FeaturedFilmsReviews

అదే కథ, అదే హీరో, అదే ముగింపు.. సినిమాలే వేరు!

తీసిన కథనే తీశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అదే హీరోతో తియ్యటం. అదే ఏడాది అదే నెలలో విడుదల చెయ్యటం- చిత్రంగా లేదూ?

అలా వరసగా వచ్చిన సినిమాలు, ఒకటి: లెవెన్, రెండు: బ్లైండ్ స్పాట్. రెంటికీ హీరో నవీన్ చంద్ర.  రెంటిలోనే పోలీసు అధికారి వేషమే. చిన్నతేడా. ‘లెవెన్’ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ( ఐపీఎస్ అధికారి), ’బ్లైండ్ స్పాట్’లో సర్కిల్ ఇన్స్పెక్టర్.

కొద్ది సేపు చూసిన సినిమానే చూస్తున్నామేమో అన్న అనుభూతి వస్తుంది.  ఓటీటీలో అయితే ఫర్వాలేదు. కానీ రెండో సినిమాకు థియేటర్ కు వెళ్ళిన వాళ్ళు బిక్కముఖం వెయ్యాల్సిందే. చూసిన సినిమాయే చూస్తున్నామా- అన్న దిగులు ఇంటర్వల్ (ఇంటర్వల్ ఇస్తే) వరకూ  వెంటాడుతుంది. ఎందుకిలా? ఒక్కటే సమాధానం. దారిద్ర్యం! ‘కథా దారిద్ర్యం’! తెలుగు సినిమానే కాదు, పాన్ ఇండియా సినిమాను కూడా ఈ దారిద్ర్యం పట్టిపీడిస్తోంది.

’బ్లైండ్ స్పాట్’ 9వ తేదీన విడుదలయితే, ’లెవెన్’ 16 తేదీన రిలీజ్ అయ్యింది. రెంటికీ మధ్య వారమే తేడా. ఏది ముందు తీసి వుంటారన్నది పెద్ద ప్రశ్న కాకపోవచ్చు. కానీ రెంటిలోనూ ఏది ‘ఒరిజనల్లో’, ఏది ’జిరాక్స్’ కాపీయో తెలియటానికి అవసరం అవుతుంది. తెలుగు-తమిళంలో ’లెవెన్’ తీస్తున్నట్లు ఆగస్టు 2023లోనే ప్రకటించారు.

కాపీలు కొట్టి కొట్టి, చిత్ర కథకులు,దర్శకులు అలసి పోయారు. పరీక్ష రాసే విద్యార్థి కొచ్చిన కష్టమే వీళ్ళకు వచ్చిపడింది. పక్క విద్యార్థి తన ’ఆన్సర్ షీట్’ ని చూపించక పోతే ఏంచేస్తాడు. తనను తానే కాపీ కొట్టుకుంటాడు. ఒక ప్రశ్నకు తనకు తోచిన జవాబు రాసి, అన్నిప్రశ్నలకు అదే జవాబు రిపీట్ చేస్తాడు. అదే జరిగింది ఈ రెండు సినిమాల విషయంలో. రెండూ మే, 2025 లోనే విడుదలయ్యాయి.  , ’బ్లైండ్ స్పాట్’ 9వ తేదీన విడుదలయితే, ’లెవెన్’ 16 తేదీన రిలీజ్ అయ్యింది. రెంటికీ మధ్య వారమే తేడా. ఏది ముందు తీసి వుంటారన్నది పెద్ద ప్రశ్న కాకపోవచ్చు. కానీ రెంటిలోనూ ఏది ‘ఒరిజనల్లో’, ఏది ’జిరాక్స్’ కాపీయో తెలియటానికి అవసరం అవుతుంది. తెలుగు-తమిళంలో ’లెవెన్’ తీస్తున్నట్లు ఆగస్టు 2023లోనే ప్రకటించారు. నిజానికి ఈ సినిమాను 2024 (నవంబరు 15) న విడుదల చేద్దామనుకున్నారు కానీ, అంతిమంగా 2025 (మే 16న) విడుదల చేశారు. కానీ తెలుగులో తీసిన   ’బ్లైండ్ స్పాట్’ సంగతి వేరు: 2025 లోనే మొదలు పెట్టే 2025లోనే చుట్టేసి, 2025లోనే (మే9) న విడుదల చేశారు. ముందు తీసిన ‘లెవెన్’ వెనకా, వెనక తీసిన ‘బ్లైండ్ స్పాట్’ ముందూ అయ్యాయి. అంటే ‘జిరాక్స్’ ముందు వచ్చి, ’ఒరిజినల్’ తర్వాత వచ్చిందన్నమాట. రెండూ క్రైమ్ థ్రిల్లర్సే.

