జనసేన పోత్తు వైసీపీతోనేనా..?
సినీ నటులకు, రాజకీయ నాయకులకు పెద్ద తేడా లేదు. సినీ నటులైతే ఒక సినిమా ముగియగానే వారి పాత్రలు ఎలాగైతే మారుతాయో, అలాగే నాయకులు కూడా మారుతుంటారు. అదే ఈ రెండు ఒకరే అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నాయకులు తమ పాత్రలు మార్చుతున్నారు.
తెలంగాణ విభజనానంతరం ఏర్పడిన నవ్యాంధ్రలో ముఖ్యమైన పార్టీలుగా టీడీపీ, వైసీపీలు తరువాత జనసేన పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మూడు పార్టీల తర్వాత స్థానంలో బీజేపీతో పాటుగా కాంగ్రెస్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఒకప్పటి శత్రువు ఇప్పుడు మిత్రుడవుతారంటే కేవలం ఒక నాయకుడు పార్టీ మారితేనో అలా జరిగుండేది. కానీ ఇప్పుడు నాయకుడు కాదు… ఏకంగా పార్టీ మొత్తంగా కూటమిగా ఏర్పడి శతృత్వాన్ని మితృత్వంగా ఏర్పరచుకుంటున్నారు. బండ్లు ఓడలు… ఓడలు బండ్లు అవుతాయనేది సరిగ్గా సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం.
నిన్నటి వరకు టీడీపీ ప్రభుత్వానికి మద్ధతు పలికిన జనసేనాని, కేంద్రంలో వున్న బీజేపీతో సత్సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటుంది వైసీపీ. ఈ (వైసీపీ, జనసేన) రెండు పార్టీలకు వారధిగా వుంటూ రాష్ట్రంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు ఇదోక అవకాశంగా భావిస్తున్నారేమో…