బాబును తిట్టావా.. ‘మా బాబే’..అంటున్న వైసీపీ!
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ అన్నసామెత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి సరిగ్గా సెట్ అవుతుంది. అధికారపక్షామైన టిడిపిపై రోజు మారుతున్న కొద్ది వ్యతిరేకత పెరుగుతుంది. సాధారణంగా అధికార పక్షంపై, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడం సహజం. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఇదోక రాజకీయ ‘వింత’గా చెప్పవచ్చు.
మొన్నటి వరకు ప్రతిపక్షాలే అనుకుంటే, నిన్న మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనల నుండి వ్యతిరేకత వచ్చింది. టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడుగా గుర్తింపు వున్న మోత్కుపల్లిని ఈ మధ్య కాలంలోనే బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈరోజు విషయానిస్తే టి.డి.పి. బహిషృత నేత మోత్కుపల్లి, టి.డి.పి.కి వ్యతిరేకంగా యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్రకు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మోత్కుపల్లిని కలవడమే కాకుండా పార్టీ మద్దతు కూడ ఇస్తుందని హామీ ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
రాజకీయాల్లో మిత్రశత్రువులు సాధారణం. ఈరోజు మిత్రులుగా ఉన్నవారు రేపు శత్రువులుగా మారటం జరగవచ్చు.లేదా శత్రువులుగా వున్నవారు మిత్రులుగా మారవచ్చు. ఈ రోజు జరిగినదాని బట్టి చూస్తే అలాగే వుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేసే ఎత్తులకు పైఎత్తులు ఒకరికోకరు భాగానే తిప్పికొడుతున్నారు. వైసీపీకున్న ఎస్సీ ఓటు బ్యాంకును చీల్చలనుకున్న టి.డి.పి వ్యూహానికి విజయ సాయిరెడ్డి మోత్కుపల్లిని కలిసి మద్దతు పలకడం ఒక రకంగా చెక్ పెట్టడమే అనుకోవచ్చు. ఇప్పటికే విజయ సాయి రెడ్డి తన స్వలాభం కొరకు బిజెపితో చెలిమి చేస్తుండనేది కొంత మేర విసిపిస్తున్న వాటన్నింటికీ ఒక బేటీతో బ్రేక్ వేశారనే చేప్పవచ్చు.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నాయకులు వచ్చి తెలంగాణ ప్రాంతంలో యాత్రలు చేయడం సాధారణమే. కాని ఒక తెలంగాణ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో గాని యాత్రలు చేసిన ధఖాళాలు లేవు. అందులో ఒక పార్టీకి వ్యతిరేకంగా, అదే పార్టీకి చెందిన నాయకుడు (ఇంతకు ముందు) యాత్ర చేయడమనేది ఇంతవరకు జరగలేదు.
దీంతో అధికార పక్షంపై అన్ని పార్టీలు (మిత్ర పక్షాలు, ప్రతిపక్షాలు) ఏక కాలంలో యాత్రల పేరిట తమ వ్యతిరేకతను చూపించడంలో సఫలం అయినట్లే… ఒక వైపు జగన్ పాదయాత్ర, పవన్ పోరు యాత్ర, బి.జె.పి రాయలసీమ డిక్లరేషన్ పేరిట ఏదో రూపంలో ప్రజల్లోకి టి.డి.పి పై వ్యతిరేకతను ప్రకటిస్తునే ఉన్నాయి. వీటన్నింటికి తోడు తాజాగా మోత్కుపల్లి యాత్ర …
విజయసాయి రెడ్డి కొద్ది రోజుల క్రితం కాపు రిజర్వేషన్ నాయకుడు ముద్రగడను కలవడం, అంతలోనే వెంటనే మోత్కుపల్లిని కలవడం వెనక రాజకీయ కోణం చాలానే ఉందని భావించవచ్చు. ఎస్సీ ఓటు బ్యాంకును వైసీపికి దూరం చేస్తే, కొంత సర్ధుబాటు అవుతుందనుకున్న బాబుకి చుక్కేదురే అని చేప్పవచ్చు. విజయ సాయి రెడ్డి ఒక ఎస్సీ నాయకుడిని కలవడం, బాబుకు వ్యతిరేకంగా చేసే యాత్రకు మద్దతు ప్రకటించడం వచ్చే ఎన్నికలకి ఇదోక వ్యూహాత్మక నిర్ణయమనే చెప్పవచ్చు.
విజయ సాయి రెడ్డి వరుసగా అధికార పక్షానికి వ్యతిరేకత ఉన్న నాయకులను కలిసి చేసే రాజకీయాలను ఎలా బ్యాలేన్స్ చేస్తారో చూడాలి… మరీ..! వచ్చే ఎన్నికలలో వైసీపి అమరావతిని కైవసం చేసుకునే దిశగా విజయ సాయి రెడ్డి చేసే వ్యూహాలు ఫలిస్తాయా…
-తెలుగూస్ పొలిటికల్ డెస్క్