సీట్లు పెరగకుంటే, ‘జంప్ జిలానీ’ల పని గోవిందా…!?
రాజకీయాల్లో గెలిచినా, ఓడినా ఒక్కటే అయిపోతారు. గెలుపులోని ఆనందమూ; ఓటమిలోని భంగపాటు, కుంగుపాటూ కొన్నాళ్ల వరకే. తర్వాత అంతా మామూలే. ఓడినవాడు గెలిచిన పార్టీతో జత కట్టడం కామన్ అయిపోయింది. ఇది రాజకీయ లబ్ధి అనుకోండి, మరెేదైన అనుకోండి. మొత్తానికి వీళ్ళని మాత్రం ‘జంప్ జిలానీ’లు అనే అంటారు. ప్రస్తుత ట్రెండ్ లో ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఎక్కువ నడుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నుంచి టీడీపీకి, తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌కు వలసలు సాగుతున్నాయి. ప్రతి పక్ష ఎమ్మెల్యేలు మాత్రం అధికార పక్షానికే మొగ్గు చూపుతున్నారు. దీనిని బట్టి నాయకులు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కన్నా, తమతమ లబ్ధి కోసం పార్టీలు నుంచి ”ఉసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా” పార్టీ కండువాలు మారుస్తున్నారు. ఓటు వేసి గెలిపించిన సగటు ఓటరు నమ్మకాన్ని ఒమ్ముచేస్తున్నారు. దీని వల్ల ఓటర్లుకూ, కార్యకర్తలకూ లబ్ధి ఏమోకానీ, వీరికి మాత్రం భారీ ముడుపులు మూట కట్టుకుంటున్నారు. వీళ్లతో పాటు తర్వాత తరానికి కూడా ఈ ‘ఆపరేషన్ ఆకర్ష్’ ద్వారా తమ వారసులకు కూడా భవిష్యత్తు బాటలు వేస్తున్నారు. తమ పిల్లలకు కూడా రాజకీయంగా ఎదుగుతారని ముందుగానే ఊహించి పక్కా వ్యూహంతో పయనం మవుతున్నారు.
ఇది ఇలా ఉండగా తెలంగాణాలో మాత్రం టీడీపీ, కాంగ్రెస్ నుంచి భారీ వలసలే జరుగుతున్నాయి. ఆంధ్రాలోనూ అంతే సంగతి! ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి అంటే వైసీపీ నుంచి టీడీపీ అన్నమాట! అన్న ఏమిటీ.. ఉన్న మాటే! ఇదే ఇలా జరిగితే భవిష్యత్తుల్లో ‘జంప్ జిలానీలకి’ కొదవెంవుండదు.ఇదే టీడీపీకి పక్కరాష్ట్రంలో చూస్తే వేరేలా ఉంది. అదేలేండి. తమ పార్టీ దశాబ్దాల పార్టీ అని చెప్పకునే అధినాయకుడు తీసుకున్న ఒక్క ‘ఐడియా’ తమ పార్టీ స్థితిగతులను మార్చేసింది. దీనిని బట్టి తెలంగాణలో ఈ పార్టీకి ఇప్పడు జెండా పట్టుకునే నాయకులే కరవు అవుతారేమో, వేచి చూడాలి!
తెలంగాణాలో తెలుగు తమ్ముళ్ళు మాత్రం పదమూడేళ్ళగా ప్రతిపక్షానికి పరిమితమయ్యామంటున్నారు. కానీ ఇక మీదట అధికారం చూడటం ‘అందని ద్రాక్షే ‘ అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రాలో అయితే పదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు తమ్ముళ్లుల్లో జోష్ ఏమాత్రం తగ్గలేదు! ఎందుకంటే ఇప్పడు అధికారాన్ని అనుభవిస్తున్నారు, కనుక అని పార్టీలో ఉన్న సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఆంధ్రాలో అయితే తెలంగాణాకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా. వాళ్ల చేసే తప్పే మేము చేస్తాం అంటున్నారు పార్టీ పెద్దలు దీనిని బట్టి ‘ఆపరేషన్ ఆకర్ష్’ అనే క్యాఫన్స్ పెట్టి వలసల సినిమాలు తీస్తున్నారు. అదేలెండి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికారాన్ని తాయిలంగా అందించి ఆనందింపజేస్తున్నారు. ఇవ్వన్నీ ఏమో కానీ! కేంద్ర ప్రభుత్వం కనుక వీళ్ల ఫ్లాన్‌కు విరుద్ధంగా వెళ్ళి, అసెంబ్లీ సీట్లు పెంచకుండా వుంటే,అంతే సంగతి! అప్పుడుంటుంది అసలు మజా!. ఈ అధినాయకులు వేసిన పాచికలు ఏ మేరకు ఫలిస్తాయో అప్పడు అర్థమవుతోంది. అందరికీ అందలం ఆశ పెట్టి అడియాశ మిగిల్చినట్టు ఉంటుంది. అంతర్మథనం అంటే ఏమిటో అధినాయకుడికి అప్పుడు అర్థమవుతుంది. దీనిని బట్టి పార్టీ ఎమ్మెల్యేలకు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. అన్నీ ఉన్నా అధికారం అందకపోవడమంటే ఇదే మరీ!. అందుకే పెద్దలూ ఊరకేనే అనలేదు, పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలుచుని నీళ్ళు తాగడం మిన్న అని. దీని బట్టి ‘జంప్ జిలానీ’లకు అర్థమెప్పుడవుతుందో! మరీ వేచి చూడాలి.