Literature

తెలుగు లో బోధనా? తెలుగు బోధనా?

 ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌ను ఆంగ‌రంగ వైభంగా ప్రారంభించిన వేడుక‌ల‌కు ఉపరాష్ట్ర‌ప‌తిని, ముగింపు వేడుక‌ల‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆహ్వానించారు. కాగా ఈ ముగింపు స‌భ‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ‘తెలుగు భాషను బ‌తికించుకుంటా’మ‌ని అన్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే పాఠ‌శాల విద్య‌లో మార్పు తెచ్చేందుకు ప్ర‌భుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయ‌ని  తెలిపారు. అలాగే ‘ఒక‌టో త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్ మీడియ‌ట్ వ‌ర‌కు ఏ మీడియ‌మైనా స‌రే తెలుగు ఒక స‌బ్జేక్టుగా ఉండాల‌’ని అన్నారు. అయితే ఈ సంధ‌ర్భంలో సిఎం కేసిఆర్‌కి గ‌త ఎన్నిక‌ల ముందు ఇచ్చిన వాగ్దానం గుర్తులేదేమో..!  అంద‌రికీ ఉచితంగా కేజీ టూ పీజీ  విద్య‌ను ప్ర‌వేశ‌పెట్టి, అందులో ప్రాథ‌మిక విద్య  మినహా మొత్తం కూడా ఇంగ్లీషు భాష‌లోనే బోధ‌న ఉంటుంద‌ని చెప్పారు. ఇప్పుడు ఏ మాద్య‌మంలో  చ‌దివిన ఒక స‌బ్జేక్టుగా తెలుగు ఉండాల‌ని ఉత్తర్వులు జారీ అవుతున్నట్లు ప్రపంచ తెలుగు మహాసభల్లో వెల్లడించారు. ఇంతకీ తెలుగు ను బోధనా మాధ్యమంగా చెయ్యటం వల్ల బతుకుతుందా? లేక  ఒక భాషగా చేర్చటం వల్ల జీవిస్తుందా?  బహుశా సభల్లో పాల్గొన్న విద్యావేత్తలకే ఈ విషయంలో స్పష్టత వున్నట్లు లేదు. సీఎం మాత్రం  ఏం చేస్తారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *