AssemblyNewsips

‘రాజీ’నామాలు: నాడు రాష్ట్రం, నేడు అందలం!

ఉద్య‌మ రూపాలు వేరు అయిన‌ప్ప‌టికీ, రాజ‌కీయ రూపం ఒక్క‌టే. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా ఉద్య‌మాలు జ‌రిగాయి. ఉద్య‌మ ఫ‌లితం వ‌చ్చాక కొన్ని సంస్థ‌లు అంత‌టితో ఆగిపోయాయి. కొన్ని సంస్థ‌లు వాటి రూపం మార్చుకుని  రాజ‌కీయం పులుముకున్నాయి. అందులో భాగ‌మే తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్ప‌డిన సంస్థ టి.ఆర్‌.ఎస్‌. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోస‌మే ఏర్ప‌డి, స్వ‌రాష్ట్రం  సాధించుకున్నాక ఉద్య‌మ సంస్థ‌ నుండి తనను తాను రాజ‌కీయ సంస్థ‌గా మార్చుకుంది.
కేసీఆర్ నాడు ఉద్యమ సమయంలో రాజీనామాలను అస్త్రంగా,నేడు అవే రాజీనామాలను రాజకీయ బ్రహ్మస్త్రంగా వాడుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల మద్దతు చూరగొనడానికి అవకాశం దొరికిన ప్రతిసారీ  రాజీనామానే అస్త్రంగా ప్రయోగించారు. తెలంగాణా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ తెలంగాణ సాధన కోసం పదవులను కూడా లెక్కచేయని నాయకుడిగా ప్రజలలో నిలవాలని అవకాశం దొరికిన ప్రతిసారీ రాజీనామాలు చేసి, ఉపఎన్నికల్లో మెజారిటీ ఓట్లతో విజయాన్ని సాధిస్తూ వచ్చారు. తెలంగాణ పట్ల నాటి ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ, ఆంధ్ర నాయకులు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి చర్యలకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసి భారీ ఎత్తున సభలు, జనాకర్షణతో తిరిగి ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించగలిగాడు.
ప్రస్తుత పరిస్థితులు వేరైనా పంథా మాత్రం ఒక‌టే. నాటి రాజీనామా వ్యూహలనే నాడు ఉద్యమ నేతగా, నేడు రాజకీయ నేతగా అనుసరిస్తున్నారు. నాడు గత ప్రభుత్వాల వైఫల్యాలను,అన్యాయాన్ని ఎండగటారు. నేడు టి.ఆర్.ఎస్ ప్రభుత్వoపై రోజురోజుకి పెరుగుతున్న అసంతృప్తి,వ్య‌తిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి, ప్రతిపక్షాల ఆరోపణలనూ తిిప్పికొట్టడానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజీనామాలు చేసి శాసన సభను రద్దు చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు.
ప్రతిపక్ష పార్టీల స్థైర్యాని దెబ్బతిస్తూ, టి.ఆర్.ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపెట్టి ఇంకా గత ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతూ వున్నారు. ప్రజల నాటి సెంటిమెంట్‌ని లెవనెత్తుతూ, ప్రజాక్షేత్రంలొనే టి.ఆర్.ఎస్ పార్టీ ప్రజల మద్దతుతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గత రాజీనామాల వ్యూహలను ప్రయోగించడం జ‌రుగుతుంది. నాటి ఉద్యమ ఉద్వేగ పరిస్థితులను తీసుకువ‌చ్చి ఇప్పుడు రాజకీయంగా విజయం సాదించాలని రాజీనామాలను చేశారు.
కానీ నాటికి-నేటికి పరిస్థితులలో, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. మ‌రీ అప్ప‌టి ప‌రిస్థితుల‌ను ఇప్పుడు అనుస‌రిస్తారా..? లేదా ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకుంటారా..? ఫ‌లితం ఎవ‌రికీః ఉధ్య‌మ నాయ‌కునిగా చెప్పుకునే కేసీఆర్‌కా..? లేక తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకా..? లేక మ‌ద్ద‌తు ఇచ్చిన బీజేపీకా? అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యించాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *