన్నికల వాతావరణమయితే, మరోకటి ఐపీఎల్ సీజన్.
కొవిడ్-19 సమయంలో ప్రతి ఒక్కరు నాలుగు గోడలకు పరిమితమై ఉన్నటువంటి (అందులో స్పృింగ్ ను ఒత్తిపట్టి వదిలేసినట్లుగా,) సందర్భంలో ఈ రెండు అంశాలు ఊరటనిచ్చాయనే చెప్పవచ్చు. అయితే, తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది. ఒకటి దుబ్బాక ఉప ఎన్నికలు, మరోకటి రాబోయే గ్రేటర్ ఎన్నిక లు.
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి హఠార్మణం తర్వాత ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలలో ఎప్పటిలాగే తమ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుంది అధికార పార్టీ. అయితే టీఆర్ఎస్ కి సానూకూలతతో పాటు, ఈ ఎన్నికలలో సానూభూతి కూడా తోడైందనే చెప్పవచ్చు. రామలింగా రెడ్డి ప్రజ నాయకులుగా, అనునిత్యం ప్రజలకు దగ్గరగా వుండే వ్యక్తిగా వున్నారు. ఎల్లప్పుడు నియోజక వర్గ అభివృద్ధిని కాంక్షించేవారని చెప్పుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. దాంతోపాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత దగ్గరకు చేశాయని అధికార పార్టీ నేతలు విజయం తమదేననే అశాభావం వ్యక్తపరుస్తున్నారు. కాగా, పార్టీ నేతలలోనే అసంతృప్తులున్నయనే అరోపణలు లేకపోలేదు. అయినప్పటికీ, నియోజకవర్గంలోని ప్రజలలో వున్న సానుకూలత గులాభీ జేండాను ఎగరవేస్తుందంటున్నారు.
గతంలో ఇదే నియోజకవర్గం నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డివరుసగా రెండు సార్లు (2014, 2018లలో) గెలిచారు. అంతకుముందు దొమ్మాట నియోజకవర్గం నుంచి 2004లో, ఆ తర్వాత 2008 లో ఉప ఎన్నికలలో విజయం సాధించారు. మొత్తంగా నాలుగు పర్యాయలు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, దుబ్బాక నియోజకవర్గంలో మొదటి స్థానంలో వున్న సోలిపేటకి మొదటి సారి 2014లో 53.3 % తో, ఆ తర్వాత ముందస్తు ఎన్నికలలో కూడా ఒకశాతం పెరిగిందే కానీ, తగ్గలేదు. 54. 36% తో 2018 ఎన్నికలలో తిరిగి గెలిచారు. వరుసగా ఈ రెండుసార్లు కాంగ్రెస్ రెండవ స్థానంలో, బీజేపీ పార్టీలు మూడవ స్థానంలో ఉన్నాయి. కనీసం దారిదాపులో కూడా లేని పరిస్థితి అక్కడ వుంది.
2018లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం టి.ఆర్.ఎస్ ముందు వరసలోనే వుంది. కానీ, రెండవ, మూడవ స్థానాలు మాత్రం తారుమారు అయ్యాయి. రెండవ స్థానంలో బీజేపీ కాగా, మూడవ స్థానంలోకి కాంగ్రెస్ నెట్టివేయబడింది.
అయితే, అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పరిశీలించినట్లయితే, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందనే చెప్పవచ్చు. 2014 ఎన్నికలలో 28.75% కాగా, 2018 లో 16.31% కి పడిపోయింది. బీజేపీ మాత్రం తమ పర్సంటేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది. గెలుపు కోసం కాకుండా ప్రత్యామ్నయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందనే చేప్పవచ్చు.
ఈ ఉపఎన్నికలో తమ ప్రభావాన్ని చూపుకునే ప్రయత్నంలో ఇప్పటికే అధికార పార్టీ తెరాస, బీజేపీ లు తమ అభ్యర్థులను ప్రకటించుకుని ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. అందరికంటే ముందుగానే బీజేపీ రఘునందన్ రావు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రచారం కాదు కదా..! కనీసం పార్టీ అభ్యర్థిని చూపించలేని స్థితిలో వెనక్కి వెళ్ళిపోయింది.
అధికార పార్టీ గెలుపు కోసం చేసే ప్రయత్నం వచ్చే గ్రేటర్ ఎన్నికలకు రెఫరెండంగా తీసుకుంటే, బీజేపీ మాత్రం కాంగ్రెస్ కి ప్రత్యామ్నయంగా రాష్ట్రంలో పాగా వెయ్యాలనే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ ప్రస్తుతం అటు, ఇటు అనే ఊగిసలాటలో కొట్టుమిట్టడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.
దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావితం చూపనున్నాది..? అనేది చూడాలి. అయితే, ఈ త్రిముఖ పోటీ వున్న ఈ ఎన్నికలో గెలుపు మాత్రం అధికార పార్టీదేనని నిర్థారణకు వచ్చారు అశావాహులు. కానీ, ప్రజలు రన్నరఫ్ గా ఎవరిని నిర్ణయిస్తారో..!? అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
–ఎల్. అమర్ నాథ్ , ఎ.పి.కాలేజ్ ఆఫ్ జర్నలిజం