FeaturedTwittorials

‘అగ్ర’వాది ఈల వేశాడు, ‘ఉగ్ర’వాది ఆగుతాడా?

‘ఆటకు అటూనేనే, ఇటూ నేనే. ఆంపైర్ నీనేనే’ అని అనుకున్నారు ట్రంప్. ఈల వేశారు ఇరాన్ భగ్గుమంది. ఈల వెయ్యకుండానే ఖతార్ గ్యాస్ ప్లాంటు భగ్గుమంది. ఇప్పుడు ఈల వేసినా ఆట ఆగేట్టు లేదు. అగ్రవాది ఆడుతుంటే ఉగ్రవాది చూస్తుంటాడా? బడాయి కొద్దీ ’అగ్ర‘ వాదిననుకుంటాడు. అతనూ ‘ఉగ్ర’ వాదే. కాకుంటే ఆర్థిక ఉగ్రవాది. ‘అగ్ర’ వాదులూ అన్నిబాంబులూ వాడతారు. ‘ఉగ్ర’ వాది ఇంకో బాంబును అదనంగా వాడతాడు. అదే మానవ బాంబు. అంటే మరేమీ కాదు దేహం దేహమే బాంబయిపోతుంది. ఇరాన్ ఈ బాంబును ఉన్నతీకరించింది. దేహాన్ని కాదు, దేశాన్ని దేశాన్నే మానవబాంబుగా మార్చేసుకుంది. గ్యాస్, చమరు ఉత్పత్తి కేంద్రాలను తుత్తునియలు చేస్తోంది.  పాపం! ట్రంప్ కు ఇప్పుడు యుధ్ధం ఆపాలని వుంది. ‘వైండింగ్ డౌన్’[1] చేసే ప్రతిపాదన ట్రంప్ కుందని ట్రంప్ పోస్ట్ కూడా పెట్టేశాడు. ఇరాన్ వినాలి కదా?

-సర్


[1] https://x.com/WhiteHouse/status/2035105078214808041

5 thoughts on “‘అగ్ర’వాది ఈల వేశాడు, ‘ఉగ్ర’వాది ఆగుతాడా?

  • అగ్రవాది ఉగ్రవాది ఇద్దరు ప్రపంచానికి ప్రమాదకారులే

    Reply
  • V. Bheemanna

    అగ్రవాది అహంకారి మరియూ ప్రపంచం మొత్తం నా మాటే వినాలి లేదా నేను ఊరుకోను. ఏమిచేస్తానంటే నాశనం చేస్తా. ఇదీ అగ్రవాది పంతం. కానీ ఉగ్రవాది కదా ఎందుకు వింటాడు. వినడు కానీ అగ్రివాది అంతకంటే ఉగ్రవాది. ఉగ్రవాధులకే ఉగ్రవాది. అయితే వారిద్దరి మధ్య ప్రపంచం నలిగి పోతుంది.

    Reply
  • BODAPATI SUDHEER KUMAR

    అగ్రవాదిని అనుకున్నాడు ట్రంప్, కానీ ఇరాన్ వాడు మాత్రం ట్రంప్ ని అలా అనుకోలేదు, మరేమనుకున్నాడు ? అదే కదా చెప్తా ట్రంపుని ‘అడుక్కునేవాది’ అనుకున్నాడు ఇరాన్ వాడు. ఇప్పుడు ఇరాన్ వాడిని ట్రంప్ ఆపండ్రా బాబూ అన్నా, మళ్ళీ మళ్ళీ యిలాంటి అవకాశం వస్తుందో రాదో అని ఇరాన్ వాడు టపాసులు పేల్చినట్లుగా మిసైల్స్ వేస్తున్నాడు అమెరికా ఆధీనంలో నడుస్తున్న అరబ్ దేశాలపై, ట్రంప్ ఆ ఇది excursion అని అన్నాడు కొంచెం మోత మోగించిన తరువాత, మరి ఉగ్రవాదిని రెచ్చగొట్టాక ఆగమంటే ఆగుతాడా ? ఇరాన్ వాడు రెచ్చిపోయి నీకు excursion అయితే , ఇది నాకు దీపావళి 🪔 అని పక్కదేశాలపై మిస్సైల్ వాలాలను డ్రోన్లతో బాంబుల వర్షాన్ని చమురు 🛢️ ఉత్పత్తి చేసే కంపెనీలపైన అలాగే విమానాశ్రయాలపైన వేసి అగ్రవాదికి ఉగ్రవాది ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు, కానీ మిత్ర దేశాలు కూడా కనీసం ఈ యుద్ధ వాతావరణాన్ని నివారించే ప్రయత్నాలు పెద్దగా చేకపోవడం చాలా బాధాకరమనిపించింది. యుద్ధాలు మిగిల్చేవి చేదు జ్ఞాపకాలే కానీ, గొప్ప విజయాలు మాత్రం కాదు అని చరిత్ర చెబుతుంది అనే విషయాన్ని ప్రతి దేశం గ్రహింపుతో నడుచుకోవాలని కోరుకుంటూ, ఈ వ్యాసాన్ని వ్రాసి అందించిన మా గురువుగారికి అభినందనలు తెలియజేస్తున్నాను 💐🙏🏻

    Reply
  • Rojaranee

    యుద్ధం ఆగేది ఎప్పుడో కానీ సతీష్ చంద్ర గారు రాసిన వ్యాసం మాత్రం అద్భుతం. నేడు ప్రతి ఇంట వంటింట గ్యాస్ తో యుద్ధమే జరుగుతుంది. చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు వాళ్ళ జీవనాధారం కుంటుపడింది. వారి గోడు వింటుంటే బాధ కలుగుతుంది. కానీ ప్రపంచ యుద్దోన్ మాధులకు వారి గోడు పట్టదు కదా. పాలించే పాలకుల తీరు మారనంతవరకు ప్రజల గోస ఇట్లానే ఉంటది. బడా బాబులకు బాదే లేదు. చిన్న మధ్యతరగతి ప్రజలకే ఈ తిప్పలు.

    … రోజా రాణి

    Reply
  • Jagafish

    అగ్రవాదిగా ,ఉగ్రవాదిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ట్రంప్

    పాత్రలతో పని లేని ప్రాచీన యుగంలోకి ఇరాక్

    ప్రపంచ దేశాలు దీని గురించి నో టాక్

    ఇజ్రాయులకు వస్తుంది రోజురోజుకి చికాక్

    మా గురువుగారు ఫీచర్ ఎప్పటికి టాపర్

    Reply

Leave a Reply to Ramu Cancel reply

Your email address will not be published. Required fields are marked *