FeaturedFilms

అది రెడ్డీ, నాయుళ్ళ ’కులమయ’ సభ !

ఇద్దరు. ఇద్దరు నేతలు. పోనీ మహానేతలు. వారి మీదే సినిమా తీస్తే? ఎప్పుడో (1997లోనే) తీసేశారు గా. పైగా పేరు కూడా ‘ఇద్దరు’ (తమిళంలో ‘ఇరువర్’). ఆ ఇద్దరూ వేరు. ఒకరు: ఎంజీఆర్, ఇంకొకరు: కరుణానిధి. తీస్తే? అలాంటిదే మరొకటి తియ్యకూడదా ఏమిటి? అదీ తెలుగులో. కావాలంటే  తమిళ ప్రేక్షకులు కూడా చూస్తారు. ఇది ‘పాన్ ఇండియా’  యుగం కూడాను. తమిళంలో  ఎంజీఆర్ అంటే, తెలుగునాట ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. కానీ ఆయన గుర్తుకు రాకుండా నారా చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చారు. ఆయనకు సమ ఉజ్జీ? ఇంకెవరు? వై. యస్ రాజశేఖర రెడ్డి.

ఎన్టీఆర్ అనగానే ఆయన మీద ‘బయోపిక్’ లు రావలసినవి వచ్చాయి. ‘కథానాయకుడు’, ’మహానాయకుడు’ అని క్రిష్ ఎన్టీఆర్ జీవితంలో ‘సినిమా’ నూ ’రాజకీయాన్ని’ వేరు పరచి రెండు సినిమాలు తీశారు. ‘వేరు పరచటం’ వరకూ బాగానే వుంది కానీ, ’రాజకీయ జీవితం’లో ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతిని ’మరిచారు’ అని భావించినట్టున్నారు. రామ్ గోపాల వర్మ ఆ భాగాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాగా తీసి వదిలారు. నిజానికి క్రిష్ మరచింది ఎన్టీఆర్ రెండో భార్యను కాదు. రెండో ’వెన్నుపోటు’ను. (మెజారిటీ సభ్యులతో సర్కారును ఏర్పాటు చేసినా ‘వెన్నుపోటు’ అని అంటుంటారు. బహుశా మెజారిటీ కూడ గట్టటంలో ఏదో ’తేడా’ వుండి వుంటుంది.)

ఏమైతేనేం? ఎన్టీఆర్ ను కాకుండా ఇంకో నేతను ఎంచుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు సమవుజ్జీ? వైయస్. రాజశేఖరరెడ్డి. ఇద్దరూ ఎంజీఆర్- కరుణానిధి లాగా ప్రాణ స్నేహితులా? కనీసం స్నేహితులా? కాకుండా ఎలా పోతారు? ఇద్దరికీ ఒకరికొకరు పరిచయం వుంటే చాలదా? ముందు స్నేహితులయితే కదా తర్వాత శత్రువులయ్యేదీ? ఈ ముక్క చాలదా? అల్లుకు పోయారంతే దేవకట్టా, కిరణ్ జయ్ కుమార్ లు మిగతా కథను.

ఈ ఇద్దర్నీ మార్చేశాక, మిగిలిన వాళ్ళు మాత్రం మారకుండా వుంటారా? నందమూరి తారక రామారావు, రాయపాటి చంద్రశేఖరరావు (ఆర్. సి. ఆర్),  ఇందిరాగాంధీ (ఐరావతి బసు) గానూ, రామోజీ రావుని శివాజీ రావుగానూ, నాదెండ్ల భాస్కరరావును చేకూరి బాబూరావు గానూ మార్చకుండా వుంటారా?

‘బయోపిక్’ అనలేదు. అనకూడదు కూడా. అప్పట్లో ‘ఇద్దరు’ తీసిన మణిరత్నం కూడా అనలేదు. అప్పుడే స్వాతంత్య్రం వుంటుంది. పేర్లుకూడా అలా మార్చేసుకుంటే బాగుంటుంది. నారా చంద్రబాబు నాయుడిని కాకర్ల కృష్షమ నాయుడు (కెకెఎస్) అనీ, వైయస్ రాజశేఖర రెడ్డి ని  ఎం.ఎస్. రామిరెడ్డి ని (ఎం. ఎస్. ఆర్) అనీ మార్చేసుకున్నా, ఆ ఇద్దరి కథ తీయనవసరంలేకుండా, ఆ ఇద్దరినీ తియ్యదలచుకున్న కథలో ఇమిడ్చేసుకోవచ్చు. ఈ ఇద్దర్నీ మార్చేశాక, మిగిలిన వాళ్ళు మాత్రం మారకుండా వుంటారా? నందమూరి తారక రామారావు, రాయపాటి చంద్రశేఖరరావు (ఆర్. సి. ఆర్),  ఇందిరాగాంధీ (ఐరావతి బసు) గానూ, రామోజీ రావుని శివాజీ రావుగానూ, నాదెండ్ల భాస్కరరావును చేకూరి బాబూరావు గానూ మార్చకుండా వుంటారా? కల్పితమన్నాక కడగటానికీ వుండదు; అడగటానికీ వుండదు.

తెలుగునాట రాజకీయ చిత్రాలంటే ఓ పదిశాతం రాజకీయం, తొంభయి శాతం క్రైమ్ వుంటుంది. అలాగయితేనే చూస్తారన్న వాణిజ్య అంచనాలుంటాయి తప్పులేదు. క్రైమ్ అంటే ఉత్త క్రైమ్ ఎవడిక్కావాలి? రొమాన్స్ తో ముడిపడ్డ క్రైమ్ వుండాలి. అప్పుడే ’మీర్జాపూర్’ వెబ్ సిరీస్ లాగా పరుగెడుతుంది. తల తెగిన మొండెం, పగిలిన వాటర్ పైప్ లైన్ గా కనిపించేటంత హింస, స్త్రీయే తెగబడి, ఎగబడి పురుషుడి మీద పడేటంత బోల్డ్ రొమాన్స్ ఎపిసోడ్ ఎపిసోడ్ కీ పెరుగుతుంటే, వీక్షకుడు ’థ్రిల్లర్’ రుచిని మరుగుతాడన్న మార్కెట్ సూత్రాన్ని దర్శకులు బాగానే తలకెక్కించుకున్నట్టున్నారు. అందుకు తగ్గట్టుగా నెత్తుటేర్లు పారించటానికి మూడు ‘హింసా క్షేత్రాలు’ దొరికాయి. ఒకటి: సీమ ఫ్యాక్షనిజం రెండు: బెజవాడ మాఫియా, మూడు: అడవిలో నక్సలిజం. నాటు బాంబులు, వేట కొడవళ్ళు, ఎకె ఫార్టీ సెవెన్ తుపాకులు. క్రైమ్ కు ఎంతకు అవకాశం?

’ఇద్దరు’ సినిమాలో అయితే, ఎంజీఆర్ కు జయలలిత లా ఓ పాత్రను సృష్టించవచ్చు. ఆమె ఎంజీఆర్ తర్వాత కరుణానిధికి ప్రధాన రాజకీయశత్రువు అవుతారు. ఇక్కడ ఎలా? అలాంటి పాత్రను సృష్టించాలి.

రొమాన్స్ ఎలా? ఇక్కడే ఇబ్బంది. ’ఇద్దరు’ సినిమాలో అయితే, ఎంజీఆర్ కు జయలలిత లా ఓ పాత్రను సృష్టించవచ్చు. ఆమె ఎంజీఆర్ తర్వాత కరుణానిధికి ప్రధాన రాజకీయశత్రువు అవుతారు. ఇక్కడ ఎలా? అలాంటి పాత్రను సృష్టించాలి. ఏ ‘జయ’ నో ‘దయ’నో సృష్టించలేక కడకు ఒక ‘అనుహారిక’ అంటూ, నిజ జీవితంలో ఎవరి మీదా, ఎలాంటి అనుమానం రాకుండా ఒక పాత్రను తయారు చేశారు. ఆమె పై ‘కెకెఎన్’ కు ప్రేమ పుట్టుకొస్తుంది. ఇక

రెండు దశాబ్దాల చరిత్ర. ఎమర్జన్సీ నుంచి వైస్రాయ్ (సినిమాలో ’ఆశ్రమ్ హొటల్ లెండి) వరకు. ఎమ్. ఎస్. ఆర్ పాత్రతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఎందుకంటే వరసకు మరదలయ్యే అమ్మాయినే ప్రేమించి పెళ్ళి చేసేసుకుంటాడు.

కానీ ‘మయసభ’ వెబ్ సిరీస్ మొదటి సీజన్ (తర్వాత సీజన్ సంగతి తర్వాత.)లోని  సినిమాహంగులూ, ఆర్భాటాలను పక్కన పెడితే. ఈ మొత్తం రాజకీయాలను ’కుల రాజకీయాలు’గా నిర్వచించటం గొప్ప విషయమే. చాలా మామూలుగా ఇద్దరు ’హీరోలూ’ ఒకరినొకరు  ‘నాయుడూ’ ’రెడ్డీ’ అని పిలిచేసుకుంటారు. బెజవాడ మాఫియా కూడా ’కమ్మ -కాపు’ రాజకీయంలాగా ఏ మాత్రం తెరల్లేకుండా చూపించేస్తారు.

నిజ జీవితంలో రాజారెగ కావచ్చు. (ఇందులో బాంబుల శివారెడ్డిగా మార వచ్చు) ఆయనకీ ఓ ముల్లు వుంటుంది. తన సోదరిని ‘అంటరాని కులం వ్యక్తి’ కిచ్చి చేసినందుకు సాటి రెడ్లంతా ’తన కుటుంబాన్ని అంటరాని కుటుంబంగా’ చూశాడంటారు.

పువ్వు పువ్వుగా చూడటం వేరు. పక్కనే వున్న ముల్లుతో చూడటం వేరు. ఉత్త పువ్వునే చూస్తే కేవలం అందంగా వుంటుంది. అదే ముల్లుతో చూస్తే, ఆసక్తి కరంగా వుంటుంది. ’కులమే’ పెద్ద ముల్లు. వైయస్సార్ ను పోలిన ఎమ్మెస్సార్ తండ్రి పాత్ర వుంటుంది. నిజ జీవితంలో రాజారెడ్డి కావచ్చు. (ఇందులో బాంబుల శివారెడ్డిగా మార వచ్చు) ఆయనకీ ఓ ముల్లు వుంటుంది. తన సోదరిని ‘అంటరాని కులం వ్యక్తి’ కిచ్చి చేసినందుకు సాటి రెడ్లంతా ’తన కుటుంబాన్ని అంటరాని కుటుంబంగా’ చూశాడంటారు. అలాగే ‘నాయుడు’ ని ‘పొలం దున్నుకునే కులంలో పుట్టావ్. నీకు రాజకీయాలెందుకురా’ అని అదే రెడ్లు అవమానిస్తారు. హీరోల వెనుక వున్న ’కులం’ ముల్లును అలా చూపిస్తే, అనుహారికకు ’జెండర్’ ముల్లును తగిలిస్తారు. ఒక ‘చౌదరి’ వుంచుకున్నామె కూతురిగా ఆమెను చూపి ఆమె నిత్యమూ అవమానానికి గురి కావటాన్ని ఇంకో ముల్లుగా చూపిస్తారు.

నాయుడు (కెకెఎస్) పాత్ర మీద అదనపు సానుభూతి కలగటానికి ’ముల్లు’ మీద ’ముల్లు’ గుచ్చుతారు. ఉత్తనే ’పొలం దున్నుకునే కులం లో పుట్టినవాడు’ అంటే సానుభూతి తన్నుకు రాదు అనుకున్నారో ఏమో, అదనగా ఆయనకో వైకల్యాన్ని చేర్చారు. అదే ‘నత్తి’(Stuttering). నత్తి వున్నవాడు ఉపన్యాసం ఎలా ఇస్తాడు? ఉపన్యాసం ఇవ్వలేని వాడు నాయకుడు ఎలా అవుతాడు? పాయింటే కదా? దీనిని బాగు చెయ్యటానికి ఓ వైద్యుడు కావాలి. వేరే వైద్యుడు ఎందుకు? ఎలాగూ సాటి హీరో ’రెడ్డి’ (ఎం.ఎస్. ఆర్) వైద్యుడే కదా! అతని చేతే వైద్యం చేయించేస్తే పోలా? ఈ ’నాయకుడు- నత్తి’ అంశం బాగానే రక్తి కట్టింది. ఎందుకు కట్టదూ? ఇదే పాయింటు మీద టామ్ హూపర్ తీసిన సినిమా ‘ది కింగ్స్ స్పీచ్’ (2010) కు ఏకంగా నాలుగు ’ఆస్కార్’ లు వచ్చాయి. ఆరవ కింగ్ జార్జ్ గా కిరీటం ధరించాల్సిన ప్రిన్స్ ఆల్ బెర్ట్ కు కూడా నత్తి వుంటుంది. ప్రజల ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడెల్లా అభాసు పాలవుతుంటాడు. నాజీల మీద యుధ్ధం ప్రకటించే సందర్భంలో జాతినుద్దేశించి రేడియలో మాట్లాడాల్సి వుంటుంది. డాక్టర్ అందించిన చికిత్స వల్ల ఆల్ బెర్ట్ నత్తిలేకుండా మాట్లాడతాడు. ’మయసభ’ లో నాయుడుకి కూడా అలాంటి సన్నివేశం వస్తుంది. ఇందిరాగాంధీని పోలిన ప్రధాని ఐరావతి బసు సమక్షంలో జనం ముందు తడబడకుండా ఉపన్యాసం నాయుడు ఉపన్యాసం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ’రెడ్డి’ గారి వైద్యం పని చేస్తుంది.

అయితే ఇన్ని ’కులపరమైన అవమానాలను’ రెడ్డి, నాయుళ్ళ పాత్రలు సైతం పొందినట్లు చూపిన దర్శక రచయితలు, ఎందుకనో ’రాబర్ట్ కుమార్’ అనే షెడ్యూల్డు కులాల ఎమ్మెల్యే పాత్రను – సానుభూతి కలిగేటట్టు కాదు కదా- పూర్తి ఏవగింపు కలిగేటట్లు చూపిస్తారు. తాగి అసెంబ్లీకి రావటం కాదు, అసెంబ్లీకి వచ్చి తాగుతున్నట్లూ, జోగుతున్నట్లూ చూపారు. అక్కడితో ఆగారా? ఒకానొక ఘడియలో, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ‘రెడ్ల’కు కాకుండా ‘ఎస్సీ’ వర్గాలకు ఇవ్వాలని కోరుకుంటారు ప్రధాని ఐరావతి బసు. అప్పడు రాబర్ట్ కుమార్ ను పిలిపిస్తారు. అక్కడికి ఎమ్.ఎస్. ఆర్ ను వెంటబెట్టుకుని వెళ్తాడు రాబర్ట్ కుమార్. అప్పడు కూడా పూర్తిగా తాగి వెళ్తాడు. ‘నువ్వే సీఎంవి’ అనగానే, కాళ్ళ మీద సాష్టాంగ పడి లేచి వెళ్ళబోతూ, మళ్లీ వచ్చి ఆమె చేతుల్ని ముద్దు పెట్టుకోవటానికి వంగి ’బ్రేవ్’ మని తేల్చగానే ఐరావతి  ఆ వాసనను తట్టుకోలేక పోతారు. రాష్టం తిరిగి వచ్చిన రాబర్ట్ కుమార్, శాసన సభ్యులకు విందు ఇస్తూ ఊగిపోతుంటే, అతణ్ణి ఆ పదవి నుంచి తొలగించి, ఇంకో బడుగు వర్గ నేతకు ఇస్తున్నట్లు ఆమె ప్రకటిస్తారు. అంటే ఎస్సీ నేతల్లో కూడా ఇలాంటి వారుంటారనా? ఎస్సీనేతలంటేనే ఇలా వుంటారనా? ఇదే గడ్డ మీద తాగే ఇతర వర్ణాల నేతలు ముఖ్యమంత్రులు కాలేదా? ముఖ్యమంత్రులయ్యాక తాగలేదా? అలాంటి పేరున్న వారు స్ఫురణకొచ్చే పాత్రల్ని కూడా మర్యాదగా తీశారే? మరి రాబర్ట్ కుమార్ దగ్గరే దర్శక రచయితలు ఎందుకు శ్రుతి తప్పినట్లూ? ఒక వేళ రెండో సీజన్ లో  రాబర్ట్ కుమార్ చేత మజ్జిగ తాగిద్దామనుకుంటున్నారేమో? ఎవరికి తెలుసు? చిత్రమేమిటంటే అంతమంది శాసన సభ్యుల్లోనూ ‘రాబర్ట్ కుమార్’ ఒక్కడే ఫుల్ స్యూట్ లో వుంటాడు. ఆవర్గానికి చెందిన ఏదయినా రిటైర్డ్ ఐయ్యేఎస్ అధికారి అని చెప్పదలచుకున్నారో ఏమో?

’రాబర్ట్ కుమార్’ అనే షెడ్యూల్డు కులాల ఎమ్మెల్యే పాత్రను – సానుభూతి కలిగేటట్టు కాదు కదా- పూర్తి ఏవగింపు కలిగేటట్లు చూపిస్తారు. తాగి అసెంబ్లీకి రావటం కాదు, అసెంబ్లీకి వచ్చి తాగుతున్నట్లూ, జోగుతున్నట్లూ చూపారు.

కమెడియన్ లేక ఇతన్ని కమెడియన్ చేశారేమోనని పొరపడటానికి వీల్లేదు. భాస్కరరావు ను స్ఫురింప చేసే బాబూరావు పాత్ర చేత ఉత్త కామెడీయేమిటి? ఏకంగా ’బఫూనరీ’యే చెయ్యించారు. తనను ముఖ్యమంత్రి చేస్తానన్న ఐరావతి కొడుకు రోడ్డు ప్రమాదంలో (విమానప్రమాదం అంటే బాగుండదనుకున్నట్టున్నారు.) మరణిస్తే, అతని శవపేటిక మీద పడి  గిలా గిలా కొట్టుకుంటూ బావురుమన్న సన్నివేశం ఎలాగూ వుంది. ఇది చూసినప్పుడు వీక్షకుడికి నవ్వు రావచ్చు. రాక పోవచ్చు.‘బఫూనరీ’ అంటే అదే కదా? ఆ పాత్రను ’బఫూన్’ చేశాక, ‘రాబర్ట్ కుమార్’ లాంటి పాత్ర అవసరమంటారా?

మయసభలో ’ఇద్దరి’ హీరోల (నాయుడు, రెడ్డిలకీ) ని సమానంగా చూపటానికి ప్రయత్నించారు దర్శక, రచయితలు. కానీ ఎవరు ‘ఎక్కువ సమానులో’ అంటే నాయుడే ఎక్కువ. అంత పెద్ద రెడ్డీనీ (వైయస్సార్ ని తలపించే, ఎమ్మెస్సార్నీ) , చాలా చోట్ల నాయుడికి ‘సైడ్ కిక్’లో చూపించారు. నాయుడు పెళ్ళిచూపుల్లోనూ, నాయుడిని ’తెలుగు నాడు’ పార్టీ చేర్పించటంలోనూ ’తోడు’గా చూపించేశారుగా. అంతే కాదు. నాయుడు ’వెన్నుపోటు’, ఆశ్రయ్ హొటల్ సాక్షిగా ’తిరుగుబాటు’ గా మలుస్తారు. మరి  అంతకుముందే చూపాల్సిన బాబూ రావు ’వెన్నుపోటు’ను సౌకర్యవంతంగా మరచినట్టున్నారు. నిజ జీవితంలో ఆ పాత్రను స్పురింప చేసే మాజీ ముఖ్యమంత్రి తనయుడు మంత్రిగా వున్నారనా?  అయితే కావచ్చు.

కథ చెప్పేశాక ‘ఇందులో నీతి ఏమిటి?’ అని అడగటం పాతకాలపు అలవాటు. ఇందులో నీతిలేదు కానీ రాజనీతి వుంది: నాయుడూ, రెడ్డీ స్నేహితులే. ఎటొచ్చీ పేచీ వుంటే రెడ్డి కొడుకుతోనే. అంటే రెడ్డి కున్న గొప్పలక్షణాలు రెడ్డి కొడుక్కి లేవని పరోక్షంగా చెప్పటం. దీని వల్ల ఇప్పుడు అధికారంలో వున్న ’నాయుడి’కి  కొంత మేలేమో? తెలియదు.

5 thoughts on “అది రెడ్డీ, నాయుళ్ళ ’కులమయ’ సభ !

  • హారి

    Good artical.keep it satishandar

    Reply
  • సినిమాలను, వెబ్ సిరీస్ లను వినోదం కోసం చూసి ఎలా వదిలేయచ్చో అలాగే దానిలో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్ధిక తదితర కోణాలను విశ్లేషించవచ్చు. దేవకట్ట, కిరణ్ జయ్ కుమార్ సృష్టించిన ఈ మయసభ వెబ్ సిరీస్ లో రాబర్ట్ కుమార్ లాంటి పాత్రను విశ్లేషించి క్రిటిక్ మనకు ఆ పాత్రలో దాగి ఉన్న సామాజిక కోణాన్ని తేటతెల్లం చేసారు. అయినా ఏ సినిమా ఏ ప్రయోజనం కోసం తీసారో తీసినవాళ్లకే తెెలియాలి.

    Reply
  • బోడపాటి సుధీర్ కుమార్

    రాబర్ట్ అయినా రోబోట్ అయినా బఫూన్ గా చిత్రీకరించడానికి ఒకే ఒక్కటి చాలు అది కూడా ఆ పేరు వెనుక దాగివున్న కులం ఒక్కటి చాలు, అదీ ఒక అణగారిన కులం అయితే ఇంకా మేలు ఏమైనా అనచ్చు ఏమైనా చెయ్యొచ్చు అదేనండీ.. బఫూన్ గా లేకుంటే త్రాగుబోతుగా అని. ఎదిగిన కులాలే రాజకీయ కులాలు ఇక్కడ, అణగారిన కులాలు రాజకీయానికి పనికిరావు అన్నట్లుంది ఈ “రెడ్డీ నాయుళ్ళ కు(గు)లమయ సభ”.

    Reply
  • S.naveen goud

    Such a wonderful criticism about mayasabha, really loved it sir.after watching mayasabha series,I read this article 100 percent you catched exactly positives n negatives of this series story.sir u explained clearly about faults of some characters in series.if series director’s will read this article then in future they will definitely overcome the mistakes while writing character’s.nice of u sir.

    Reply
  • పట్టుపోగుల పవన్ కుమార్

    మయసభ వెబ్ సిరీస్ ను చాలా చక్కగా విశ్లేషించారు సార్,ఒక రిజర్వడ్ నియోజకవర్గం నుండి ప్రజల చేత ఎన్నిక కాబడిన నాయకుడిని తాగుబోతు గా,బద్దకస్తుడిగా చూపించడం చూసేందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది,ప్రజా ప్రతినిధుల పైన సినిమా లేదా వెబ్ సిరీస్ తీసేటప్పుడు దర్శకులు చాలా జాగ్రత్తగా తీయాలి,ఎవరికో మేలు చేసేందుకు చూసి మరొకరిని కించ పరిచే విధంగా ఉండకూడదు,ఒక అవాాస్తవాన్ని ఇలాగ చూపిస్తే ప్రజలు వాస్తవం అనుకునే ప్రమాదం ఉంది, నైపుణ్యం ఉన్న రాజకీయాలపై వెంబడించే వర్గాలకు ఆసక్తి రాకుండా కుట్ర పూరితంగా నడిపించే వర్గాలు తర తరాలుగా ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు,విజయవంతం అవుతున్నారు. దానికి తోడు కేవలం రెండు కులాలకు మాత్రమే రాజకీయం సొంతం అనేట్లుగా ఈ ‘మయసభ’ లో చూపించారు.

    Reply

Leave a Reply to బోడపాటి సుధీర్ కుమార్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *