AssemblyNewsips

టీజేఎస్ ఐదు సీట్ల‌కే ప‌రిమిత‌మ‌య్యేనా.!?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల దృష్ట్యా రోజురోజుకు రాజ‌కీయ ప‌రిణామాలు వేడిక్కుతున్నాయి. ఒక‌వైపు అప‌ద్ధ‌ర్మ అధికార పార్టీ ముందుకు దూసుకుపోతుంటే, మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలన్ని క‌ల‌సి కూట‌మిగా బ‌రిలోకి దిగుతున్నా విష‌యం అంద‌రికి తేలిసిందే.
ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ప్ప‌టికీ, ఇంకా కూట‌మి అభ్య‌ర్థుల సీట్ల పొత్తు ఇంకా ఖ‌రారు కాలేదు. ఇప్ప‌టికే అధికార పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల్లోకి వెళుతుంటే, కూట‌మి మాత్రం అభ్య‌ర్థుల సీట్లను ఖ‌రారు చేసే ద‌గ్గ‌ర వున్నారు. సీట్ల విష‌యంలో కొత్త పార్టీ అయిన తెలంగాణ జ‌న స‌మితి (టీజేఎస్) 12 సీట్లను ప్ర‌తిపాదించ‌గా, కాంగ్రెసు మాత్రం ఎనిమిది సీట్ల వ‌ర‌కే ప‌రిమితం చేసిన‌ట్లు వినిపిస్తున్నాయి.
అనూహ్యంగా ఈ సీట్ల వ్య‌వ‌హారంలో కాంగ్రెస్‌, టీజేఎస్‌కు కేవ‌లం ఐదు సీట్ల‌నే ఖ‌రారు చేసిన‌ట్లు విశ్వ‌సనీయవ‌ర్గాల స‌మాచారం. ఈ ఐదుగురు అభ్య‌ర్థుల‌లో ఒక‌రు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం క‌ల్పిస్తామ‌నే టీజేఎస్ త‌ర‌ఫున మ‌హిళా అభ్య‌ర్థులకు స్థానం కేటాయిస్తున్నారా ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *