AssemblyFeaturedNewsipsPolitics

UP Elections 2022: ‘హిందూత్వ’ ఇక చెల్లని చెక్కేనా..?

సీజన్  చేంజ్ అవుతుందంటే, వలసలు తప్పవు.  అవి సొంత రెక్కల మీద ఎగిరే పక్షులే కావచ్చు;  జనం వోట్ల తో ఎగిరే నేతలే కావచ్చు.  చోట్లు మారాల్సిందే. ఇది ఎన్నికల సీజన్.   
అలా ఎన్నికలు వచ్చాయో లేదో, నాయకులు ఒక పార్టీలోంచి మరొక పార్టీలోకి మొదలేట్టారు వలసలు.  ఇదంతా ఎప్పుడూ వుండేదే కాదా అని లైట్ తీసుకుంటే పొరపాటే..!
ఈ వలసలు దేశంలో, ఏ రాష్ట్రంలో జరిగినా కొంచెం అటు ఇటుగా షరా మాములే అనుకునే వాళ్లం. కానీ, ప్రస్తుతం దేశమంతటా తమ హవా నడుస్తుందనుకుంటున్న బీజేపీ ఇలాకాలో దేశంలోనే అత్యధిక అసెంబ్లీ(403) స్థానాలున్న (పైపెచ్చు ప్రస్తుత ప్రధాని మోదీ తర్వాత స్థానం తనదేనని భావించే యోగి ఆదిత్య నాథ్  పాలిస్తున్న రాష్ట్రం.)  ఉత్తరప్రదేశ్ లో.       
ముగ్గురు మంత్రుల సహా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుత అధికార పార్టీ నుంచి సమాజ్ వాది పార్టీలో చేరారు.  వరుసగా మూడు  సార్లు (2014, 2019 లోక్ సభ, 2017 లో అసెంభ్లీ ఎన్నికలలో) తమ హవా చూపించిన బీజేపీకి మింగుడు పడని విషయమే.         
ఎన్నికలలో తమ పార్టీ రాణించలంటే, ప్రతిసారి అయోధ్యను ఎన్నికల సమస్యగా చూపించేది. అలా హిందూత్వను ఓటు బ్యాంకుగా మలచుకుని, మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి వరుసగా మూడు సార్లు కలిసోచ్చిందనే చెప్పవచ్చు. గడిచిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో యోగి (సాధారణంగా సన్యసించటమంటే, అన్నింటిపై ఆశల్ని వదులుకోవటం. కానీ, విచిత్రం ఏమిటంటే సీఎంగా ఆదిత్య నాథ్, తమ కులంపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారో ఏమో..!) దేశం మొత్తం తలదించుకునే విధంగా జరిగిన ఘటనలన్నీ(ఉన్నావ్, హత్రస్ లాంటివన్నీ) కూడా యోగి పాలనలో  జరిగినవే. తన సామాజిక వర్గాన్నీ వెనకేసుకు రావడానికి చేయ్యాలేని పనులంటూ లేవు. ‘హిందూ’త్వ ముసుగులో “కులం” రంగును బయటపెట్టారు యోగి. అధికారం కోసం మతాన్ని చూపించే బీజేపీ కుల రాజకీయాల వైపు మళ్ళుతుంది. ఎప్పుడు చూపించే, అయోధ్య ఇక (అయోధ్య నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చుకున్నాక) చెల్లని చెక్కుగా మారింది. ప్రస్తుతానికి బీజేపీ నేతలకు మత అవసరం లేకుండా పోయి, కులంపై పడింది.       
ఇందుకు యూపీ సీఎంగా యోగి ఆదిత్య నాథ్ తన సామాజిక వర్గాన్ని(ఠాకూర్)  బలోపేతం చేయటం ఒక కారణం. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ వలసలు.  దీంతో మిగిలిన ఠాకూరేతర సామాజిక వర్గం దూరం అయిందనే చెప్పవచ్చు.       
అంటే, బీజేపీకి వ్యక్తులు ప్రధానం కాదని, పార్టీగత నిర్మాణం వుంటుందనే ముద్ర వుంది. అందుకు తగ్గట్టుగా  దాని కంటూ ఒక సంప్రదాయక ఓటుబ్యాంకు కూడ వుంటుంది కదా..! అందుకు భిన్నంగా వ్యక్తిని ప్రధానం చేసి చూపారు. కానీ, గతంలో బీజేపీకి తన సంప్రదాయక (బ్రాహ్మణ సామాజిక వర్గ) ఓటు బ్యాంకుతో పాటు, మిగిలిన ఎంబీసీ ఓటు బ్యాంకు కలిస్తే మెజార్టీ వచ్చింది. అది గడిచిన ఎన్నికల ఫలితం.       
కానీ, ఈ వలసలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయనే అనుమానాలు కూడా రావచ్చు. మధ్యలో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలప్పుడు ఎందుకు వీడలేదు అనే సందేహలు తలేత్తే అవకాశం వుంటుంది. అయితే, ఆ సమయానికి సమాజ్ వాది పార్టీకి కేవలం యాదవ పార్టీగా ముద్ర వుండడమే. ఎన్నికలకు ముందు ఒక్కసారిగా ఎంబీసీలు సమాజ్ వాది వైపు ఎందుకు మెగ్గుచూపుతున్నారు?            
ఇక్కడ అఖిలేష్ యాదవ్ కున్న వ్యూహాత్మకత పనిచేసిందని చెప్పవచ్చు. ముందుగా తన పార్టీపై పడిన యాదవ పార్టీ ముద్రను తొలగించుకోవటానికి మిగిలిన ఓబీసీ పార్టీలతో పొత్తు కలిసోచ్చే అంశం. దీంతో మిగిలిన పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి.       
ఇక కాంగ్రెస్ గతంలో కంటే, కొంచెం మెరుగయిందని చెప్పవచ్చు. ఎంతలా..? అంటే, పతనావస్థ నుంచి కొలుకుంటున్న పార్టీగా మాత్రమే ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ, జరుగుతున్న ఎన్నికలలో పాల్గోనడమే కానీ, పోటీనిచ్చే పార్టీగా మాత్రం కష్టమనే అనిపిస్తుంది.  ఎందుకంటే, గత ఎన్నికలలో చవి చూసిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు మూడెంకెల స్థానాల నుంచి రెండెంకలకు పడిపోయింది.       
చివరగా,  యోగి తన స్వయంకృతాపరాధం వల్ల పార్టీ ఠాకూరేతర నాయకత్వాన్ని(బ్రాహ్మణ నాయకులతో పాటు, మిగిలిన ఎంబీసీ నాయకులను) దూరం చేసుకొవడమే ప్రస్తుత ఈ వలసలకు కారణం. దీన్ని ఎస్.పి అఖిలేష్ తన వ్యూహరచనతో అందిపుచ్చుకొవడం కొసమెరుపు. 

– అమర్ నాథ్.ఎల్,
ఏపీ కాలేజీ అప్ జర్నలిజం.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *