అక్కడ వున్నది ఆచార్యులా? ‘అత్యాచార్యు’లా?
బారులోనో, పబ్బులోనో కాదు, కదిలే కారులోనో, బస్సులోనో కాదు. చదువులు నేర్పే విద్యాలయాల్లో కూడా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు. అది ఏ రాష్ట్రమయినా కావచ్చు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, అక్కడ ఏ పార్టీ అధికారంలో వున్నా, లైంగిక వేధింపులను నిలుపు చెయ్యలేక పోతున్నాయి. అందుకోసం నిండు ప్రాణాలు గాలిలోనో, అగ్నిలోనో కలిసిపోతున్నాయి.ఈ మధ్య చెన్నైలో. తర్వాత బెంగాల్లో, ఆపైన ఒడిశాలో.
ముందు ఒడిశా కథ:
ఇటీవల (14 జులై 2025న) బాలాసోర్ (ఒడిశా)లో ఫకీర్ మోహన్ అటోనమస్ కాలేజి లో 20 యేళ్ళ విద్యార్థిని తనకు తాను నిప్పుపెట్టుకుంది. చుట్టుపక్కల వాళ్ళు కాపాడటానికి ప్రయత్నించారు. అప్పటికే ఆమె 95 శాతం కాలిపోయింది. ఆమెను భువనేశ్వర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కారణం ఎవరో కాదు. పాఠాలు చెప్పే ఆచార్యుడే.ఆమె ఆ కాలేజ్ లో బియిడి రెండో సంవత్సరం చదువుతోంది. ఆ కాలేజ్ లో డిపార్టమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు అధిపతిగా వున్న ఆచార్యుడు సమీర కుమార్ సాహు. ఇతడు తన పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె పలు ఫిర్యాదులు చేసింది. ఆయన ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. దాంతో విసిగి, వేసారి పోయిన విద్యార్థిని నిరసనగా బహిరంగంగా ఆత్మాహుతి చేసుకోవాలనుకుంది. తాను నిప్పుపెట్టుకున్నది కూడా ఎక్కడో కాదు. ప్రిన్సిపాల్ గదికి పక్కనే. తన ఫిర్యాదును పట్టించుకోక పోయినా ఆ విద్యార్థిని అంతగా బాధపడేది కాదు. ఆమె ఫిర్యాదును ’అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ కి పంపిస్తే, ఆ కమిటీ సమీర కుమార్ సాహు అలాంటి వేధింపులేమీ చెయ్యలేదంటూ ’క్లీన్ చిట్’ ఇచ్చింది. వెంటనే ఆ విద్యార్థిని చర్యకు పాల్పడింది.

సహకరించక పోతే, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని కూడా బెదరించాడు. అయినా ఆమె ప్రతిఘటిస్తూనే వుంది. ఆ ఫిర్యాదును ఆమె ప్రిన్సిపాల్ దగ్గరే ఆప లేదు. ముఖ్యమంత్రి మాఝీ దృష్టికి తీసుకు వెళ్ళింది. ఆ పైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఫిర్యాదు చేసింది. ఆఖరికి జాతీయ మహిళా కమిషన్ కు కూడా వివరించింది.
ఆమె ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం, సాహు పలుమార్లు ఆ అమ్మాయి పై లైంగికంగా చొరవ తీసుకున్నాడు. అంతే కాదు. సహకరించక పోతే, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని కూడా బెదరించాడు. అయినా ఆమె ప్రతిఘటిస్తూనే వుంది. ఆ ఫిర్యాదును ఆమె ప్రిన్సిపాల్ దగ్గరే ఆప లేదు. ముఖ్యమంత్రి మాఝీ దృష్టికి తీసుకు వెళ్ళింది. ఆ పైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఫిర్యాదు చేసింది. ఆఖరికి జాతీయ మహిళా కమిషన్ కు కూడా వివరించింది. ఇక జిల్లా పోలీసులకు చెప్పకుండా వుంటుందా? అదీ జరిగింది. అయినా ప్రిన్సిపాలే, కాలేజీలో ’అంతర్గత ఫిర్యాదుల సంఘం’ చేత తూతూ మంత్రపు విచారణ చేయించాడు.
ఆమె అనారోగ్యంతో వుండటం వల్లా, తన కుటుంబంలో వరుస మరణాలు సంభవించటం వల్లా, క్లాసులకు క్రమంగా వెళ్ళలేక పోయేది. హాజరు ఎందుకు తక్కువయిందో వివరించటానికి సాహును కలిసినప్పుడు, అతడు తన లైంగిక వాంఛల్ని బయిటపెట్టటం మొదలు పెట్టాడు.
ఇక కోల్ కతా కథ.
ఆర్. జి. కార్ మెడికల్ కాలేజ్ లో డ్యూటీలో వున్న డాక్టర్ పై హత్య, అత్యాచారం జరిగి పది నెలలు తిరగకుండానే, 25 జూన్ 2025న ప్రభుత్వ లా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో కాలేజిలో పార్ట్ టైమ్ ఉద్యోగి గా చేస్తున్న మూంజిత్ మిశ్రా ప్రధాన ముద్దాయి. విద్యార్థి సంఘంలో ఈ విద్యార్ధినికి కీలకమైన పోస్టు ఇచ్చే వంక మీద ఆమెను క్యాంపస్ లో వుంచేశాడు. తనను పెళ్ళిచేసుకోమని ప్రతిపాదించాడు. ఆమె నిరాకరించిది. అంతే, విద్యార్థి సంఘం గది లోకి తీసుకు వెళ్ళి ఆమెపై లైంగికంగా దాడి చేశాడు. తర్వాత సెక్యురీటీ గార్డు గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ మూంజిత్ తో పాటు, మరో ఇద్దరు విద్యార్థులు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె తన ప్రాణాలకు తెగించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ రెండు ఘటనల్లోనూ సారూప్యం వుంది. బాధితురాళ్ళు విద్యార్థి సంఘాల్లో సభ్యులు. ఒడిశాలో బీజేపీ అధికారంలో వుంది. దానికి అనుబంధంగా వున్నవిద్యార్థి సంఘం ఏబీవీపీలోనే ‘ఆత్మాహుతి’ చేసుకున్న బియ్యీడి విద్యార్థిని వుంది. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో వుంది. దాని విద్యార్థి విభాగం టీఎంసీపీ లో అత్యాచారానికి గురయిన లా విద్యార్థిని వుంది.

కనురెప్పల కాటు
ఈ రెండు ఘటనల్లోనూ సారూప్యం వుంది. బాధితురాళ్ళు విద్యార్థి సంఘాల్లో సభ్యులు. ఒడిశాలో బీజేపీ అధికారంలో వుంది. దానికి అనుబంధంగా వున్నవిద్యార్థి సంఘం ఏబీవీపీలోనే ‘ఆత్మాహుతి’ చేసుకున్న బియ్యీడి విద్యార్థిని వుంది. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో వుంది. దాని విద్యార్థి విభాగం టీఎంసీపీ లో అత్యాచారానికి గురయిన లా విద్యార్థిని వుంది. అంతే కాదు. ఆమెపై అత్యాచారం చేసిన మూంజిత్ మిశ్రా కూడా ఆ విద్యార్థి సంఘ నాయకుడు.
అయినా ఆ ఘటనల విషయంలో ఆయా పార్టీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. ఒడిశాలో తప్పించుకునే బీజేపీ కోల్ కొతా రేప్ పై దుమారం లేపుతుంది. అలాగే కోల్ కొతాలో కూడా తృణమూల్ కాంగ్రెస్ తప్పించుకుంటుంది. ఇదే విషాదం.
ఇవా విద్యార్థి సంఘాలు?
రెండు పార్టీలూ తాము అధికారంలో వున్నరాష్ట్రాల్లో, తమ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాల్లో పనిచేసే ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా నివారించలేక పోయాయి. తర్వాత చేసే అరెస్టుల వల్ల ఒరిగేదేమీ వుండదు. మరీ ముఖ్యంగా విద్యాలయాలు కూడా అత్యాచార వేదిక లు గా మారిపోతుంటే ఈ పార్టీలు చోద్యం చూస్తున్నాయి. కోల్ కొతా ఘటనలో అయితే, ఏకంగా పాలక పక్షానికి (తృణమూల్) కి అనుబంద విద్యార్థి సంఘ నేతే, అదే విద్యార్థి సంఘానికి చెందిన అమ్మాయిపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైపెచ్చు ఆపార్టీకి మహిళే అధినేత. అంతే కాదు ఆ రాష్ట్రానికి మహిళే ముఖ్యమంత్రి. అలాగే ఒడిశాలో కూడా. ముప్ఫయి మూడు శాతం మహిళలకు రిజర్వేషన్లు తేగలిగామని గొప్పలు చెప్పుకునే బీజేపీ తన అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేసే అమ్మాయికి న్యాయాన్ని అందించ లేక పోయింది. ముందు అన్ని రాజకీయ పక్షాలు తమ నేతల్లోనూ, తమ శ్రేణుల్లోనూ వున్న స్త్రీలకు రక్షణ కల్పించుకోగలగాలి. కనీసం ఆపనయినా చెయ్యగలరా? అనుమానమే.
సతీష్ చందర్
18 జులై 2025
Please leave your comment