Bathuku (Life)Featured

ఇంటి కల ‘ఇటుక’ తీర్చింది!

కల. ఇంట్లో పడుకున్నాకే వస్తుంది. ఏ కల? ఇంటి కల. అదేమిటి? పడుకున్నది అద్దె ఇంట్లో కాబట్టి.

అందుకని కల అంటేనే ఇల్లు. పేదలకైనా, మధ్యతరగతి వారికైనా. ఇల్లంటే మాటలా? కోట్లే. ఓ మోస్తరు ఇల్లయితే లక్షలు. అది కూడా యాభయి అరవయి లక్షలు. అలాంటిది నాలుగయిదు లక్షల్లో ఇల్లు కట్టుకోవచ్చా? వచ్చు.

ఎక్కడో అక్కడ, ఊళ్ళోనో, ఊరి చివర్లోనో. తండ్రి ఇచ్చిందో. తాత ఇచ్చిందో. కాస్త స్థలం వుంటుంది కదా! అక్కడ ఇటుక ఇటుక పేర్చుకుంటే ఇల్లవుతుంది. ఇటుకలు ‘మోసేంత’ ధరలో దొరుకుతాయా? మామూలు ఇటుకలయితే దొరకవు

ఎక్కడో అక్కడ, ఊళ్ళోనో, ఊరి చివర్లోనో. తండ్రి ఇచ్చిందో. తాత ఇచ్చిందో. కాస్త స్థలం వుంటుంది కదా! అక్కడ ఇటుక ఇటుక పేర్చుకుంటే ఇల్లవుతుంది. ఇటుకలు ‘మోసేంత’ ధరలో దొరుకుతాయా? మామూలు ఇటుకలయితే దొరకవు. అదే ’ఫ్లయ్ యాష్’ ఇటుకలనుకోండి. తేలిగ్గా కొన వచ్చు.

ఈ ఇటుకే, చవకయిన ఇంటికి కిటుకయిపోయింది. ఈ కిటుకుతో ఎంతో మందికి ఇంటి కల నిజం చేస్తున్నారు రవి కుమార్ దుబాషి. ఎందుకంటే. సొంత ఇల్లు లేక ఆయన తల్లిదండ్రులు పడ్డ బాధ తను కళ్ళారా చూశాడు.

బొగ్గుగని లో 35 యేళ్ళు పనిచేసి పదవీ విరమణ చేశారు. కానీ విరమణ అంటే విశ్రాంతి అనుకోలేదాయన. పేదలకు ‘ఇంటికల నిజం’ చేద్దామనుకున్నాడు. ఘట్ కేసరి వెళ్ళి ‘ఫ్లయ్ యాష్’ ఇటుకల లెక్కలు తీశాడు. మంచిర్యాల లో ఇటుకల తయారీ పెట్టాడు. నలుగురు కి కొలువు, పలువురికి నెలవు. ఇంతకన్నా ఏం కావాలి?

2 thoughts on “ఇంటి కల ‘ఇటుక’ తీర్చింది!

  • హెడ్ లైన్ తో ఆకర్షించడం, వాక్యంతో చదువరుల్లో ఆసక్తిని పెంపొందిస్తూ , కధనంతో ఆలోచింపజేయడం మా గురువుగారైన సతీష్ చందర్ సార్ గారి ప్రత్యేకత.

    Reply
  • S.naveen goud

    Poor people own house dream become true.nice story useful.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *