‘పవన్’కు ‘పవర్’ కోసం ‘మేగా’ ప్రయత్నం.!?
‘పవర్’ స్టార్‌ను ‘పవర్’లోకి తీసుకొచ్చేందుకు మేగా ఫ్యామిలీ ముందుకొస్తుంది. ఇప్పటి వరకు అన్నయ్య నాగబాబు మాత్రమే ముందుకొచ్చి మాట్లాడటం చూశాం.ఈ మధ్య కాలంలో పవన్ పార్టీకి వాళ్ళ అమ్మ ఫండ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా బాబాయ్‌కి సపోర్ట్‌గా అబ్బాయిలు వస్తుంటారు. ఇప్పటి వరకు ఎవరేమి మాట్లాడినా, ఏం చేసినా తన సపోర్టు ఉంటుందనే చేప్పారు. కానీ పవన్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి వాఖ్యలు చేయలేదు మేగాస్టార్ చిరంజీవి.
ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో మెల్లమెల్లగా రాజకీయ పావులు కదుపుతున్నారు ఈ మేగా బ్రదర్స్. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోని చిరంజీవి, హఠత్తుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2014లో జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ ఎన్నికలలో ఇద్దరు రెండు వేర్వేరు పార్టీలకు మద్దతునిచ్చారు. (ఇది అందరికీ తెలిసిన విషయమే.) ఈ మధ్యకాలం వరకు రాజ్యసభ పదవి గడువు ముగియకముందే సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి కాంగ్రెస్ సభ్యత్వ కాలపరిమితి ముగిసిన కూడా పునరుద్ధించుకోలేదు.
ఈ నిర్ణయాలను గమనించినట్లయితే ఇవి పవన్‌ను ఎలాగైనా పవర్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలేనని తెలిసిపోతున్నాయి. ఇప్పుడే కాంగ్రెస్‌ను వదిలి జనసేనలోకి వేళితే, మరో ప్రజారాజ్యం అంటూ ప్రతిపక్షాలు తమపై మాటల యుద్ధం ప్రకటిస్తాయనే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదేమోనని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా తమ్ముడు పవన్‌ను ‘పవర్’లోకి తీసుకురావడానికి ‘మేగా’ స్కేచ్‌లు వేస్తున్నారనడంలో ఎలాంటి సందేహంలేదు.
