యంత్రాలు అతడి మాట వింటాయి!
కాఫీ!
ఇలా అంటే తెచ్చేవాడే. కానీ తేలేక పోయాడు. వెళ్ళి తాగుదామని కాఫీ మెషిన్ దగ్గరకు వెళ్ళారు. ఆఫీసులో ఒక్కొక్కరూ. అక్కడే వున్నాడు ఆఫీస్ బోయ్. ఏం చేస్తున్నట్టూ? కాఫీ కలుపుతున్నాడా? లేదే! మరి?
కాఫీ మెషిన్ ను బాగుచేస్తున్నాడు. అంతటి పనివాడే. అవును. పని తెలిసిన వాడు. మెషిన్ బాగయ్యింది. ఆశ్చర్యపోయేంత తీరిక ఆ సిబ్బందికి లేదు. ఎందుకంటే అది మీడియా కార్యాలయం. వారు నిత్యమూ రాసేవి ఆశ్చర్యాలూ, వింతలే.
అతడిపేరు సాయి. ఇరవయ్యేళ్ళుంటాయి. పది వరకే చదివాడు. అంతకు మించి అతడి వల్లకాలేదు. కారణం ఇంటిపేదరికం. అంతేకాదు. అతడికి పాఠాలకన్నా, పరికరాలంటేనే ఆసక్తి. అందరు టీవీని చూడాలనుకుంటారు. సాయి మాత్రం విప్పిచూడాలనుకుంటాడు. ఫాన్ అయినా అంతే. ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటాడు. చెడిపోతే ఎలా బాగు చెయ్యాలన్నది అతడి కుతూహలం. అందుకు అతనికి ’య్యూట్యూబే’ గురువు.

ఆఫీసులో పనిచేసి, పనిచేసి ఇంటి కి వెళ్తాడు. ఇల్లు అంటే ఇల్లు కాదు. రేకుల షెడ్డు. రేకులు నీడనంటే ఇస్తాయి కానీ, సూర్యుడి వేడిని రెండింతలు చేసి లోనికి పంపుతాయి. ఈ వేడిని తట్టుకోవటం ఎలా- అని తలబద్దలు కొట్టుకోలేదు. కూల్ గా ఆలోచించాడు. ఎదురుగా ఒక వాటర్ క్యాన్ కనిపిచింది. ‘ఐ కెన్’ (నేను చెయ్యగలను) అనుకున్నాడు.
కేవలం రిపేరు చేస్తే అతడికి పేరు ఎలా వస్తుందీ? ఏదన్నా కొత్తది తయారు చెయ్యాలి? ఇలా అని అనుకోలేదు కానీ, ఆఫీసులో పనిచేసి, పనిచేసి ఇంటి కి వెళ్తాడు. ఇల్లు అంటే ఇల్లు కాదు. రేకుల షెడ్డు. రేకులు నీడనంటే ఇస్తాయి కానీ, సూర్యుడి వేడిని రెండింతలు చేసి లోనికి పంపుతాయి. ఈ వేడిని తట్టుకోవటం ఎలా- అని తలబద్దలు కొట్టుకోలేదు. కూల్ గా ఆలోచించాడు. ఎదురుగా ఒక వాటర్ క్యాన్ కనిపిచింది. ‘ఐ కెన్’ (నేను చెయ్యగలను) అనుకున్నాడు. అంతే దానినే కూలర్ ఫ్రేమ్ గా చేశాడు. దాంట్లో నీటి స్టోరేజ్ తో పాటు మిగిలిన యంత్రాన్ని తయారు చేసి అమర్చాడు. చల్లటి గాలి. అవసరమే అన్వేషణకు మాతృక. ఇతడి మాట యంత్రాలు వింటాయి. ‘అవి నాతో మాట్లాడుతన్నట్లే అనిపిస్తాయి’ అంటాడు కూడా. ముందు ముందు ఈ సాయి ఇంకేం కనుగుంటాడో?
వార్తాంశం: షహీదా పర్వీన్
శైలి: ‘తెలుగూస్’ డెస్క్
అందరూ పాడైపోయిన వస్తువులలో చెత్తను చూస్తే, అతడు కొత్త దనాన్ని చూసాడు.
అలాగే అందరూ అతనిలో ఆఫీస్ బోయ్ ని చూస్తే మీరు ఒక ఔత్సాహికుడ్ని చూాసారు.
In future definitely he will be in good position with his hard work n knowledge.really good to read this story.
అతను మెదడులో తట్టిన ఆలోచనకు రూపం పోసి, అందరూ పనికిరాదు అని అనుకున్నా వాటిని ఉపయోగించి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా తన నైపుణ్యానికి పదును పెట్టి, అందరిలో శభాష్ అనిపించుకున్నా, యంత్రాల మాంత్రికుడు