కథాంశం ఒక్కటే: తాను చేసిన హత్య కేసును హంతకుడే దర్యాప్తు చెయ్యటం. (ఇలా అంటే ముగింపు తెలిసిపోయినట్లు అనిపిస్తుంది కానీ, రెండు ఒక్కటే అని తెలియాలంటే ఈ లీక్ తప్పదు.) సాదా సీదా సామెతతో చెప్పాలంటే, ‘దొంగే -దొంగ, దొంగ- అని అరవటం’.

‘లెవెన్’ అన్నది దర్శకుడిగా లోకేష్ ఎజ్లిస్ మొదటి చిత్రం. కథ కూడా ఆయనదే. తీయటం తీయటమే ‘ద్విభాషా చిత్రం తీశాడు. ఒక స్కూల్లోని ఒక క్లాసులో పదకొండు కవలలు వుంటారు. వీరిలో ఒక కవలసోదరులు మాత్రం అనాథలు. పేదలు. పేర్లను ( బెంజమిన్, ఫ్రాన్సిస్ లు) బట్టి క్రైస్తవ మైనారిటీలు. తెలుగు వాతావరణంలో అయితే పేదలయి, ఈ పేర్లున్నాయంటే వారు ‘ఊరు వెలుపలి వారు’ అనుకోవటానికి వీలుంది. అన్నట్టుగానే వారి ’నివాసాన్ని‘ ఒక పేవ్ మెంట్ మీద చూపిస్తాడు దర్శకుడు. బెంజమిన్ ’చెస్ చాంపియన్’ కావటం వల్ల, ఇద్దరికీ ఉచిత భోజన వసతిని స్కూల్లోనే కలిగిస్తుంది యాజమాన్యం. కానీ ఈ కవల సోదరుల్ని, ఇతర కవలలు ప్రతి రోజూ ర్యాగింగ్ చేస్తుంటారు. ఫ్రాన్సిస్ కు ‘నోక్టీఫోబియా’ (చీకటంటే భయం) వుంటుంది. ఒక రోజు బెంజమిన్ వేరే చోట వుంటే, ల్యాబ్ లో లైట్లన్నీ ఆర్పేస్తే ఫ్రాన్సిస్ గిలా గిలా కొట్టుకుని చనిపోతాడు. తర్వాత బెంజమిన్ స్కూలు వదలి వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళ తర్వాత విశాఖ నగరంలో వరస హత్యలు జరుగుతుంటాయి. దర్యాప్తులో తెలుస్తుంది. మృతి చెందిన వారు ఒకే వయసు వారని.  ఇంకా లోతుకు వెళ్ళితే పోయిన వ్యక్తి కి కవల సోదరుడు కానీ, సోదరి కానీ వుందని. ఈ దర్యాప్తు ను ఏసీపి అరవింద్ చేస్తుంటాడు. సినిమా ముగిసే సరికి అరవిందే బెంజమిన్ అర్థమవుతుంది. ఇందులో అయితే ఒక సాంఘిక కోణమూ, మనోవిశ్లేషక కోణమూ కనిపిస్తాయి. ఉత్త థ్రిల్లర్ గా కొట్టి పారెయ్యాల్సిన అవసరంలేదు.

చనిపోయిన చంటిబిడ్డ తల్లి తన ప్రేయసి కాబట్టి. ఆమె తో (సహజీవనం సగా) అన్నీ సాగించేసి, ఇంకో గొప్పింటి పిల్లను కట్టేసుకుంటాడు విక్రమ్. పారిశ్రామిక వేత్తకూడా తక్కువ తింటాడా? పనమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. అతనికి పుట్టిందే ఆమె కూతురు.  ఈ క్రైమ్ థ్రిల్లర్ ను తయారు చెయ్యటానికి, విహాహ పూర్వ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, వివాహానంతర సంబంధాలు విచ్చలవిడిగా ఉపయోగించుకున్నాడు రచయిత. దేనికీ? ’ఒరిజినల్’ రాయటానికి కాదు, జస్ట్ ‘జిరాక్స్’ తియ్యటానికి.

కానీ ’బ్లైండ్ స్పాట్’ వేరు. ఇది ‘లెవెన్’కు ’బ్లైండ్ కాపీ’లాగా వుంటుంది. కాకుంటే, ఇందులో సామాజిక కోణం లాంటిది వుండదు. ఆర్థిక కోణం వుంటుంది కానీ, ’పేదవాడు పెద్దవాడయితే అత్యాశపరుడయిపోతాడు’ అన్న దారుణమైన సూత్రీకరణ వుంటుంది. ఈ సినిమాకు కథ రాసింది, దర్శకత్వం వహించింది రాకేష్ వర్మ. ఇందులోనూ అంతే. హంతకుడే పరిశోధకుడు. కాకుంటే ’లెవెన్’ లోని బెంజమిన్, ఇందులో విక్రమ్ అవుతాడు ( ఈ పాత్ర పోషించిన నవీన్ చంద్ర మాత్రం బెంజమిన్ గెటప్ లో నే వుంటాడు. ఇక్కడే ఇద్దరేసి వుంటారు. కాకుంటే కవలలు కారు, భార్యలు. చంటిబిడ్డ తల్లిగా వున్న పారిశ్రామిక వేత్త భార్య ఉరేసుకుంటుంది. సీఐ విక్రమ్ రంగంలోకి దిగి, ఇది ఆత్మహత్య కాదూ, హత్య అని నిరూపించే ప్రయత్నం చేస్తుంటాడు. పారిశ్రామిక వేత్త అంతకు ముందు ఒక భార్య వుంటుంది. క్యాన్సర్ తో చనిపోతుంది. కానీ ఆమెకు పదేళ్ళ కొడుకు వుంటాడు. వీళ్ళుకాక ఆ ఇంట్లో పనమ్మాయి వుంటుంది. పనమ్మాయికి కూడా ఎదిగిన కూతురు వుంటుంది. హత్యచేసింది ఎవరు? పారిశ్రామిక వేత్తమీదా, పనమ్మాయి మీదా, పనమ్మాయి కూతురు మీదా, పారిశ్రామిక వేత్త కొడుకు మీదా మార్చి మార్చి అనుమానాల్ని రేకెత్తిస్తూ విక్రమ్ దర్యాప్తు సాగుతుంది. అంతిమంగా తనతో వుండే సహ పోలీసు అధికారి మీద కూడా ఈ అనుమానం కలిగిస్తాడు విక్రమ్. ‘లెవెన్’ లోనూ అంతే. అక్కడా సైడ్ హీరో లాంటి పోలీసు ఆఫీసరు వుంటాడు. అతడి మీదా అనుమానం కలుగుతుంది. అంతిమంగా తానే హంతకుడని తేలుతుంది. ఇలా ఎందుకు చేశాడంటే, చనిపోయిన చంటిబిడ్డ తల్లి తన ప్రేయసి కాబట్టి. ఆమె తో (సహజీవనం సగా) అన్నీ సాగించేసి, ఇంకో గొప్పింటి పిల్లను కట్టేసుకుంటాడు విక్రమ్. పారిశ్రామిక వేత్తకూడా తక్కువ తింటాడా? పనమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. అతనికి పుట్టిందే ఆమె కూతురు.  ఈ క్రైమ్ థ్రిల్లర్ ను తయారు చెయ్యటానికి, విహాహ పూర్వ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, వివాహానంతర సంబంధాలు విచ్చలవిడిగా ఉపయోగించుకున్నాడు రచయిత. దేనికీ? ’ఒరిజినల్’ రాయటానికి కాదు, జస్ట్ ‘జిరాక్స్’ తియ్యటానికి.

ఇలా మార్చి మార్చి అనుమానాలు కలిగించటాన్నే ఎప్పుడో 19వ శతాబ్దాంలోనే (140 యేళ్ళక్రితమే)  ఆర్థర్ కొనాన్ డోయల్ తన ’షెర్లాక్ హోమ్స్’ డిటెక్టివ్ చేత మొదు పెట్టించాడు. ఒక్కొక్క వ్యక్తి మీద అనుమానం కలిగించి, తొలగించే ’డిడక్టివ్’ పరిశోధన ఈ థ్రిల్లర్ కు మూలం. ఆయన తొలి రచన ’స్టడీ ఇన్ స్కార్లెట్’ లోనే ఈ పధ్ధతిని మొదలు పెట్టాడు. తర్వాత క్రైమ్ థ్రిల్లర్ కథారచన ఎన్నోమార్పులకు గురవుతూ వచ్చింది. అయినా కూడా ఇంకా పాత మూసలోనే కథ (‘లెవెన్’)రాసుకోవటం ఒక విచిత్రమయితే, మళ్ళీ దానిని ’జిరాక్స్’ తీసుకుని ఇంకో చిత్రం (బ్లైండ్ స్సాట్) తీసుకోవటం మరో విచిత్రం.

23 జూన్ 2025

One thought on “అదే కథ, అదే హీరో, అదే ముగింపు.. సినిమాలే వేరు!

  • mschandarPost author

    Please Leave your comments

    Reply

Leave a Reply to mschandar Cancel reply

Your email address will not be published. Required fields are marked *