వేషాలకు వెయ్యి…మిత్రులకు ‘చెయ్యి’.!?
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కూటమి సీట్ల ఖరారు ఇంకా కానేలేదు. రోజురోజుకి వాయిదాల పర్వమే నడుస్తుంది. ఒకరికి సీటు వస్తే, మరొకరికి రాలేదంటూ ఎవరికి వారే వ్యవహారిస్తున్నారు. ఈ కూటమి వలన కాంగ్రెస్ నాయకులకు సీట్ల సర్దుబాటు చేయడం కత్తి మీద సాములాంటిదే అయ్యింది.
ఈ మధ్య కాలంలో కొద్ది గంటల వ్యవధిలోనే బీజేపీలోకి వెళ్ళి, తిరిగి కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు. ఇదంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన నాయకులకు ఒకటే సీటు అనే సర్ధుబాటు వచ్చాకా జరిగిపోయింది.ఇదిలా ఉంటే, నిన్న సీట్ల విషయంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అభ్యర్థి రమేష్ రాథోడ్ విషయంలో మొదటి నుండి కాంగ్రెస్‌లో ఉన్న నాయకులకు సీట్లు కేటాయించడం లేదంటూ, అయా నాయకుల అనుచరులు, కార్యకర్తలు గాంధీ భవన్ ముందు నిరసన ధీక్షలకు దిగుతున్నారు. ఈ రాజకీయ డ్రామాలకు తెరదించుతారా? లేదా..? అనేది చూడాల్సివుంది.
మిత్ర పక్షాలకు ఇచ్చేవే కొన్ని సీట్ల అయితే, అందులో నుంచి ప్రస్తుత కాంగ్రెస్ నాయకులకు కట్టబెట్టలనే ఆలోచనలు చేయకపోలేదు. ఇప్పటికే ఉమ్మడి నల్గోండ జిల్లాలో ప్రసన్న కుమార్‌కు గానీ, లేదా తెలంగాణ ఇంటి పార్టీకి సీట్లు ఇవ్వద్దంటూ ఒక సీనియర్ నాయకుడు హెచ్చరించారని సమాచారం. ఇదంతా వ్యక్తులు చేస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు లాభం చేకూరేలా ఉంది. ఎందుకంటే మిత్రపక్షాలకు ఈ పేరు మీద కొన్ని సీట్లు తగ్గించి, కాంగ్రెస్ పార్టీలోని నేతలకు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.