AndhraFeatured

విజయవాడలో బెజవాడ లేదు..!?

గాయం మానక పోయినా, నొప్పి తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో అదే జరిగింది. రాఫ్ట్ర విభజన గాయం గాయంలాగే వుండిపోయింది. దశాబ్దం గడచిపోయింది. చంద్రబాబు, జగన్ లు మార్చిమార్చి పాలించారు. రాజధానిని ఒకరు అమరావతి (విజయవాడకు చేరువలో) లో చూస్తే, ఇంకొకకరు విశాఖపట్నంలోచూశారు.  మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడిక రాజధాని రగడ ముగిసినట్టే. అమరావతే కేంద్రమయ్యింది. దాంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వంటి కోరికలనూ, హామీలూ గంగలో కలసిపోయాయి. వాటిని అడిగిన వారూ మరిచారు. ఇచ్చిన వారూ మరిచారు.

కేంద్రాన్ని బాబు అడగటమే పాపం, రాష్ట్రానికి నిధులు ప్రవహిస్తాయి. అందుకు ఈ ఏడాది (2025) కేంద్రబడ్జెట్టే నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ ఆంద్రప్రదేశ్ విషయంలో ఔదార్యాన్ని బాగా చూపారు. అందుకనే రాష్ట్ర బడ్జెట్ (2025) ను కూడా ఇక్కడి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సౌకర్యవంతంగా రూపొందించుకోగలిగారు.

నేడు కేంద్రమూ, రాష్ట్రమూ వేరు వేరు కాదు. అలాగని కేంద్రం చెప్పుచేతల్లో కూడా రాష్ట్రం లేదు. ఎందుకంటే, కేంద్ర సర్కారు మనుగడ రాష్ట్రం మీద ఆధార పడింది. సార్వత్రిక ఎన్నికల (2024)లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ పొందలేక పోవటం వల్ల, జేడీ (యూ), టీడీపీ అనే రెండు ఊత కర్రల మీద నిలబడాల్సి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆమేరకు సౌకర్యవంతమైన స్థానంలో వున్నారు. కేంద్రప్రభుత్వానికి విధేయంగా వున్నట్లు కనిపిస్తూనే శాసించగలరు. అందుకనే, కేంద్రాన్ని బాబు అడగటమే పాపం, రాష్ట్రానికి నిధులు ప్రవహిస్తాయి. అందుకు ఈ ఏడాది (2025) కేంద్రబడ్జెట్టే నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ ఆంద్రప్రదేశ్ విషయంలో ఔదార్యాన్ని బాగా చూపారు. అందుకనే రాష్ట్ర బడ్జెట్ (2025) ను కూడా ఇక్కడి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సౌకర్యవంతంగా రూపొందించుకోగలిగారు. ’సూపర్ సిక్స్’ హామీలకు భారీగానే కేటాయంపులు చేసుకోగలిగారు. మరీ ముఖ్యంగా ’తల్లికి వందనం’ హామీకి రు. 9407 కోట్లు, ‘అన్నదాతా సుఖీభవ’కు రు. 6,300 కోట్లు కేటాయిచారు. ఇవి తెలుగుదేశం వోటు బ్యాంకును ఆరోగ్యం వుంచటానికి బాగానే ఉపయోగపడుతాయి.

నొప్పి తగ్గింది కదా, అని గాయాన్ని నిర్లక్ష్యం చెయ్యటం మంచిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రులే ముఖ్యమంత్రులుగా వున్నా, ఒక్క హైదరాబాద్ మీదనే ఆశలూ, పెట్టుబడులూ పెట్టేసుకున్నారు. తెలంగాణలోని ఇతర నగరాల మీదనే కాదు,  సీమాంధ్రలోని అన్నినగరాల పట్లా అలక్ష్యం చేశారు. కాంగ్రెస్ హయాంలోనూ అదే జరిగింది. తెలుగుదేశం పాలనలోనూ అదే జరిగింది. దాంతో ఒకప్పడు వెలుగు వెలుగు వెలిన ఆంధ్రనగరాలు కూడా నగర లక్షణాలను కోల్పోయాయి. అందులో విజయవాడ నగరం ఒకటి. ఇప్పటికీ ఇక్కడి రైల్వే స్టేషన్ దేశంలోనే రద్దీగావుండే స్టేషన్లలో నాల్గవది అంటే ఎంత జనవ్రవాహం వుంటుందో అర్థమవుతుంది. ఈ నగరం ఒకప్పుడు బెజవాడగా ఒక వెలుగు వెలిగింది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వుండేది. ఆ కారణంగానే మాఫియా కు మార్గం ఏర్పడింది. దేశ ఆర్థిక నగరమయిన ముంబయికే మాఫియా సమస్య తప్పలేదు. ఆర్థిక లావాదేవీలు అధికంగా జరిగే నగరాల్లో మాఫియా సహజంగానే ప్రవేశిస్తుంది. కానీ, ఆ సమస్యను అధిగమించి అతి గొప్ప నగరంగా ముంబయి విలసిల్లుతోంది.  విశాఖపట్నం కూడా అంతే. కాకుంటే అక్కడ ఓడలరేవు వుండటం వల్ల కొంత వికాసం కలిగింది. ఇక ఇతర నగరాలు అంతంతమాత్రంగానే వృధ్ధి చెందాయి.

రాజధాని నగరంలో కళాత్మకత ఉట్టిపడే సుందర భవనాలను నిర్మించటం వల్ల ఒరిగిపోయేదేమీ వుండదు. సాంకేతికత బాగా పెరిగిన ఈ రోజుల్లో పరిపాలనను రాష్ట్రంలోని ఏమూలనుంచి అయినా అందించవచ్చు. అది వేరే విషయం. కానీ, నగరాలను మంచి వాణిజ్య నగరాలుగా, పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దాలి. విదేశీ బహుళ జాతి సంస్థలే కాదు,  స్వదేశీ వాణిజ్య సంస్థలు కూడా ఈ నగరాలకు ఎగబడి రావాలి. 

ఇవాళ పాలన ఎక్కడ నుంచి అందిస్తారనేది పెద్ద సమస్య కాదు. రాజధాని నగరంలో కళాత్మకత ఉట్టిపడే సుందర భవనాలను నిర్మించటం వల్ల ఒరిగిపోయేదేమీ వుండదు. సాంకేతికత బాగా పెరిగిన ఈ రోజుల్లో పరిపాలనను రాష్ట్రంలోని ఏమూలనుంచి అయినా అందించవచ్చు. అది వేరే విషయం. కానీ, నగరాలను మంచి వాణిజ్య నగరాలుగా, పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దాలి. విదేశీ బహుళ జాతి సంస్థలే కాదు,  స్వదేశీ వాణిజ్య సంస్థలు కూడా ఈ నగరాలకు ఎగబడి రావాలి.  ఎంత కాదన్నా, ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పడు హైదరాబాద్ నగర అభివృధ్ధికి ఎన్టీఆర్ శ్రీకారం చుడితే, చంద్రబాబు, పార్టీ వేరయినా వై.యస్. రాజశేఖరరెడ్డీ ఆ వృధ్ధిని విపరీతంగా మెరుగు పరిచారు.

అయితే హైదరాబాద్ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవ చిన్నది కాదు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చేసరికి, హైదరాబాద్ లోని పాత బస్తీ ’కర్ఫ్యూలకూ, కనిపిస్తే కాల్చివేతల’ నిలయం గా వుండేది. మాట్లాడితే మతకల్లోలాలూ, కత్తి పోట్లూ జరిగిపోతుండేవి.  మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సర్కారును నడుపుతున్నప్పుడు 1978లో రమీజబీ అత్యాచారం కేసు జరిగింది. ఇందుకు నిరసనగా మొదలయిన ఆందోళలనుకు మతం రంగు చుట్టుకుంది. అది మొదలు, హిందూ ముస్లింల అల్లర్లకు హైదరాబాద్ లోని పాతబస్తీ శాశ్వత వేదిక అయ్యంది. మరీ ముఖ్యంగా గణేశ్ ఉత్సవాలప్పుడు ఈ అల్లర్ల ఉద్ధృతి పెరిగేది. కానీ 1984 తర్వాత ఈ అల్లర్లకు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చెక్ పెట్టారు. అది మొదలు 1990 వరకూ అలాంటి అల్లర్లు జరిగితే వొట్టు. ఆ తర్వాత కాంగ్రెస్ లో మఖ్యమంత్రి మార్పిడీ అప్పడు మళ్ళీ అల్లర్లు జరిగాయి. ముఖ్యమంత్రి మారగానే సద్దుమణిగిపోయాయి. కారణం రాజకీయ ప్రయోజనమే. అది పక్కనపెడితే, ఎన్టీఆరే హైదరాబాద్ కు ప్రశాంతత తెచ్చినట్టు లెక్క. ఈ పని చెయ్యబట్టే చెన్నై నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చింది. అలా ముందు వచ్చి హైదరాబాద్ లో స్టుడియో పెట్టింది సినిమా రంగంలో ఆయనకు సమ ఉజ్జీగా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావే. అంతే కాదు, తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో ఐటీ పరిశ్రమ పెరిగింది.

ఈ అల్లర్లకు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చెక్ పెట్టారు. అది మొదలు 1990 వరకూ అలాంటి అల్లర్లు జరిగితే వొట్టు. ఆ తర్వాత కాంగ్రెస్ లో మఖ్యమంత్రి మార్పిడీ అప్పడు మళ్ళీ అల్లర్లు జరిగాయి. ముఖ్యమంత్రి మారగానే సద్దుమణిగిపోయాయి. కారణం రాజకీయ ప్రయోజనమే. అది పక్కనపెడితే, ఎన్టీఆరే హైదరాబాద్ కు ప్రశాంతత తెచ్చినట్టు లెక్క. ఈ పని చెయ్యబట్టే చెన్నై నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చింది. అలా ముందు వచ్చి హైదరాబాద్ లో స్టుడియో పెట్టింది సినిమా రంగంలో ఆయనకు సమ ఉజ్జీగా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావే.

నాడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ చేసిన పనే, అమరావతి కి ఆలంబనగా వున్న విజయవాడ- గుంటూరులలో జరగాలి. విజయవాడ అలనాటి నగర లక్షణాలు కోల్పోవటం వల్ల, అక్కడ గ్రామ రాజకీయాలు కనిపస్తున్నాయి. ఛోటా మోటా నాయకులు ఎక్కడికక్కడ తమ అడ్డాలు లా భావించే వాతావరణం ఎదురయ్యింది. అలాగని అలనాటి మాఫియా స్థాయి హింస జరుగుతుందా అంటే లేదు.  విజయవాడ- గుంటూరు లు జంట వాణిజ్యనగరాలుగా అభివృధ్ధి చెందాలంటే, కక్షలకూ, వీధుల్లో వీరంగాలకూ తావులేకుండా చూడాలి. పార్టీలకూ,  కులాలకూ అతీతంగా కట్టడి చెయ్యాలి. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిశగా యోచిస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు, నలుగురి అరెస్టులు ఈ సంకేతాలను ఇస్తున్నాయి. కానీ వారు వైరి పక్షానికి చెందిన వారు కాబట్టి కక్షను పక్కన పెట్టే ప్రయత్నంలా కాకుండా , కక్ష సాధింపు చర్యల్లా కనిపిస్తున్నాయి.  అయితే వీరిలో ఒకరిద్దరు సొంత పార్టీ వారు కూడా వుండటం వల్ల, ఈ ప్రాంతాలను ఆయన తనదయిన పధ్ధతిలో ’శుభ్రపరచు’కుంటున్నేరేమోనన్న భావన కూడా కలుగుతోంది.  విశాఖ, తిరుపతి, అనంతపురం, కర్నూలు వంటి నగరాల మీద కూడా దృష్టి పెట్టి, విద్య, వైద్య, రవాణా సౌకర్యాలను మెరుగు పరిస్తే, అక్కడకు పరిశ్రమలు వస్తాయి. అప్పుడే విభజన గాయం శాశ్వతంగా మానుతుంది.

29-2-2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *