FeaturedTwittorials

‘అగ్ర’వాది ఈల వేశాడు, ‘ఉగ్ర’వాది ఆగుతాడా?

‘ఆటకు అటూనేనే, ఇటూ నేనే. ఆంపైర్ నీనేనే’ అని అనుకున్నారు ట్రంప్. ఈల వేశారు ఇరాన్ భగ్గుమంది. ఈల వెయ్యకుండానే ఖతార్ గ్యాస్ ప్లాంటు భగ్గుమంది. ఇప్పుడు ఈల వేసినా ఆట ఆగేట్టు లేదు. అగ్రవాది ఆడుతుంటే ఉగ్రవాది చూస్తుంటాడా? బడాయి కొద్దీ ’అగ్ర‘ వాదిననుకుంటాడు. అతనూ ‘ఉగ్ర’ వాదే. కాకుంటే ఆర్థిక ఉగ్రవాది. ‘అగ్ర’ వాదులూ అన్నిబాంబులూ వాడతారు. ‘ఉగ్ర’ వాది ఇంకో బాంబును అదనంగా వాడతాడు. అదే మానవ బాంబు. అంటే మరేమీ కాదు దేహం దేహమే బాంబయిపోతుంది. ఇరాన్ ఈ బాంబును ఉన్నతీకరించింది. దేహాన్ని కాదు, దేశాన్ని దేశాన్నే మానవబాంబుగా మార్చేసుకుంది. గ్యాస్, చమరు ఉత్పత్తి కేంద్రాలను తుత్తునియలు చేస్తోంది.  పాపం! ట్రంప్ కు ఇప్పుడు యుధ్ధం ఆపాలని వుంది. ‘వైండింగ్ డౌన్’[1] చేసే ప్రతిపాదన ట్రంప్ కుందని ట్రంప్ పోస్ట్ కూడా పెట్టేశాడు. ఇరాక్ వినాలి కదా?

-సర్


[1] https://x.com/WhiteHouse/status/2035105078214808041

One thought on “‘అగ్ర’వాది ఈల వేశాడు, ‘ఉగ్ర’వాది ఆగుతాడా?

  • అగ్రవాది ఉగ్రవాది ఇద్దరు ప్రపంచానికి ప్రమాదకారులే

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *